ప్రభాస్.. నిజానికి ఇదొక పేరు కాదు. పాన్ ఇండియా సెన్సేషన్, అభినులకు బ్రాండ్. ఈశ్వర్ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి.. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకుని.. నేడు ఎక్కువ మంది అభిమానులను కలిగి ఉన్న హీరోలలో ప్రభాస్ ఒకరు. కాబట్టి చాలా మంది ప్రభాస్ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురు చూస్తుంటారు. ప్రస్తుతం ఈయన ‘ది రాజా సాబ్‘ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇక్కడ చూసేద్దాం.
రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
రాజా సాబ్ సినిమా డిసెంబర్ 2025లో విడుదల కావాల్సి ఉంది. అయితే వీఎఫ్ఎక్స్ పనులు పూర్తి కాకపోవడం మరియు పోస్ట్ ప్రొడక్షన్ కారణాల వల్ల.. ప్రభాస్ సినిమా రిలీజ్ తేదీ కొంత ముందుకు సాగింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పనులను పూర్తి చేయడానికి చిత్ర బృందం పనిచేస్తోంది. బహుశా ఇది 2026 సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే చిత్ర బృందం ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.
ది రాజా సాబ్ ఆలస్యానికి కారణం
ప్రభాస్ నటిస్తున్న హారర్ కామెడీ చిత్రం ది రాజా సాబ్ ఆలస్యానికి.. సినీ కార్మికుల సమ్మె కూడా ఒక కారణం అని తెలుస్తోంది. ప్రస్తుతం యూనియన్ల సమ్మె ఆగిపోయింది. దీంతో సినిమా పరిశ్రమలో ఆగిపోయిన కొన్ని పనులు త్వరితగతిన పూర్తవుతున్నాయి. ప్రస్తుతం కొన్ని కీలకమైన సన్నివేశాలు మాత్రమే పూర్తిచేయాల్సి ఉందని రాజా సాబ్ చిత్ర బృందం వెల్లడించింది.
నటుడు ప్రభాస్ కూడా వరుస సినిమాలలో నటిస్తున్న కారణంగా.. అయన షెడ్యూల్ కూడా చాలా బిజీ అయిపోయింది. కాబట్టి రాజా సాబ్ చిత్ర బృందం కూడా వీలైనంత త్వరగానే సినిమాను పూర్తి చేయడానికి సిద్ధమైంది. మొత్తం మీద చిత్ర బృందం.. ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
తెలుగు సినీ చిత్ర పరిశ్రమలో సంక్రాంతికి చాలా సినిమాలే రిలీజ్ అవుతాయి. కొంతమంది దర్శకులు లేదా నిర్మాతలు సైతం సినిమాలను రిలీజ్ చేయడానికి సంక్రాతి సరైందని భావిస్తారు. ఈ కారణంగానే ప్రభాస్ రాజా సాబ్ సంక్రాంతికి పోస్ట్‌ఫోన్ అయినట్లు తెలుస్తోంది. ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు‘ సినిమా కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
రాజా సాబ్ సినిమా గురించి
ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్.. చాలా డిఫరెంట్ మూవీ అని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఇలాంటి సినిమాలో ప్రభాస్ నటించలేదు. ప్రభాస్ అంతకు ముందు ఎప్పుడూ చూడని ప్రాంతంలో అడుగుపెడుతున్నట్లు ఈ సినిమాలో కనిపిస్తోంది. ఈ సినిమా హారర్, ఎంటర్‌టైనర్ అని తెలుస్తోంది. పాతకాలపు చరిత్ర కూడా ఇందులో మిళితమైందని తెలుస్తోంది.
వరుస సినిమాలతో ప్రభాస్
నటుడు ప్రభాస్ కేవలం ది రాజా సాబ్ సినిమాలో మాత్రమే కాకుండా.. ఫౌజీ, స్పిరిట్ వంటి సినిమాల్లో కూడా నటిస్తున్నారు. ఈ రెండు సినిమాల షూటింగ్.. రాజా సాబ్ పూర్తయిన తరువాత ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కాగా చిత్ర పరిశ్రమ రాజా సాబ్ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకుంది. ఈ సినిమా కోసం చిత్ర బృందం రూ. 200 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు పెట్టినట్లు సమాచారం.
ఉమశ్రీ చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ట్రెండింగ్ అంశాలు, వివిధ విభాగాలపై ప్రత్యేక కథనాలను రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, సైన్స్ & టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, పాలిటిక్స్ తదితర రంగాలకు సంబంధించిన విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో ఆయనకు 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.