ప్రస్తుతం డైరెక్టర్ పా. రంజిత్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం వెట్టువమ్. ప్రస్తుతం దీనికి సంబంధించిన షూటింగ్ పనులు అన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఒక పది లేదా పదహైదు రోజులు మాత్రమే షూట్ మిగిలి ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ తరువాత పా. రంజిత్ సార్పట్ట-2 మూవీ షూటింగ్ పనులు మొదలు పెట్టనున్నారు. ఈ రెండు సినిమాలకు సంబందించిన విశేషాలు కొన్ని..
వెట్టువమ్ తరువాత.. సార్పట్ట-2
సినీ హీరో ఆర్య, అట్టకత్తి దినేష్ & శోభిత ధూళిపాళ నటిస్తున్న చిత్రం వెట్టువమ్. నీలం స్టూడియోస్ మరియు గోల్డెన్ రేషియో ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పా. రంజిత్, అధితి ఆనంద్, పియుష్ సింగ్, అభయానంద్ సింగ్, అశ్విని చౌదరి, సొరబ్ గుప్తా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. జీవీ. ప్రకాష్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. 2025 సంవత్సరం చివరిలో లేదా 2026లో ఈ సినిమా రిలీజ్ ఉండనుంది. షబ్బీర్ కల్లరక్కల్, మిమి గోపి, జాన్ విజయ్, లింగేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
వెట్టువమ్ (వెట్టువమ్ అనేది ఒక తమిళ పదం.. దీనికి కొట్టడంతో పాటు అనేక అర్థాలు వస్తాయి. సినిమా పరిభాషలో చెప్పాలంటే హీరో ప్రతీకారం తీర్చుకోవడం లేదా గ్యాంగ్‌స్టర్‌కు సంబంధించిన వయొలెన్స్ అయినా కావచ్చు). ఒక గ్రామీణ ప్రాంతానికి చెందినటువంటి గ్యాంగ్‌స్టర్ చుట్టూ తిరుగుతుందట. అందులో అతను జైలుకు వెళ్లిన తరువాత అక్కడ ఉన్న పరిస్థితులు, మరియు సామాజిక కోణం.. అధికారాన్ని, నేరాన్ని, న్యాయాన్ని కూడా రంజిత్ స్టైల్‌లో చూపించనున్నారు. మొట్ట మొదటిసారి సైన్స్ ఫిక్షన్ పరంగా టచ్ చేయనున్నాడంట. మరి సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది.
పా. రంజిత్ సార్పట్ట పరంపర గురించి
సార్పట్ట పరంపర సినిమా.. ఆర్య, దుషరా విజయన్ జంటగా నటించినగా పా. రంజిత్ దర్శకత్వంలో వచ్చింది. ఈ మూవీ 2021వ సంవత్సరంలో కరోనా కారణంగా నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయింది. అయినప్పటికీ అతి పెద్ద విజయం అందుకునింది. బాక్సింగ్ స్పోర్ట్స్ డ్రామా మరియు పాలిటిక్స్, కులం, సమాజం అన్నీ కలిసి ఉంటాయి.
సార్పట్ట పరంపరకి ఇడియప్ప పరంపరకి ఎప్పటి నుంచో బాక్సింగ్ పోటీలు జరుగుతూ ఉంటాయి. అందులో హీరో ఒక వర్గానికి చెందిన వ్యక్తి. సార్పట్ట పరంపరకి ఆడాలని తన చిన్నపటి నుంచి కోరిక. అందుకే బాక్సింగ్ ఎక్కడ జరిగినా అక్కడకి వెళ్లిపోతూ ఉంటాడు. కానీ వాళ్ల నాన్న ఆ బాక్సింగ్ కారణంగానే వేరేవాళ్లు చంపేయడంతో హీరో అమ్మకు ఏమాత్రం ఇష్టం ఉండదు. ఆ కారణంగా సార్పాట్ట పరంపరకి చెందిన మెంటర్ రంగయ్యోరు అతన్ని ఆటలో చేర్చుకోరు. కొన్ని అనుకోని పరిస్థితుల్లో వాళ్లలో వాళ్లకు పోటీ జరిగినప్పుడు కబీలన్ పోటీకి దిగి గెలుస్తాడు. అప్పుడు రంగయ్య ఆశ్చర్యం వ్యక్తం చేసి కొంచెం గర్వపడతాడు. ఆ తరువాత వారి మధ్యలో రంగయ్యకు అవమానం జరుగుతుంది అది చూసి తట్టుకోలేని హీరో కబిలన్ మెయిన్ బాక్సర్ వేట పులితో ఆటకు సవాల్ విసురుతాడు. అతనితో ఆడాలంటే ముందుగా డాన్సింగ్ రోజ్ (షబ్బీర్)తో గెలిచి చూపించమంటారు. అతనితో కూడా గెలిచి ఫైనల్ ఆటకు సిద్దమైనప్పుడు అప్పట్లో కొన్ని కుట్రలు పన్ని బాక్సింగ్ రింగులోనే అతన్ని బట్టలు విప్పి కొట్టి గెలవకుండా చేసి అవమానిస్తారు. అప్పుడే రాజకీయ ఎమర్జెన్సీ కారణాలు వళ్ళ ఆట ఆగిపోతుంది.
మెంటర్ రంగయ్య (పశుపతి)ని అరెస్ట్ చేస్తారు. ఆ తరువాత కొంతమంది వల్ల.. హీరో తాగుడుకు బానిసై భార్యా, తల్లిని, ఆటని మర్చిపోయి ఎందుకు పనికిరాని వాడిలా తయారవుతాడు. బాక్సింగ్‌కు పనికిరాకుండా తయారవుతాడు. ఆపై మళ్లీ రంగయ్య జైలు నుంచి విడుదల అవుతాడా లేదా మళ్ళీ బాక్సింగ్ ఆట జరుగుతుందా జరగదా, తల్లి సపోర్ట్ చేస్తుందా చేయదా, హీరో మునుపటిలా ఆడగలడా, ఆడి తన గురువు రంగయ్య పేరు నిలబెడతాడా లేదా అనేదే కథ. ఆర్య కబిలన్ అనే పాత్రలో అద్భుతంగా నటించాడు. ఐఎండీబీలో 8.5 స్టార్స్ రివ్యూతో మంచి హిట్ టాక్ తెచ్చుకునింది. పా. రంజిత్ అప్పటికే కబాలి, కాలా, మద్రాస్, అట్టకత్తి లాంటి సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించారు. సార్పట్టా ఒక చరిత్ర సృష్టించింది. అయితే ఇది థియేటర్లలో రిలీజ్ కాకపోవడం అనేది అభిమానులకి, పా.రంజిత్‌కు కూడా ఒకింత నిరాశ కలిగించింది.
డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు. ప్రముఖ విశ్వ విద్యాలయం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో MA తెలుగు చేశారు. తాజా సినిమా, పాలిటిక్స్, నేషనల్, స్పోర్ట్స్‌కు సంబంధించిన వార్తలతో పాటు ప్రత్యేకమైన కథనాలు రాస్తారు. డిజిటల్ కంటెంట్ రైటర్‌గా సంవత్సరం అనుభవం కలిగి ఉన్నారు. ఈయనకు పాటలు, కవితలు, షార్ట్ ఫిలిమ్స్ వంటివాటికి మాటలు రాసే అలవాటు ఉంది. సహజంగా జానపద, సినిమా పాటలు గాయకుడు.