ఏడాదిలోని అన్ని నెలలకు 30 రోజులు లేదా 31 రోజులు ఉంటాయి. కానీ ఫిబ్రవరి నెలకు మాత్రం 28 రోజులు లేదా 29 రోజులు ఉంటాయి. ఎప్పుడైనా ఎందుకు ఫిబ్రవరి నెలకు మాత్రమే ఇలా ఉందని ఆలోచించారా?, ఒకవేలా ఆలోచించినా సమాధానం దొరకలేదా?, అయితే మీ సందేహానికి సమాధానమే ఈ కథనం..
ప్రాచీన రోమన్ క్యాలెండర్
ఫిబ్రవరి నెలకు తక్కువ రోజులు ఉండటానికి కారణం ప్రాచీన రోమన్ క్యాలెండర్ అని తెలుస్తోంది. నిజానికి కొన్నేళ్ల క్రితం సంవత్సరానికి 10 నెలలు మాత్రమే ఉండేది. కాలక్రమంలో.. తరువాతి రోజుల్లో రాజు నూమా పోంపిలియస్ జనవరి, ఫిబ్రవరి నెలలను చేర్చారు. రోమన్లు ప్రారంభంలో సరిసంఖ్యలను అపశకునాలకు ప్రతీకగా భావించేవారు. అందుకే ఎక్కువ నెలలకు 29 లేదా 31 రోజులుగా నిర్ణయించారు.
అందుకే చిన్న నెలగా
అప్పట్లో ఫిబ్రవరి నెలను పాప పరిహారం చేయడానికి, శుద్ధి కర్మలు చేయడానికి ప్రత్యేకంగా నిర్ణయించుకున్నారు. దీనివల్లనే అది చిన్న నెలగా మారిందని చెబుతారు. కొన్ని సంవత్సరాల తరువాత రోమన్ చక్రవర్తి.. జూలియస్ సీజర్ క్యాలెండర్లో చాలా పెద్ద మార్పులు చేశారు. ప్రస్తుతం ఏడాదికి 365 రోజులు ఉండటానికి కారణం ఆయన చేసిన మార్పులే. క్యాలెండర్ సంవత్సరం ఏడాదికి 365 రోజులు ఉండాలని అప్పట్లోనే నిర్ణయించారు.
అలా 365 రోజులు..
నిజానికి భూమి సూర్యుని చుట్టూ తిరిగే కాలం 365 రోజుల కంటే కొంత ఎక్కువగా ఉంటుందని, అందుకే నాలుగేళ్లకు ఒకసారి 366 రోజులు (లీప్ సంవవత్సరం) అయ్యాయి. సాధారణ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో 28 రోజులు, లీఫ్ ఇయర్లో ఫిబ్రవరి నెలలో 29 రోజులు వస్తున్నాయి. ఆ తరువాత గ్రెగోరియన్ క్యాలెండర్ వచ్చినప్పటికీ.. ఇదే విధానం కొనసాగింది. ఇప్పుడు ఆధునికులు కూడా దీనిని ఫాలో అవుతున్నారు.
ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే.. ఫిబ్రవరి నెలకు 28 రోజులు లేదా చిన్న నెలగా ఉండటానికి కారణం ప్రకృతి కాదు. దీనికి కారణం మనుషులు రూపొందించిన ప్రాచీన క్యాలెండర్ వ్యవస్థ. పురాతన రోమన్ నిర్ణయాలు & విశ్వాసాలు మాత్రమే కాకుండా.. ఆ తరువాత చేసిన అనేక సవరణలు ఏడాదికి 365 రోజులని ధృవీకరించాయి.
మరో ప్రత్యేకం..
ప్రతి నెలలోనూ తప్పకుండా నాలుగు ఆదివారాలు, నాలుగు సోమవారాలు, నాలుగు మంగళవారాలు, నాలుగు బుధవారాలు, నాలుగు గురువారాలు, నాలుగు శుక్రవారాలు, నాలుగు శనివారాలు ఉంటాయి. ఇందులో కొన్ని ఆదివారాలు, సోమవారాలు, మంగళవారాలు, బుధ, గురు, శుక్ర, శనివారాలు 5 రోజులు వస్తాయి. కానీ ఫిబ్రవరికి మాత్రం 28 రోజులు కాబట్టి.. ఆదివారం నుంచి శనివారం వరకు అన్ని రోజులు.. నాలుగుసార్లు రిపీట్ అవుతాయి. ఈ ఏడాది (2026 ఫిబ్రవరి) కూడా ప్రతి రోజు వారానికి నాలుగు సార్లు వచ్చింది.
వాతావరణంలో మార్పు & పండుగలు
ఫిబ్రవరి నెల చిన్నదే అయినప్పటికీ.. వాతావరణంలో మార్పు (శీతాకాలం నుంచి ఎండకాలం), ముఖ్యమైన పండుగలు (మహా శివరాత్రి) వంటివి ఈ నెలలోనే జరుగుతాయి. రోమన్లు దీనిని అశుభానికి ప్రతీక నెలగా భావించినప్పటికీ.. భారతీయులు మాత్రం ఈ నెలలో పవిత్రమైన శివరాత్రి జరుపుని తరిస్తారు. అంతే కాకుండా ప్రపంచ ప్రేమికుల దినోత్సవం కూడా ఈ నెలలోనే జరుపుకుంటారు.
శౌర్య వర్ధన్ సబ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. సినిమా, రాజకీయం వంటి విభిన్న అంశాలపై సమగ్రమైన ఆర్టికల్స్ అందిస్తూ వస్తున్నాను. ఈ రంగంలో నాకు నాలుగు సంవత్సరాల అనుభవం ఉంది. రాయడంలో నైపుణ్యంతో, చదువరులకు స్పష్టమైన మరియు ఆసక్తికరమైన కంటెంట్ అందించడం నా లక్ష్యం.