భారతదేశంలో టీవీఎస్ కంపెనీకి చెందిన ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు ఎంత డిమాండ్ ఉందో అందరికీ తెలుసు. ఈ స్కూటర్ మంచి అమ్మకాలను పొందుతున్న వేళ.. సంస్థ మరో ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. లాంచ్ డేట్ ఆగస్టు 28 అని కూడా సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది. ఇంతకీ టీవీఎస్ లాంచ్ చేయనున్న స్కూటర్ ఏది?, దాని ధర ఎంత ఉంటుంది అనే వివరాలు ఈ కథనంలో..
టీవీఎస్ మరో ఎలక్ట్రిక్ స్కూటర్
టీవీఎస్ కంపెనీ లాంచ్ చేయనున్న స్కూటర్ ‘ఆర్బిటర్’ అని తెలుస్తోంది. సంస్థ దీని కోసం ఇప్పటికే ట్రేడ్‌మార్క్ కూడా దాఖలు చేసింది. అంతే కాకుండా దీని ధర కూడా రూ. 1 లక్ష కంటే తక్కువ ఉండే అవకాశం ఉంటుంది సమాచారం. ఇది మార్కెట్లో బజాజ్ చేతక్, ఓలా ఎస్1 ఎక్స్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో టీవీఎస్ ఐక్యూబ్ శ్రేణి ధరలు రూ. 1 లక్ష నుంచి రూ. 1.59 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ఈ ధర మిడిల్ క్లాస్ వినియోగదారులకు కొంత ఎక్కువే. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ లక్ష రూపాయల కంటే తక్కువ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేయాలనే ఉద్దేశ్యంతో.. ఆర్బిటర్ లాంచ్ చేయడానికి సంకల్పించింది.
టీవీఎస్ లాంచ్ చేసే ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి
ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్, ఫీచర్స్ వంటి విషయాలు అధికారికంగా వెల్లడికాలేదు. కానీ ఇది మంచి స్టైల్, పెద్ద వీల్స్ కలిగి.. స్వింగ్‌ఆర్ము మౌంటెడ్ మోటారును కలిగి ఉంటుందని సమాచారం. ఇప్పటి వరకు వెల్లడైన స్కెచ్‌ల ప్రకారం.. ఈ స్కూటర్ ప్రీమియం లుక్ పొందుతుందని తెలుస్తోంది. అయితే ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే.. టీవీఎస్ కంపెనీ లాంచ్ చేయబోయే స్కూటర్ ఆర్బిటర్ అవుతుందా?, లేక భిన్నంగా ఉంటుందా? అనేది.
ఐక్యూబ్ సేల్స్
ఇండియన్ మార్కెట్లో ఎక్కువ అమ్మాకాలు పొందుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో టీవీఎస్ కంపెనీకి చెందిన ఐక్యూబ్ ఒకటి. ఇది ఇప్పటి వరకు 6 లక్షల యూనిట్ల సేల్స్ పొందినట్లు సమాచారం. మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్.. మంచి రేంజ్ వంటివి అందించడం వల్లనే దీనిని ఎక్కువమంది కొనుగోలు చేస్తున్నారు. ఈ స్కూటర్ సిటీ ప్రయాణానికి మాత్రమే కాకుండా నగర ప్రయాణాలకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో, వివిధ బ్యాటరీ ఎంపికలతో అందుబాటులో ఉండటం కూడా అమ్మకాలు పెరగడానికి దోహదపడింది.
ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్
నిజానికి ఒకప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలకు పెద్దగా డిమాండ్ ఉండేది కాదు. దీనికి ప్రధాన కారణం అవగాహన లోపం, మౌలిక సదుపాయాల కొరత. అంతే కాకుండా అప్పుడప్పుడు వెలుగులోకి వచ్చిన ఎలక్ట్రిక్ వాహనాల ప్రమాదాలు. అయితే ఇప్పుడు కాలం మారింది. చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడానికి.. ప్రభుత్వం కూడా ప్రోత్సాహకాలను అందించింది. ఇవన్నీ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని గణనీయంగా పెంచింది.
శౌర్య వర్ధన్ సబ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. సినిమా, రాజకీయం వంటి విభిన్న అంశాలపై సమగ్రమైన ఆర్టికల్స్ అందిస్తూ వస్తున్నాను. ఈ రంగంలో నాకు నాలుగు సంవత్సరాల అనుభవం ఉంది. రాయడంలో నైపుణ్యంతో, చదువరులకు స్పష్టమైన మరియు ఆసక్తికరమైన కంటెంట్ అందించడం నా లక్ష్యం.






