ఒకప్పుడు ఇండియన్ మార్కెట్లో చక్రం తిప్పిన రెనాల్ట్ (రెనో) కంపెనీకి చెందిన డస్టర్.. ఆ తరువాత కాలంలో ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వలేక డీలా పడింది. అయితే దాని విభాగంలో తన ఉనికిని మరింత చాటుకోవడానికి.. సంస్థ ఎట్టకేలకు 2026 డస్టర్ తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన ఈవెంట్ చెన్నైలో జరిగింది.
2026 రెనాల్ట్ డస్టర్
చెన్నైలో జరిగిన కార్యక్రమంలో రెనాల్ట్ ఇండియా 2026 డస్టర్ కారును ఆవిష్కరించింది. దీని ధరలను కంపెనీ మార్చిలో ప్రకటించే అవకాశం ఉంది. అంతకంటే ముందు.. సంస్థ ఫ్రీ బుకింగ్స్ ప్రారంభించింది. డెలివరీలు బహుశా ఉగాది సమయంలో మొదలయ్యే అవకాశం ఉంది. కొత్త డస్టర్ కారు.. ఓల్డ్ మోడల్ కంటే కూడా చాలా అప్డేట్ పొందినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
గ్లోబల్ వెర్షన్ మాదిరిగా..
2026 డస్టర్ రెనాల్ట్ గ్రూప్ మాడ్యులర్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా నిర్మితమైంది. కాబట్టి ఇది ఉత్తమమైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. ఇండియా స్పెక్ డస్టర్ మోడల్.. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న వెర్షన్ మాదిరిగానే ఉంది. అయితే దేశీ మోడల్ చిన్న చిన్న అప్డేట్స్ పొందుతుంది. ఇందులో ఎల్ఈడీ డీఆర్ఎల్, ఎల్ఈడీ హెడ్‌లైట్స్, సిల్వర్ ఇన్సర్ట్‌తో కూడిన చంకీ ఫ్రంట్ బంపర్ మరియు డస్టర్ అక్షరాలతో కూడిన గ్రిల్ వంటివి కనిపిస్తాయి. వెనుక భాగంలో ఎల్ఈడీ లైట్ బార్‌తో కూడిన ట్రైయాంగిల్ ఎల్ఈడీ టెయిల్‌లైట్స్ కనిపిస్తాయి. రూఫ్ రెయిల్స్, రూఫ్ స్పాయిలర్, షార్క్ పిన్ యాంటెన్నా, డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్ వంటివాటితో పాటు సరికొత్త బానెట్ ఉన్నాయి. ఈ కారులోని బూట్ స్పేస్ కెపాసిటీ 700 లీటర్లు.
ఇంటీరియర్ ఫీచర్స్ గురించి
కొత్త డస్టర్ లోపలి భాగంలో పెద్ద డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సెంట్రల్ టచ్‌స్క్రీన్‌తో కూడిన డ్యూయల్ స్క్రీన్ ఉన్నాయి. 3 స్పోక్ స్టీరింగ్ వీల్, 6 వే పవర్ అడ్జస్టబుల్ మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆటోమాటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ మొదలైన ఫీచర్స్ మాత్రమే కాకుండా.. ఈ కారులో లెవల్ 2 ఏడీఏఎస్ కూడా ఉన్నాయి.
ఇంజిన్ డీటైల్స్
ఇక చివరగా ఇంజిన్ విషయానికి వస్తే.. 2026 రెనాల్డ్ డస్టర్ కారు మూడు ఇంజిన్ ఎంపికలతో లభిస్తుంది. ఎంట్రీ లెవల్ వేరియంట్ 99 బీహెచ్‌పీ పవర్ అందించే 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, మిడ్ స్పెక్ ట్రిమ్‌లలో 161 బీహెచ్‌పీ శక్తిని ప్రొడ్యూస్ చేసే 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ మాత్రమే కాకుండా.. కంపెనీ ఇందులో తొలిసారి స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్ కూడా అందించనుంది. ఇది డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్లు, 1.4 కిలోవాట్ బ్యాటరీతో జతచేయబడిన 1.8 లీటర్ యూనిట్.
డెలివరీలు ఎప్పుడంటే
కంపెనీ తన కొత్త డస్టర్ కారు కొనుగోలుపై ఏడేళ్ల వారంటీ కూడా అందిస్తోంది. కంపెనీ దీనిని మార్చిలో లాంచ్ చేసిన తరువాత.. ఏప్రిల్ నెలలో డెలివరీలు ప్రారంభించే అవకాశం ఉంటుంది. ప్రారంభంలో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ కలిగిన కార్లను డెలివరీ చేస్తుంది. ఆ తరువాత.. బహుశా దీపావళి నాటికి హైబ్రిడ్ ఇంజిన్ కార్లను డెలివరీ చేయనున్నట్లు సమాచారం.
ఉమశ్రీ చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ట్రెండింగ్ అంశాలు, వివిధ విభాగాలపై ప్రత్యేక కథనాలను రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, సైన్స్ & టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, పాలిటిక్స్ తదితర రంగాలకు సంబంధించిన విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో ఆయనకు 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.






