టాటా మోటార్స్ ఇటీవలే దేశీయ విఫణిలో తన సియెర్రా కారును ఆవిష్కరించింది. కంపెనీ లాంచ్ చేయనున్న ఈ కారు భారతదేశంలో అడుగుపెట్టిన తరువాత.. హ్యుందాయ్ క్రెటా కారుకు ప్రధాన ప్రత్యర్థిగా వ్యవహరించే అవకాశం ఉంది. కాబట్టి ఈ రెండు కార్లకు సంబంధించిన డిజైన్, ఫీచర్స్, ఇంజిన్ వివరాలు, ధరలు ఎలా ఉన్నాయి?, ఇందులో.. రెండు కార్లకు మధ్య ఉన్న సారూప్యం గురించి ఇక్కడ తెలుసుకుందాం.
డిజైన్ ఎలా ఉందంటే?
టాటా సియెర్రా.. బాక్సీ డిజైన్ పొందుతుంది. ఇందులో ఎల్ఈడీ హెడ్‌లైట్స్, డీఆర్ఎల్ వంటి వాటితో పాటు.. బ్రాండ్ లోగో, సియెర్రా అక్షరాలు కనిపిస్తాయి. స్కిడ్ ప్లేట్, ఫాగ్ ల్యాంప్‌లతో అనుసంధానించండి ఉంటుంది. ఫ్లష్ డోర్ హ్యాండిల్స్.. 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కూడా ఈ కారులో ఉండటం గమనించవచ్చు. వెనుక భాగంలో టెయిల్ ల్యాంప్‌లతో విలీనమయ్యే ఎల్ఈడీ లైట్ బార్ ఉంటుంది.
హ్యుందాయ్ క్రెటా.. చూడచక్కని డిజైన్ పొందుతుంది. ఇందులో ఎల్ఈడీ లైట్ బార్, క్రోమ్ యాక్సెంట్‌లు ఉన్నాయి. ఇది డ్యూయెల్ టోన్ ఫినిషింగ్ పొందటం వల్ల చూడటానికి మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. సియెర్రా మాదిరిగా బోల్డ్ డిజైన్ పొందదు. క్రెటా అంచులలో యాంగ్యులర్ డిజైన్ కనిపిస్తుంది. స్ప్లిట్ టెయిల్‌లైట్ క్లస్టర్ ఉంటుంది. ఈ కారు స్పోర్టీ లుక్‌ను మరింత మెరుగు పరచడానికి రూఫ్ స్పాయిలర్, సిల్వర్ ఫినిష్డ్ స్కిడ్ ప్లేట్ ఉన్నాయి.
డైమెన్షన్స్ (కొలతలు)
టాటా మోటార్స్ తన సియెర్రా కారును ఆవిష్కరించింది. కానీ దీని పరిమాణంకు సంబంధించిన విషయాలను అధికారికంగా వెల్లడించలేదు. అయినప్పటికీ.. ఇది బాక్సీ డిజైన్ కలిగి ఉండటం వల్ల.. హ్యుందాయ్ క్రెటా కంటే కూడా కొంత పెద్దదిగా, విశాలంగా ఉన్నట్లు కనిపిస్తోంది.
హ్యుందాయ్ క్రెటా విషయానికి వస్తే.. దీని పొడవు 4330 మిమీ, వెడల్పు 1790 మిమీ, ఎత్తు 1635 మిమీ, వీల్‌బేస్ 2610 మిమీ, గ్రౌండ్ క్లియరెన్స్ 190 మిమీ వరకు ఉంది. అంటే ఇది ప్రయాణికులకు చాలా అనుకూలంగా ఉంటుందని స్పష్టంగా అర్థమవుతోంది.
ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే?
ప్రస్తుతానికి టాటా సియెర్రా వేరియంట్లకు సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడికాలేదు. కానీ ఈ మోడల్ కారులో పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయెల్ జోన్ ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్, పవర్డ్ అండ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, రియర్ సన్‌షేడ్‌లు, 360 డిగ్రీ కెమెరా, లెవెల్ 2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టం వంటివన్నీ ఉంటాయని తెలుస్తోంది.
హ్యుందాయ్ క్రెటా ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇది వెంటిలేటెడ్ సీట్లు, డ్యూయెల్ జోన్ ఆటోమాటిక్ టెంపరేచర్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నెల్ వంటివెన్నో పొందుతుంది.
ధరల గురించి
టాటా మోటార్ తన సియెర్రా కారు ధరలను అధికారికంగా ప్రకటించలేదు. కానీ దీని ప్రారంభ ధర రూ. 12.50 లక్షలు (ఎక్స్ షోరూమ్) ఉండవచ్చని సమాచారం. అయితే కంపెనీ ఈ కారు ధరలను కంపెనీ నవంబర్ 25న లాంచ్ సమయంలో వెల్లడించనుంది. హ్యుందాయ్ కంపెనీకి చెందిన క్రెటా ధరలు రూ. 10.72 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది మల్టిపుల్ వేరియంట్లలో, బహుళ ఇంజిన్ ఎంపికలలో అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఎంచుకునే వేరియంట్ మీద ధరలు ఆధారపడి ఉంటాయి.
ఇంజిన్ వివరాలు ఇలా
కొత్త టాటా సియెర్రా కారులో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉండే అవకాశం ఉంది. ఇది 170 హార్స్ పవర్, 280 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజిన్ మాన్యువల్, ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో లభిస్తుంది. అంతే కాకుండా ఇది.. 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఎంపికలో కూడా అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఇది 118 హార్స్ పవర్, 260 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.
హ్యుందాయ్ క్రెటాలో 115 బీహెచ్పీ పవర్ అందించే 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 116 బీహెచ్పీ పవర్ డెలివరీ చేసే 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ మరియు 160 బీహెచ్పీ పవర్ ప్రొడ్యూస్ చేసే 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉన్నాయి. ఇవి 6 స్పీడ్ మాన్యువల్, సీవీటీ వంటి ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ పొందుతుంది.
శౌర్య వర్ధన్ సబ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. సినిమా, రాజకీయం వంటి విభిన్న అంశాలపై సమగ్రమైన ఆర్టికల్స్ అందిస్తూ వస్తున్నాను. ఈ రంగంలో నాకు నాలుగు సంవత్సరాల అనుభవం ఉంది. రాయడంలో నైపుణ్యంతో, చదువరులకు స్పష్టమైన మరియు ఆసక్తికరమైన కంటెంట్ అందించడం నా లక్ష్యం.