దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగావకాశాలను పెంచే దిశగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ అప్రెంటిస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇటీవల యువతలో బ్యాంకింగ్ రంగంపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రకటనకు మంచి స్పందన లభించే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు గణనీయమైన సంఖ్యలో పోస్టులు కేటాయించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ రెండు రాష్ట్రాల అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా మారింది.
ప్రస్తుతం ప్రభుత్వ, బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం పోటీ తీవ్రంగా ఉన్న సమయంలో అప్రెంటిస్ పోస్టులు అభ్యర్థులకు ప్రాథమిక అనుభవాన్ని అందిస్తాయి. ఈ అనుభవం భవిష్యత్తులో శాశ్వత ఉద్యోగాల కోసం ఉపయోగపడుతుంది. అంతేకాకుండా, ఎంపికైన అభ్యర్థులకు నెలవారీ స్టైపెండ్ కూడా ఇవ్వడం మరో ముఖ్య అంశం. గ్రామీణ, పట్టణ, మెట్రో ప్రాంతాల ఆధారంగా వేతనంలో తేడా ఉంటుంది.
పోస్టుల వివరాలు – అర్హతలు
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 1,865 అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 303 పోస్టులు, తెలంగాణలో 164 పోస్టులు.
విద్యార్హత & వయస్సు పరిమితి
అభ్యర్థులు 2022 లేదా ఆ తర్వాత గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. వయసు విషయానికి వస్తే 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వం నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయస్సులో సడలింపులు వర్తిస్తాయి.
ఎంపిక విధానం ఎలా ఉంటుంది?
ఈ అప్రెంటిస్ పోస్టులకు ఎంపిక పూర్తిగా ఆన్‌లైన్ పరీక్ష ఆధారంగా జరుగుతుంది. రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా.. అభ్యర్థులను ఎంపిక అనేది జరుగుతుంది. పరీక్షలో సాధారణ జ్ఞానం, గణితం, రీజనింగ్, ఇంగ్లీష్ వంటి అంశాలపై ప్రశ్నలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు ముందుగానే సిద్ధం కావడం అవసరం.
వేతన వివరాలు
ఎంపికైన అభ్యర్థులకు వారు పనిచేసే ప్రాంతాన్ని బట్టి నెలవారీ స్టైపెండ్ చెల్లిస్తారు. గ్రామీణ ప్రాంతాలలో రూ.15,000. పట్టణ ప్రాంతాలు రూ. 18,000. మెట్రో నగరాలలో రూ. 20,000 వేతనంగా ఇస్తారు. ఈ స్టైపెండ్ ద్వారా అభ్యర్థులు తమ శిక్షణ సమయంలో ఆర్థికంగా కొంత స్థిరత్వం పొందుతారు.
దరఖాస్తు విధానం మరియు చివరి తేదీ
అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందిగా, చివరి తేదీగా మే 19ను నిర్ణయించారు. దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అభ్యర్థులు చివరి తేదీకి ముందు దరఖాస్తు పూర్తి చేయడం మంచిది. చివరి రోజుల్లో సాంకేతిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
ఈ నోటిఫికేషన్‌కు భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు సకాలంలో సిద్ధం కావాలి. ముఖ్యంగా సిలబస్‌ను పూర్తిగా అర్థం చేసుకోవాలి. మాక్ టెస్టులు రాయాలి. సమయ నిర్వహణపై దృష్టి పెట్టాలి. అలాగే అధికారిక ప్రకటనలో పేర్కొన్న అన్ని నిబంధనలు జాగ్రత్తగా చదవాలి.
యువతకు మంచి అవకాశం!
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ఈ అప్రెంటిస్ నోటిఫికేషన్ యువతకు మంచి అవకాశాన్ని అందిస్తోంది. ముఖ్యంగా డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. సరైన ప్రణాళికతో సిద్ధమైతే ఈ పోస్టుల్లో ఎంపిక కావడం సాధ్యమే.
Also read:విజయ్ మనసులోని కన్నీటి కథ: అందుకే మౌనం!

గిరిబాబు – నేను MarthaTelugu వెబ్‌సైట్‌లో డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో MA తెలుగు చేశారు. నాకు రైటర్‌గా మూడేళ్ల అనుభవం ఉంది. నాకు జాతీయ వార్తలు, బిజినెస్, ప్రత్యేక కథనాలు రాయడంలో ప్రావీణ్యం ఉంది. వార్తలు మాత్రమే కాకుండా పాటలు, కవితలు, షార్ట్ ఫిలిమ్స్ వంటివాటికి మాటలు రాసే అలవాటు ఉంది. సహజంగా జానపద, సినిమా పాటలు గాయకుణ్ణి.
