దేశవ్యాప్తంగా కెమిస్టులు, డ్రగ్గిస్టులు రేపు (మే 20న) సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో.. తెలంగాణలో కూడా మందుల దుకాణాలు మూతపడనున్నాయి. Telangana Chamber of Chemists and Druggists ప్రతినిధులు హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్లో నిర్వహించిన సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఆన్లైన్ మందుల విక్రయాలను నిలిపివేయడం, కార్పొరేట్ సంస్థల అధిక డిస్కౌంట్ల నియంత్రణ, నకిలీ మందుల విక్రయాల నివారణ వంటి డిమాండ్లతో ఈ బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ సమ్మెకు All India Organisation of Chemists and Druggists పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా రిటైల్ మెడికల్ షాపులు మూతపడనున్నప్పటికీ, ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఫార్మసీ సంఘాలు వెల్లడించాయి. హైదరాబాద్‌తో.. పాటు తెలంగాణ వ్యాప్తంగా ఈ సమ్మె ప్రభావం కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా సాధారణ మెడికల్ స్టోర్లు మూతపడనున్నప్పటికీ, ఆస్పత్రులకు అనుబంధంగా పనిచేసే ఫార్మసీలు మాత్రం అందుబాటులో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.
సమ్మెకు కారణాలు
ఫార్మసీ సంఘాలు ఈ సమ్మెకు పలు ప్రధాన డిమాండ్లను ప్రస్తావించాయి. ముఖ్యంగా ఆన్లైన్లో మందుల విక్రయాలు పెరగడం వల్ల చిన్న, మధ్య తరహా మెడికల్ షాపులు తీవ్రంగా నష్టపోతున్నాయని పేర్కొన్నాయి.
కార్పొరేట్ ఫార్మసీలు భారీ డిస్కౌంట్లతో మందులు విక్రయించడం వల్ల స్థానిక మెడికల్ దుకాణాలపై ప్రభావం పడుతోందని తెలిపారు. అదేవిధంగా నకిలీ మందుల విక్రయాలు కూడా పెరుగుతున్నాయని, వాటిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫార్మసీ రంగాన్ని రక్షించేందుకు సరైన విధానాలు తీసుకురావాలని, చిన్న వ్యాపారులకు రక్షణ కల్పించాలని సంఘాలు కోరుతున్నాయి.
ఏ మెడికల్ స్టోర్లు పనిచేస్తాయి?
దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతున్నప్పటికీ కొన్ని కీలక మెడికల్ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. ప్రధాన ఫార్మసీ చైన్ అవుట్లెట్లు, Pradhan Mantri Bhartiya Janaushadhi Pariyojana కేంద్రాలు, ఆస్పత్రులకు అనుబంధంగా ఉన్న మెడికల్ షాపులు, అమృత్ ఫార్మసీ అవుట్లెట్లు పనిచేస్తాయని అధికార వర్గాలు తెలిపాయి.
అత్యవసర వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని ప్రధాన ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు అనుబంధంగా ఉన్న ఫార్మసీలు సాధారణంగా సేవలు కొనసాగిస్తాయని సమాచారం.
కొన్ని రాష్ట్రాలు సమ్మె నుంచి వైదొలగింపు
దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చినా, కొన్ని రాష్ట్రాల ఫార్మసీ సంఘాలు ఇప్పటికే ఈ బంద్ నుంచి తప్పుకున్నాయి. పశ్చిమ బెంగాల్, కేరళ, పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్, లద్దాక్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, సిక్కిం, ఉత్తరాఖండ్‌కు చెందిన రిటైల్ ఫార్మసీ అసోసియేషన్లు సమ్మెలో పాల్గొనబోమని లిఖితపూర్వకంగా తెలిపాయి. అయితే.. తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో సమ్మె ప్రభావం స్పష్టంగా కనిపించే అవకాశముందని ఫార్మసీ సంఘాలు చెబుతున్నాయి.
అత్యవసర మందుల కోసం టోల్‌ఫ్రీ సేవలు
మెడికల్ షాపుల బంద్ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా Telangana Drugs Control Administration కీలక సూచనలు జారీ చేసింది.
అత్యవసర మందులు దొరకని పరిస్థితుల్లో ప్రజలు స్థానిక డ్రగ్ కంట్రోల్ అధికారులను సంప్రదించాలని సూచించింది. సంబంధిత అధికారుల ఫోన్ నంబర్లు, చిరునామాలు డీసీఏ అధికారిక వెబ్‌సైట్‌లోని “Key Contacts” విభాగంలో అందుబాటులో ఉంటాయని తెలిపింది. ప్రజలు సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1800 599 6969కు కాల్ చేయవచ్చని వెల్లడించింది. ముఖ్యంగా ప్రాణాపాయ పరిస్థితుల్లో అవసరమైన మందులు అందించేందుకు ప్రత్యేక వ్యవస్థను సిద్ధం చేసినట్లు పేర్కొంది.
ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు
సమ్మె కారణంగా రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం, డ్రగ్ కంట్రోల్ అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నారు. ఆస్పత్రుల్లో అవసరమైన మందుల నిల్వలను ముందుగానే సిద్ధం చేసినట్లు సమాచారం.
ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రధాన ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా అత్యవసర ఫార్మసీలు అందుబాటులో ఉండనున్నాయి. ముఖ్యంగా డయాబెటిస్, గుండె జబ్బులు, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ముందుగానే మందులు కొనుగోలు చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పించేందు…

గిరిబాబు – నేను MarthaTelugu వెబ్సైట్లో డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో MA తెలుగు చేశారు. నాకు రైటర్‌గా మూడేళ్ల అనుభవం ఉంది. నాకు జాతీయ వార్తలు, బిజినెస్, ప్రత్యేక కథనాలు రాయడంలో ప్రావీణ్యం ఉంది. వార్తలు మాత్రమే కాకుండా పాటలు, కవితలు, షార్ట్ ఫిలిమ్స్ వంటివాటికి మాటలు రాసే అలవాటు ఉంది. సహజంగా జానపద, సినిమా పాటలు గాయకుణ్ణి.
