బాలీవుడ్‌కు గుడ్‌బై చెబుతున్నారా?: జానియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి?

తెలుగు చలన చిత్రసీమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్.. హృతిక్ రోషన్, కియారా అద్వానీలతో కలిసి ‘వార్ 2‘తో బాలీవుడ్ అరంగేట్రం చేశారు. ప్రారంభంలో ఈ సినిమా మంచి టాక్ పొందింది, కానీ ఆ తరువాత నెమ్మదించింది. కాగా ఈ మూవీ 10 రోజుల్లో రూ. 215 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది. కాగా ఇప్పుడు ఎన్టీఆర్ మాత్రం బాలీవుడ్‌కు దూరంగా ఉండాలా అన్నట్లు ఆలోచిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

తెలుగు సినిమాలపై ఫోకస్

వార్ 2 సినిమా పెద్దగా హైప్ క్రియేట్ చేయలేకపోయింది. అయితే ఎన్టీఆర్ మాత్రం ఇప్పుడు పూర్తిగా తెలుగు సినిమాల మీదనే ఎక్కువ ద్రుష్టి పెట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.కాగా జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే యష్ రాజ్ ఫిల్మ్స్‌తో మల్టి ఫిల్మ్ డీల్ ఒప్పందం మీద సంతకం చేసినట్లు.. అందులో ఒక సోలో ప్రాజెక్ట్ కూడా ఉన్నట్లు వార్తలు వినిపించాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఎన్టీఆర్ తెలుగు సినిమాల్లో బిజీ అయిపోవడం వల్ల అది ఆగిపోయినట్లు కొన్ని నివేదికలు చెబుతున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తెలుగు సినిమాలపై ద్రుష్టి పెట్టడం వల్ల.. త్వరలోనే కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర 2‘లో కనిపించనున్నారు. ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యమైనప్పటికీ.. షూటింగ్ త్వరలోనే ప్రారంభమవుతుందని చెబుతున్నారు. అంతే కాకుండా కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ‘డ్రాగన్‘ సినిమాలో కూడా ఎన్టీఆర్ కనిపించనున్నారు. ఈ సినిమాను చాలా పెద్దగా ప్లాన్ చేస్తున్నారు. ఇది 2026 జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావడానికి సిద్ధమవుతుందని సమాచారం.

దేవర పార్ట్ 2

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’లో కనిపించారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 500 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్స్ వసూలు చేసింది. దీంతో దేవర పార్ట్ 2 సినిమా కోసం అంత సిద్ధమవుతోంది. అయితే ఈ పార్ట్ 2 సినిమాకు సంబంధించిన చాలా విషయాలు తెలియాల్సి ఉంది.

బాలీవుడ్‌కు గుడ్‌బై చెబుతున్నాడా?

వార్ 2 సినిమా తరువాత జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పటికే ఒప్పుకున్నా కొన్ని తెలుగు సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది. ఈ కారణంగానే బాలీవుడ్‌కు కొంత విరామం ఇచ్చే అవకాశం ఉంది. 2026 మొత్తం ఎన్టీఆర్ టాలీవుడ్ సినిమాలకే తన సమయాన్ని కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చే డ్రాగన్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారు.

వైఆర్ఎఫ్ అధినేత ఆదిత్య చోప్రా.. జూనియర్ ఎన్టీఆర్ కోసం ఓ సినిమా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇది షారుక్ ఖాన్ పఠాన్, సల్మాన్ ఖాన్ టైగర్ సినిమాల మాదిరిగా ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమా కూడా 2026 తరువాత వచ్చే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించిన చాలా వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది. మొత్తం మీద ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ చిత్ర సీమలో ఎన్టీఆర్ ఓ మంచి క్రేజ్ తెచుకుంటున్నారు.

Leave a Comment