నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. సినిమాల్లో నటిస్తూ చాలా బిజీ అయిపోయింది. ఒక సినిమా పూర్తి కాకుండానే మరో సినిమా చేస్తూ సినిమా పరిశ్రమలో దూసుకెళ్తోంది. థామా సినిమా విజయం సాధించిన తరువాత.. ఈమె నటించిన ది గర్ల్‌ఫ్రెండ్ సినిమా కూడా మంచి ఆదరణ పొందుతోంది. రిలీజ్ అయిన చాలా తక్కువ రోజుల్లోనే భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఈ సందర్భంగా చిత్ర బృందం సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. దీనికి ముఖ్య అతిధిగా విజయ్ దేవరకొండ హాజరయ్యారు.
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..
ది గర్ల్‌ఫ్రెండ్ సక్సెస్ మీట్ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. రష్మికను గీత గోవిందం సినిమా నాటి నుంచే చూస్తున్నాను. నాకు కోపం వస్తే లేదా నన్ను ఎవరైనా ఏమైనా అంటే.. వాళ్లమీదకు గొడవకు వెళ్తాను. కానీ రష్మిలా అలా కాదు. తనను బాధపెట్టిన వారిని కూడా క్షమించేస్తుంది. తనలోని అమాయకత్వం, అందరూ బాగుండాలనుకునే గుణం చాలా గొప్పవని ప్రశంసించాడు. సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా.. ఎలాంటి సినిమాలను ఎంచుకోవాలి అనే విషయంలో కూడా రష్మిక మంచిని తీసుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతున్నంత సేపు రష్మిక పేరు వచ్చినప్పుడు.. విజయ్ దేవరకొండ రషి అని అంబోధించాడు.
మన భాగస్వామిక రక్షణగా ఉండాలని అందరూ అనుకుంటారు. కాబట్టి మనం వారి కలలను, ఆశయాలను సాధించేలా ప్రోత్సహించాలి. పుట్టడం, కన్నుమూయడం ఇవన్నీ మన చేతుల్లో ఉండవు. కానీ జీవితంలో ఎన్ని మంచి జ్ఞాపకాలు ఉన్నాయన్నది ముఖ్యమని అన్నారు. అంతే కాకుండా.. సమాజంలో వచ్చే అనేక సంఘటనలను ఎదుర్కొని.. ఒక్కో మెట్టుగా రష్మిక ఎదిగిందని, రషి నువ్ అమేజింగ్ అని అన్నారు విజయ్. చాలా కాలం తరువాత నేను చూసిన బెస్ట్ సినిమాల్లో ది గర్ల్‌ఫ్రెండ్ ఒకటని.. ఆ చిత్ర బృందాన్ని కూడా ప్రశంసించారు.
రష్మిక చేతికి విజయ్ ముద్దు
ఇదిలా ఉండగా.. ది గర్ల్‌ఫ్రెండ్ సినిమాకు ముఖ్య అతిగా హాజరైన విజయ్ దేవరకొండ, ప్రారంభంలోనే అల్లు అరవింద్, ఇతరత్రా ప్రముఖులతో మాట్లాడారు. ఆ సమయంలో కనిపించిన రష్మీకకు షేక్యాండ్ ఇవ్వడంతో పాటు, ఆమె చేతిని ముద్దు పెట్టుకున్నాడు. ఇది చూసిన అక్కడి ప్రేక్షకులు గట్టిగా కేకలు వేశారు. దీంతో రష్మిక కూడా సిగ్గుపడింది. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అయింది.
రష్మిక మందన్న మాట్లాడుతూ..
నటి రష్మిక మందన్న మాట్లాడుతూ.. ది గర్ల్‌ఫ్రెండ్ కథను విన్న వెంటనే సినిమాకు ఒప్పుకున్న. ఎందుకంటే భూమా (సినిమాలో రష్మిక పాత్ర పేరు భూమాదేవి) జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు.. నా నిజ జీవితంలో కూడా ఎదురయ్యాయి. ఏదైనా సినిమాలో నటించేటప్పుడు.. ఏ పాత్రకు ఎంతవరకు నటించాలో అంతే నటిస్తా. కానీ ఈ సినిమాలో (ది గర్ల్‌ఫ్రెండ్) మాత్రం నా మనసులో ఏమైతే ఉందో దాన్ని చూపించా అని అన్నారు. అంతే కాకుండా విజ్జు (విజయ్ దేవరకొండ) ఈ సినిమా ప్రారంభం నుంచి నన్ను ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో విజయ్ వంటి వ్యక్తి ఉండాలని. అదొక వరం అని ఆమె పేర్కొంది. మంచి సందేశంతో ఈ సినిమాను తెరకెక్కించిన చిత్ర బృందానికి ఆమె కృతజ్ఞతలు చెప్పింది.
ఉమశ్రీ చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ట్రెండింగ్ అంశాలు, వివిధ విభాగాలపై ప్రత్యేక కథనాలను రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, సైన్స్ & టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, పాలిటిక్స్ తదితర రంగాలకు సంబంధించిన విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో ఆయనకు 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.