బైక్ vs స్కూటర్: ఎక్కువ పెట్రోల్ దేనికి అవసరం, ఎందుకు?

సాధారణంగా భారతదేశంలో చాలామంది రోజువారీ వినియోగానికి బైక్ లేదా స్కూటర్ కొనుగోలు చేసి, వినియోగిస్తుంటారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే బైక్ ఎక్కువ ఇంధనం (పెట్రోల్) ఉపయోగిస్తుందా?.. స్కూటర్ ఎక్కువ ఇంధనం ఉపయోగిస్తుందా?. ఈ కథనంలో మీ అనుమానానికి సమాధానం తెలుసుకుందాం.. కారణాలు కూడా చూసేద్దాం.

సింపుల్ పద్దతిలో విశ్లేషించుకుంటే.. పరిమాణం, బరువు, ఇంజిన్ కెపాసిటీ, రైడింగ్ స్టైల్ వంటివి పరిగణలోకి తీసుకోవాలి. వీటిని పరిగణలోకి తీసుకుంటే.. సులభంగా అర్థమైపోతుంది.

పరిమాణం

బైక్.. స్కూటర్ రెండూ టూవీలర్స్ అయినప్పటికీ.. పరిమాణంలో భిన్నంగా ఉంటాయి. అంటే స్కూటర్ కంటే బైక్ కొంత పెద్దదిగా ఉంటుంది. అంటే బరువు కూడా ఎక్కువే ఉంటుందన్న మాట. వెహికల్ బరువు ఎక్కువ ఉన్నప్పుడు, అది ముందుకు కదలాలంటే.. ఇంధనం కొంత ఎక్కువ కావాల్సిందే. కాబట్టి బైక్ ఫ్యూయెల్ వినియోగం కొంత ఎక్కువగానే ఉంటుంది.

ఇక స్కూటర్ పరిమాణంలో చిన్నదిగా ఉండటమే కాకుండా.. బరువు కూడా బైక్ కంటే తక్కువగానే ఉంటుంది. అంటే తేలికైన వాహనాల వినియోగానికి ఎక్కువ ఫ్యూయెల్ అవసరం లేదు. బైక్ కొంత ఎక్కువ ఫ్యూయెల్ వినియోగిస్తుంది అని చెప్పడానికి ఒక ప్రధాన కారణం.

ఇంజిన్ కెపాసిటీ

ఫ్యూయల్ వినియోగంలో ప్రధాన పాత్ర ఇంజిన్ మీదనే ఉంటుంది. ఉదాహరణకు బైకులో 350 సీసీ ఇంజిన్, 650 సీసీ ఇంజిన్ 1100 సీసీ ఇంజిన్స్ కూడా ఉంటాయి. 350 సీసీ బైక్ 40 కిమీ/లీ మైలేజ్ అందిస్తే.. 650 సీసీ ఇంజిన్ 25-30 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. అదే 1100 సీసీ ఇంజిన్ విషయానికి వస్తే.. దీని మైలేజ్ చాల తక్కువే ఉంటుంది. ఇలాంటి ఇంజిన్స్ దాదాపు బైకుల్లోనే ఉంటాయి.

స్కూటర్ల విషయానికి వస్తే.. స్కూటర్ మహా అంటే 125 సీసీ, 150 సీసీ, 250 సీసీ ఇంజిన్ ఎంపికలలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ ఇంజిన్ కెపాసిటీ తక్కువ కాబట్టి.. ఫ్యూయెల్ వినియోగం కూడా తక్కువగానే ఉంటుంది. లాంగ్ రైడ్ చేయడానికి కూడా స్కూటర్లు అంత కంఫర్ట్ కాదు.

సీవీటీ ట్రాన్స్‌మిషన్ / గేర్స్

స్కూటర్లలో.. కంటిన్యూయస్లీ వేరియబుల్ ట్రాన్స్‌మిషన్ (సీవీటీ) ఉంటుంది. ఇది ఇంజిన్‌ను అధిక ఆర్పీఎం దగ్గర ఉంచుతుంది. అయితే బైక్ మాన్యువల్ గేర్ సిస్టం పొందుతుంది. తద్వారా ఇంధన వినియోగం కొంత ఎక్కువగానే ఉంటుంది. పనితీరు విషయంలో రెండూ వేరువేరుగా ఉంటాయి. వేగంగా.. దూర ప్రయాణం చేయడానికి బైక్ ఉపయోగపడుతుంది. స్కూటర్ చిన్న దూరాలకు, నగరంలో ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది.

రైడింగ్ స్టైల్

ఇంధన వినియోగం.. రైడింగ్ స్టైల్ మీద కూడా డిఫెండ్ అయి ఉంటుంది. అంటే.. మైలేజ్ అనేది బైక్ లేదా స్కూటర్ రైడ్ చేసే రైడర్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఒక నిర్దిష్ట వేగంతో బైక్ నడిపితే.. మైలేజ్ కొంత ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ట్రాఫిక్ లేదా గతుకులు రోడ్డుపై రైడింగ్ చేస్తే.. ఫ్యూయెల్ వినియోగం కొంత ఎక్కువగా ఉంటుందనేది నిజం. అంతే కాకుండా స్కూటర్లు ప్రత్యేకించి చిన్న దూరాలకు నిర్దేశించి ఉంటాయి. బైక్ విషయంలో ఇది వేరుగా ఉంటుంది.