పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చిత్రం ఓజీ. ఈ మూవీ ట్రైలర్, సాంగ్స్, మ్యూజిక్ అన్నీ కూడా సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. అభిమానులకు కొత్తదనాన్ని ఇవ్వడంలో భాగంగా ఈ సినిమా కోసం పవర్ స్టార్ ప్రత్యేకంగా జపనీస్ బాష నేర్చుకొని మరీ డైలాగ్ చెప్పారు. ఇప్పటికే ఈ సినిమాలోని పాటలు గానీ మ్యూజిక్ గానీ ఒక రేంజ్‌లో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. తమన్ మ్యూజిక్ పవన్ కళ్యాణ్ అభిమానులకు కొత్త ఉత్తేజాన్ని ఇస్తోంది. ట్రైలర్ కూడా ఇప్పటికే భారీ అంచనాలను కలిగిస్తోంది. ఈ సారి పెద్ద పెద్ద రికార్డుడులను కూడా బద్దలు కొట్టే అవకాశం ఉన్నట్టుగా అభిమానులు ఊహించుకుంటున్నారు.
పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తరువాత విడుదలైన మొదటి సినిమా హరి హర వీరమల్లు భారీ అంచనాలతో విడుదలై.. అభిమానులకు తీవ్ర నిరాశను కలిగించింది. డిప్యూటీ సీఎం అవ్వడానికి ముందు చేసిన బ్రో సినిమా కూడా అంచనాలను అందుకోలేకపోయింది. ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు అత్యంత నమ్మకం పెట్టుకున్న సినిమా ఓజీ. ఈ సినిమా తరువాత పీఎస్పీకే 29, ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ కావడానికి సిద్ధమవుతోంది.
ఫ్రీ-రిలీజ్ వేడుకల్లో పవన్ జోష్
ఓజీ సినిమా ఈ నెల సెప్టెంబర్ 25న ప్రపంచం వ్యాప్తంగా విడుదలకు సిద్ధమయింది. ఈ చిత్రం ప్రచార కార్యక్రమాల్లో భాగంగా సెప్టెంబర్ 21న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తున ప్రీ-రిలీజ్ ఈవెంట్ వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమంలో మునుపెన్నడు కనిపించని విధంగా పవన్ కళ్యాణ్ అత్యంత జోష్‌తో కనిపించడమే కాకుండా.. సినిమాలోని ఒరిజినల్ గెటప్‌లోనే కనిపించారు. భారీ వర్షం పడుతున్నప్పటికి కూడా అభిమానుల్లో ఏ మాత్రం ఉత్సాహం తగ్గకుండా ఉండేదుకు.. ”ఈ వర్షం మనల్ని ఆపుతుందా, ఈ వర్షం మనల్ని ఆపుతుందా” అని గట్టి గట్టిగా డైలాగ్ చెబుతా అభిమానుల్లో మరింత ఉత్సహన్ని రేకెత్తించాడు.
ఓవర్సీస్‌లో ఓజీ షోలు రద్దు!
ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్దమవుతున్న ఓజీకి అనుకోని చిక్కోచ్చి పడింది. ఓవర్సీస్‌లో.. అంటే నార్త్ అమెరికాలో ఓజీ చిత్రాన్ని నిలిపివేస్తున్నట్లు యార్క్ సినిమాస్ సంస్థ ప్రకటించింది. మన తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్న దేశాల్లో అమెరికా కూడా ఒకటి. అందుకే ఎప్పుడు కూడా తెలుగు సినిమాలు అక్కడ రిలీజ్ చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యే సమయంలో థియేటర్స్ దగ్గర అభిమానులు ఇబ్బందులు కలిగిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకునే.. ఓజీ సినిమా రిలీజ్ చేయలేమని యార్క్ సినిమాస్ అధికారికంగా ప్రకటించింది. అంతే కాకుండా.. ఫ్రీ బుకింగ్స్ చేసుకున్నవారికి అమౌంట్ రిఫండ్ చేస్తామని కూడా స్పష్టం చేసింది. ఈ ప్రకటన పవన్ కళ్యాణ్ అభిమానులకు కొంత నిరాశ కలిగించింది. అయితే ఓజీ నిర్మాతకు, హీరోకు ఓ పెద్ద షాక్ అనే చెప్పాలి.
ఓజీ చిత్రంలోని నటులు
పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై.. డీవీవీ దానయ్య నిర్మించారు. డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు. ఇందులో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, సినిమా నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించారు. ప్రియాంక అరుల్ మోహనన్ హీరోయిన్‌గా చేశారు. ప్రకాష్ రాజ్, ఇమ్రాన్ హష్మీ, అజయ్ గోష్, శ్యామ్, అభిమన్యూ సింగ్, శుభలేక సుధాకర్, శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్ తదితరులు ప్రధాన పాత్రలు చేసారు.
డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు. ప్రముఖ విశ్వ విద్యాలయం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో MA తెలుగు చేశారు. తాజా సినిమా, పాలిటిక్స్, నేషనల్, స్పోర్ట్స్‌కు సంబంధించిన వార్తలతో పాటు ప్రత్యేకమైన కథనాలు రాస్తారు. డిజిటల్ కంటెంట్ రైటర్‌గా సంవత్సరం అనుభవం కలిగి ఉన్నారు. ఈయనకు పాటలు, కవితలు, షార్ట్ ఫిలిమ్స్ వంటివాటికి మాటలు రాసే అలవాటు ఉంది. సహజంగా జానపద, సినిమా పాటలు గాయకుడు.