ప్రముఖ నటి త్రిష కృష్ణన్ వ్యక్తిగత జీవితం గురించి సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల చెన్నైలో జరిగిన వివాహ వేడుకలో త్రిష-విజయ్ కలిసి కనిపించడం అభిమానుల్లో & నెటిజన్లలో కొత్త ఊహాగానాలకు దారితీసింది. దీంతో త్రిష నిశ్చితార్థం ఎందుకు క్యాన్సిల్ అయిందనే విషయం మళ్లీ తెరమీదకు వచ్చింది.
2026 మార్చి 5న చెన్నైలో.. ప్రముఖ నిర్మాత కల్పతి ఎస్. సురేష్ & మీనాక్షి సురేష్ కుమారుడి రిసెప్షన్‌కు అనేక సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకకు త్రిష, విజయ్ కూడా వెళ్లారు. దీంతో సోషల్ మీడియాలో ఈ ఇద్దరిపై రూమర్లు మళ్లీ మొదలయ్యాయి. ఇప్పటికే విజయ్ వ్యక్తిగత జీవితం కూడా వార్తల్లో నిలిచింది. ఆయన భార్య సంగీత సొర్నలింగం 2025 డిసెంబర్‌లో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం బయటకు రావడంతో ఈ చర్చలు మరింతగా ముదిరిపోయాయి.
మళ్లీ వార్తల్లోకి త్రిష నిశ్చితార్థం!
విజయ్-త్రిష సంబంధంపై వస్తున్న ఊహాగానాల మధ్య, త్రిషకు గతంలో క్యాన్సిల్ అయిన నిశ్చితార్థం కూడా మళ్లీ సోషల్ మీడియాలో చర్చకు వచ్చింది. 2015లో త్రిష చెన్నైకు చెందిన వ్యాపారవేత్త వరుణ్ మణియన్‌తో నిశ్చితార్థం జరిగింది. ఆ తరువాత ఎం జరిగిందో ఏమో తెలియదు, కానీ కొన్ని నెలల తర్వాత ఈ నిశ్చితార్థం రద్దు అయింది. అప్పట్లో కూడా ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దీనిపై త్రిష కూడా క్లారిటీ ఇచ్చేసింది.
నిశ్చితార్థం క్యాన్సిల్ అవ్వడానికి కారణం
త్రిష నిశ్చితార్థం క్యాన్సిల్ అయిన తరువాత.. ఆమె స్పందిస్తూ, నేను సంతోషంగా సింగిల్‌గా ఉన్నాను అని పేర్కొంది. తనను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి సినిమాల్లో నటించడం మానేయాలని కోరాడని అందుకే ఆ నిశ్చితార్థం రద్దు చేసుకున్నట్లు కొన్ని రోజుల తరువాత త్రిష ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. సినిమాలను వదిలేయడం కన్నా నిశ్చితార్థాన్ని ముగించుకోవడానికే తాను నిర్ణయం తీసుకున్నానని ఆమె చెప్పారు. తన జీవితంలో చివరి వరకు సినిమాల్లో నటించాలనే తన కోరికను కూడా వెల్లడించారు.
పార్తిబన్ వ్యాఖ్యలపై.. త్రిష స్పందన
ఇదిలా ఉండగా.. ఇటీవల మరో వివాదం కూడా త్రిష పేరును వార్తల్లోకి తీసుకొచ్చింది. ఒక కార్యక్రమంలో నటుడు – దర్శకుడు ఆర్. పార్తిబన్ చేసిన వ్యాఖ్యలపై త్రిష తీవ్రంగా స్పందించారు. ఒక అవార్డు కార్యక్రమంలో త్రిష ఫోటో స్క్రీన్‌పై కనిపించినప్పుడు పార్తిబన్ ఆమె పేరును ప్రస్తావించకుండా, ”ఈ కుందవై కొంతకాలం ఇంట్లోనే ఉండాలి. బయటకు రాకుండా ఉండటమే మంచిది” అని అన్నారు.
ఈ వ్యాఖ్యలపై త్రిష సోషల్ మీడియా వేదిక Xలో స్పందించారు. ”మైక్ చేతిలో ఉండటం వల్ల వ్యాఖ్య తెలివైనదిగా మారదు. అది కేవలం అజ్ఞానాన్ని పెద్దగా వినిపించేలా చేస్తుంది” అని ఆమె పేర్కొన్నారు. ఇది సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవ్వడంతో.. పార్తిబన్ తన మాటలకు క్షమాపణలు చెప్పారు.
విజయ్-త్రిష జంటపై రూమర్స్
సినీ రంగంలో విజయ్ & త్రిష జంటకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇద్దరూ కలిసి చేసిన సినిమాలు అత్యధిక ప్రేక్షకాదరణ పొందాయి. వారి మొదటి సినిమా పెద్ద హిట్ సాధించింది. తర్వాత తిరుపాచ్చి, ఆతి, కురువి వంటి చిత్రాల్లో కూడా ఈ జంట నటించింది. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి. దాదాపు 15 సంవత్సరాల విరామం తర్వాత వీరిద్దరూ మళ్లీ కలిసి లియో సినిమాలో నటించారు. దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించింది.
రాజకీయాల్లో జోరుమీదున్న విజయ్
నటుడు విజయ్ ప్రస్తుతం తన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కజగం ద్వారా తమిళనాడు రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన రాజకీయ కార్యకలాపాలు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ సమయంలో ఆయన వ్యక్తిగత జీవితం కూడా తరచుగా రాజకీయ ప్రత్యర్థుల చర్చకు వస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో విజయ్-త్రిష సంబంధం గురించి వస్తున్న వార్తలు రాజకీయ చర్చలకు కూడా దారితీస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ ఊహాగానాలపై స్పష్టమైన స్పందన రాకపోవడంతో, ఈ అంశం ఇంకా సోషల్ మీడియాలో చర్చలోనే కొనసాగుతోంది.
Also Read: మళ్లీ బరిలోకి విజయ్ & రష్మిక.. ముచ్చటగా మూడోసారి
ఉమశ్రీ చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ట్రెండింగ్ అంశాలు, వివిధ విభాగాలపై ప్రత్యేక కథనాలను రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, సైన్స్ & టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, పాలిటిక్స్ తదితర రంగాలకు సంబంధించిన విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో ఆయనకు 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.