కార్లంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. పెద్దవాళ్లకైనా, ధనవంతులకైనా.. సాధారణ ప్రజలకైనా, సెలబ్రిటీలకైనా అందరికీ ఇష్టమే. సాధారణ ప్రజల విషయాన్ని పక్కన పెడితే.. సెలబ్రిటీలు మాత్రం ఎప్పటికప్పుడు తమకు నచ్చిన కార్లను కొనుగోలు చేస్తూనే ఉంటారు. ఇందులో భాగంగానే.. బిగ్‌బాస్ 4 తెలుగు సీజన్ కంటెస్టెంట్, నటుడు అయిన ‘నోయెల్ సీన్‘ తాజాగా కొత్త కారు కొనుగోలు చేసాడు. దీనికి సంబంధించిన వీడియో తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేసాడు.
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలో.. నోయెల్ సీన్ మహీంద్రా కంపెనీకి చెందిన ‘బీఈ 6‘ కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ కారును తన అమ్మ చేతుల మీదుగా తీసుకున్నాడు. కారును డెలివరీ తీసుకున్న తరువాత కేక్ కట్ చేసి.. తల్లికి తినిపించాడు. నోయెల్ బీఈ 6 కారు ఏ వేరియంట్ అనేది వెల్లడించలేదు. అయితే దీని ధర రూ. 20 లక్షల కంటే ఎక్కువే ఉంటుందని సమాచారం. కొత్త కారు కొన్న విషయాన్ని అభిమానులతో పంచుకోవడంతో.. అభిమానులు శుభాకాంక్షలు, అభినందలు చెబుతున్నారు.
నోయెల్ సీన్ గురించి
హైదరాబాద్‌కు చెందిన నోయెల్ సీన్ ‘సంభవామి యుగేయుగే’ సినిమాతో.. మూవీ కెరీర్ ప్రారంభించాడు. ఆ తరువాత మంత్ర, ఈగ వంటి సినిమాల్లో కనిపించాడు. కుమారి 21 ఎఫ్ సినిమాలో నెగటివ్ రోల్ చేసాడు. ఆ తరువాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. అయితే అప్పుడప్పుడు కొన్ని టీవీ షోలలో కనిపిస్తుంటారు. కాగా ఇతడు బిగ్‌బాస్ 4 తెలుగు సీజన్‌లో పాల్గొన్నాడు, కానీ అనారోగ్య కారణాల వల్ల మధ్యలోనే బయటకు వచ్చేశాడు. 2019లో హీరోయిన్ ‘ఎస్తేర్ నొరోన్హా’ని పెళ్లి చేసుకున్నాడు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల పెళ్ళైన ఏడాదికే వీరు విడిపోయారు.
మహీంద్రా బీఈ6
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ బీఈ 6 పేరుతో కారును లాంచ్ చేసింది. ఇది చూడటానికి ఇప్పటి వరకు మార్కెట్లో అందుబాటులో ఉన్న దాదాపు అన్ని కార్లకంటే కూడా భిన్నంగా ఉంది. దృఢమైన బాడీ, ఆకట్టుకునే డిజైన్, సరికొత్త లోగో అన్నీ కూడా వాహన ప్రేమికులను మంత్రముగ్దుల్ని చేస్తోంది.
ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉన్న మహీంద్రా బీఈ 6 ఎలక్ట్రిక్ కారు ధరలు రూ. 18.90 లక్షల నుంచి రూ. 26.90 లక్షల మధ్య ఉన్నాయి. కస్టమర్ ఎంచుకునే వేరియంట్ మీద ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ కారు ఒక ఫుల్ ఛార్జితో 557 కిమీ నుంచి 683 కిమీ రేంజ్ అందిస్తుందని ఏఆర్ఏఐ ధ్రువీకరించింది. రియల్ వరల్డ్ రేంజ్ కొంత తగ్గే అవకాశం ఉంటుంది.
మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభించే మహీంద్రా బీఈ 6 ఎలక్ట్రిక్ కారు.. ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఇవన్నీ వాహన వినియోగదారులకు గొప్ప డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి. టాప్ ఎండ్ వేరియంట్ లెవెల్ 2 ఏడీఏఎస్ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇక స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఏసీ వెంట్స్, డ్రైవర్ ఇన్ఫర్మషన్ డిస్‌ప్లే, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం అన్నీ.. బీఈ 6 అన్ని వేరియంట్లలోనూ ఉంటాయి. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఎక్కువగా అమ్ముడవుతున్న కార్ల జాబితాలో కూడా ఇది ఒకటిగా ఉంది.
ఉమశ్రీ చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ట్రెండింగ్ అంశాలు, వివిధ విభాగాలపై ప్రత్యేక కథనాలను రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, సైన్స్ & టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, పాలిటిక్స్ తదితర రంగాలకు సంబంధించిన విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో ఆయనకు 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.