రషీద్ ఖాన్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే.. ఈయన ఆప్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్. తనదైన రీతిలో క్రికెట్ ఆడుతూ.. ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన రెండో పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. దీంతో ఆయన రెండో భార్య ఎవరు?, ఆమె బ్యాగ్రౌండ్ ఏమిటనే విషయాలు తెలుసుకోవడానికి నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు.
రెండో భార్యతో రషీద్ ఖాన్
ఆప్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ అయిన రషీద్ ఖాన్.. 2025 ఆగష్టు 2న తాను రెండో పెళ్లి చేసుకున్నట్లు వెల్లడించారు. అప్పటి నుంచి ఈ విషయాన్ని గోప్యంగా ఉంచినప్పటికీ.. ఇటీవల నెదర్లాండ్స్‌లో రషీద్ ఖాన్ ఛారిటీ ఫౌండేషన్ కార్యక్రమంలో తన రెండో భార్యతో కనిపించారు. ఆ సమయంలోనే తన రెండో వివాహం గురించి అధికారికంగా వెల్లడించారు. కాగా వీరిరువురి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నిజమే రెండో పెళ్లి చేసుకున్నా
తన రెండో పెళ్లికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. 2025 ఆగష్టు 2న నా జీవితంలో ఒక అధ్యాయాన్ని ప్రారంభించాను. నేను ఎప్పుడూ ఆశించే ప్రేమ, శాంతి, భాగస్వామిన్ని ప్రతిబింబించే స్త్రీని వివాహం చేసుకున్నాను. ఇటీవల నేను, నా భార్యను ఒక ఛారిటీ కార్యక్రమానికి తీసుకెళ్ళాను. ఆమె నా భార్య, ఇందులో దాచడానికి ఏమీ లేదు అని పేర్కొన్నారు. మాపై ప్రేమ చూపిస్తున్న అందరికి ధన్యవాదాలు తెలిపారు. అయితే.. ఆమెకు సంబంధించిన విషయాలను మాత్రం వెల్లడించలేదు.
2024లో మొదటి వివాహం
రషీద్ ఖాన్ 2024 అక్టోబర్ 3న తన మొదటి వివాహం చేసుకున్నాడు. తన ముగ్గురు సోదరులకు ఒకేసారి వివాహం జరిగింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ జంట విడిపోయినట్లు.. సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు. బహుశా ఆప్ఘనిస్తాన్ దేశంలో బహుభార్య విధానం అమలులో ఉంది. కాబట్టి మొదటి భార్య ఉండగానే.. రెండో వివాహం కూడా చేసుకుని ఉండొచ్చని కొందరు చెబుతారు. ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడలేదు. కాబట్టి మొదటి భార్యకు విడాకులు ఇచ్చారా? లేదా? అనేది ఖచ్చితంగా వెలువడలేదు.
క్రికెట్ విషయానికి వస్తే..
రషీద్ ఖాన్ విషయానికి వస్తే.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ వేలానికి ముందు, ఈయనను గుజరాత్ టైటాన్స్ (జీటీ) నిలుపుకుంటుందని భావిస్తున్నారు. టీ20ఐ క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ అయిన రషీద్.. ఐపీఎల్ 2025 సీజన్‌లో పెద్దగా ప్రదర్శించలేదు. తొమ్మిది కంటే ఎక్కువ ఎకానమీ రేటుతో 15 మ్యాచ్‌ల్లో తొమ్మిది వికెట్లు మాత్రమే పడగొట్టాడు.
భారతదేశంలో రెండో పెళ్లి చట్టమేనా?
మన దేశంలో మొదటి భార్య ఉండగా.. రెండో పెళ్లి చేసుకోవడం నేరం. ఒకవేళా భార్యకు అధికారికంగా విడాకులు ఇచ్చిన తరువాత రెండో పెళ్లి చేసుకోవచ్చు. ఒకవేళా మొదటి భార్య ఉండగా.. రెండో పెళ్లి చేసుకున్నట్లయితే చట్ట రీత్యా అతనిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి భారతదేశంలో భార్య ఉండగా.. రెండోపెళ్లి చేసుకోకూడదు. కొన్ని దేశాల్లో ఇది బహుశా చట్టబద్ధమే అయి కూడా ఉంది. కొన్ని దేశాల్లో ఇది బహుశా చట్టబద్ధమే అయి కూడా ఉంది. కాబట్టి రషీద్ ఖాన్.. దీని ప్రకారం పెళ్లి చేసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు.
శౌర్య వర్ధన్ సబ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. సినిమా, రాజకీయం వంటి విభిన్న అంశాలపై సమగ్రమైన ఆర్టికల్స్ అందిస్తూ వస్తున్నాను. ఈ రంగంలో నాకు నాలుగు సంవత్సరాల అనుభవం ఉంది. రాయడంలో నైపుణ్యంతో, చదువరులకు స్పష్టమైన మరియు ఆసక్తికరమైన కంటెంట్ అందించడం నా లక్ష్యం.