Wife Surprises Royal Enfield Himalayan 450 Gift To Husband: సాధారణంగా తల్లిందండ్రులు.. పిల్లలకు, పిల్లలు తల్లిదండ్రులకు గిఫ్ట్స్ ఇచ్చి పుచ్చుకోవడం గురించి, గతంలో చాలా సందర్భాల్లో వెలుగులోకి వచ్చాయి. ఇంకొన్ని సంఘటనలలో భర్తలు.. భార్యలకు కూడా గిఫ్ట్స్ ఇచ్చి సంతోషపెడుతుంటారు. కానీ భార్య.. భర్తకు గిఫ్ట్ ఇస్తే.. ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. అలంటి ఘటనే ఇప్పుడు తెరమీదకు వచ్చింది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే.. ఆ కథనం చదివేయాల్సిందే..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో.. ఒక మహిళ తన భర్తకు ఇష్టమైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ఇచ్చి ఆశ్చర్యపరుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొదట.. భార్య, భర్త తమ కుమార్తెతో కలిసి రోడ్డుపై కనిపిస్తారు. వారు సరిగ్గా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ షోరూమ్ దగ్గర నిలబడి.. గుడికి పోదాం అనుకుంటారు. కానీ భార్య ముందు బైక్ చూద్దాం అని చెబుతుంది. సరే అని భర్త షోరూమ్ లోపలి కదులుతాడు.
భార్య, భర్తలు ఇద్దరూ.. షోరూం లోపలికి వెళ్ళగానే, అక్కడున్న డీలర్ సిబ్బంది, అతనికి కంగ్రాట్యులేషన్ చెబుతారు. అయితే అతనికి వారు ఎందుకు కంగ్రాట్యులేషన్స్ చెబుతున్నారో అర్థం కాలేదు. కొంతసేపటికి.. భార్య ఇస్తున్న సర్‌ప్రైజ్ గిఫ్ట్ అని తెలుస్తుంది. భర్త ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. ఇదంతా కల మాదిరిగా ఉందని చెబుతాడు. ఆ తరువాత బైక్ మీద ఉన్న గుడ్డ తొలగిస్తాడు. అక్కడ రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు.
తనకు ఇష్టమైన బైక్ గిఫ్ట్ ఇచ్చినందుకు.. భర్త ప్రేమతో భార్య నుదుటిపై ముద్దుపెడతాడు. చివరకు బైక్ సొంతం చేసుకుంటారు. ఈ వీడియోలో వారు తమిళంలో మాట్లాడుకుంటున్నారు. కాబట్టి బహుశా ఈ ఘటన తమిళనాడులో జరిగినట్లు తెలుస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ మహిళపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 (Royal Enfield Himalayan 450)
భారతదేశంలో ఎక్కువమంది బైక్ ప్రేమికులకు ఇష్టమైన బైకులతో హిమాలయన్ ఒకటి. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ దీనినే కొన్ని ఆధునిక హంగులతో.. సరికొత్త ఫీచర్లతో హిమాలయన్ 450 రూపంలో లాంచ్ చేసింది. ఈ బైక్ ధర సుమారు రూ. 3 లక్షల కంటే ఎక్కువని తెలుస్తోంది.
హిమాలయన్ 450 బైక్ బేస్, పాస్ మరియు సమ్మిట్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. పూర్తిగా కొత్త ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడిన ఈ బైక్ 452 సీసీ సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8000 rpm వద్ద 39.5 Bhp పవర్, 5500 rpm వద్ద 40 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్ పొందుతుంది. కాబట్టి ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఈ బైక్ సాధారణ రోడ్డు ప్రాంతాల్లో మాత్రమే కాకుండా ఆఫ్ రోడింగ్ చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది.
పరిమాణం పరంగా ఇది కొంత పెద్దదిగా ఉన్నప్పటికీ.. పర్ఫామెన్స్ మాత్రం వేరే లెవెల్ అనే చెప్పవచ్చు. సస్పెన్షన్ సెటప్‌లో షోవా యూనిట్స్ ఉన్నాయి. ఆ బైక్ ముందు భాగంలో లాంగ్ ట్రావెల్ టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక భాగంలో ట్విన్ షాక్ సెటప్ ఉన్నాయి. కాబట్టి కఠినమైన భూభాగాల్లో కూడా మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.
Also Read: భారత్‌లో కేటీఎమ్ లాంచ్ చేసిన మూడు కొత్త బైకులు ఇవే: చూశారా?
ఆఫ్ రోడింగ్ ప్రియుల మనసు దోచే.. సరికొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 బైక్ కొంత ఎత్తైన సీటును కలిగి ఉంటుంది. కాబట్టి రైడ్ చేసేవారికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది అడ్వెంచర్ బైక్.. కాబట్టి హైవేలమీద కూడా వేగంగా వెళ్ళడానికి అనుమతిస్తుంది. మొత్తం మీద ఇది అన్ని విధాలా చాలా అనుకూలంగా, అద్భుతమైన రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.
ఇండియన్ మార్కెట్లో ఎక్కువమంది కొనుగోలు చేస్తున్న అడ్వెంచర్ బైకుల జాబితాలో హిమాలయన్ కూడా ఒకటి. ఈ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 17 లీటర్ల వరకు ఉంటుంది. కాబట్టి రైడర్ సులభంగా లాంగ్ డ్రైవ్ వెళ్ళవచ్చు. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా.. దాని ప్రత్యర్థుల కంటే ఉత్తమంగా ఉంటుంది.
View this post on Instagram