కారు కొనుగోలు చేయడం అనేది చాలామంది కల. ఈ కల కొంతమందికి నిజమవుతుంది, ఇంకొందరికి కల కలగానే మిగిలిపోతుంది. ఇవన్నీ పక్కనపెడితే.. కొత్త కారు కొనాలంటే మాత్రం లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది కూడా పక్కన పడితే.. కారు కొనుగోలు చేసిన తరువాత మెయింటెనెట్స్, ఇంధన ఖర్చు, ఇన్సూరెన్స్, ఇతర పన్నులు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. అయితే కారును కొనుగోలు చేసినప్పుడు యజమాని / ఓనర్ రోడ్ ట్యాక్స్.. జీవితకాల పన్ను (లైఫ్ టైమ్ ట్యాక్స్) లేదా ఐదేళ్లకు ఎంచుకోవచ్చు. ఇందులో ఏది సెలక్ట్ చేసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయనేది ఇక్కడ పరిశీలిద్దాం..
చాలామంది కారును కొనుగోలు చేసినప్పుడే పదేళ్ల పాటు తాము వినియోగిస్తామని నిర్ణయించుకుని లైఫ్ టైమ్ ట్యాక్స్ ఆప్షన్ ఎంచుకుంటారు. ఎందుకంటే దీనివల్ల కొంత డబ్బు ఆదా అవుతుంది. ఐదేళ్ల ట్యాక్స్ ఎంచుకుంటే.. ఈ గడువు (ఐదేళ్లు దాటిన తరువాత) ముగిస్తే మళ్ళీ రెన్యూవల్ చేసుకోవలసి ఉంటుంది.
జీవితకాల పన్ను
- జీవిత కాల పన్ను అనేది.. వాహనం కొనుగోలు చేసినప్పటి నుంచి 15 ఏళ్ల వరకు ఉంటుంది. అంటే 15 సంవత్సరాలకుగానూ ట్యాక్స్ ఒకేసారి చెల్లిస్తారు.
- లైఫ్ టైమ్ ట్యాక్స్ ఆప్షన్ ఎంచుకునే వారు.. ఒకేసారి ట్యాక్స్ చెల్లించాలి. ఒకేసారి చెల్లించడం వల్ల రెన్యూవల్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకవేళా రెన్యూవల్ డేట్ మర్చిపోయినప్పుడు ఫైన్ వంటి వాటి నుంచి కూడా బయటపడొచ్చు. ఈ లైఫ్ టైమ్ ట్యాక్స్ ఆప్షన్ ఎంచుకోవడం వల్ల కొంత డబ్బు ఆదా చేయవచ్చు. ఒకేసారి చెల్లించడం వల్ల స్వల్ప మొత్తంలో ఆదా అవుతుంది.
- జీవిత కాల పన్నును ఎంచుకుని.. ఒకేసారి ట్యాక్స్ చెల్లించడం వల్ల.. మీరు వాహనాన్ని విక్రయించే సమయంలో కొంత ఎక్కువ ధరకు విక్రయించుకోవచ్చు. ఎందుకంటే తరువాత యజమాని.. తాను కొనుగోలు చేసాడు కాబట్టి, అతడు ప్రత్యేకంగా ట్యాక్స్ చెల్లించాల్సిన అవడం ఉండదు. దీనివల్ల మీ వాహనానికి కొంత విలువ పెరుగుతుంది.
- మీరు ఉపయోగించే కారుకు లైఫ్ టైమ్ ట్యాక్స్ చెల్లించినప్పుడు.. వేరే రాష్ట్రానికి తీసుకెళ్లాలనుకున్నప్పుడు, అక్కడ ప్రో-రేటా ట్యాక్స్ చెల్లించి.. అసలు రాష్ట్రంలో వాపసు పొందాల్సి ఉంటుంది. ఇది కొంత క్లిష్టమైన ప్రక్రియ కావొచ్చు. జీవితకాల ట్యాక్స్ ఎంచుకోవడం వల్ల.. ఈ ఒక్కటి బహుశా సమస్యగా మారే అవకాశం ఉంటుంది.
ఐదు సంవత్సరాల ట్యాక్
- కారు ట్యాక్స్ అనేది ఐదేళ్లకు ఎంపిక చేసుకుంటే.. దీని గడువు ఐదేళ్లు మాత్రమే.
- ప్రారంభంలో చెల్లించాల్సిన చెల్లింపులు తక్కువగా ఉన్నప్పటికీ.. మళ్లీ మళ్లీ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. సమయానికి రెన్యువల్ చేయకపోతే.. ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధానం ఎంచుకుంటే.. ఐదేళ్లకు ఒకసారి ట్యాక్స్ కడుతూ ఉండాలి.
- లైఫ్ టైమ్ ట్యాక్స్ చెల్లించిన కారును అమ్మేటప్పుడు దాని ధర కొంత ఎక్కువగా ఉంటుంది. కానీ ఐదేళ్ల ట్యాక్స్ ఎంచుకున్న కారును విక్రయించేటప్పుడు.. దీని విలువ కొంత తక్కువగానే ఉండే అవకాశం ఉంటుంది. స్వల్ప మొత్తంలో తేడా ఉంటుంది. దీనిని గమనించాలి.
- ఐదేళ్ల ట్యాక్స్ చెల్లించడం వల్ల ఒక ప్రయోజనం ఏమిటంటే.. రాష్ట్రం నుంచి బదిలీ అయినప్పుడు అక్కడ రెన్యువల్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ ఆప్షన్ ఎందుకోవడం వల్ల మీకు ఎలాంటి నష్టం ఉండదు. ఉద్యోగస్తులకు ఈ ట్యాక్స్ ప్రయోజనకరంగా ఉంటుంది.
న్యూస్, మీడియా రంగంలో 12 సంవత్సరాల అనుభవం గల సీనియర్ ప్రొఫెషనల్. అనేక ప్రసిద్ధ తెలుగు టీవీ చానెల్స్‌లో పని చేశారు. ఇప్పటివరకు అనేక వ్యాసాలు, కథనాలు, అలాగే డిజిటల్ కంటెంట్ రచనలు చేయడంలో విశేష అనుభవం ఉంది. డిజిటల్ మార్కెటింగ్, తెలుగు కంటెంట్ సృష్టిలో నైపుణ్యం ఉన్న మహేష్, క్రియేటివ్, ఆకర్షణీయ, సమాచారపరమైన కంటెంట్ రూపకల్పనలో ప్రత్యేకత కలిగిన వ్యక్తి.