బంగారం ధరలు దాగుడుమూతలాడుతున్నాయి. ఒకరోజు భారీగా పెరిగితే.. ఇంకోరోజు తగ్గుతున్నాయి. ఓరోజు ఉదయం తగ్గితే.. సాయంత్రానికే పెరిగిపోతున్నాయి. అయితే ఈ రోజు మాత్రం గరిష్టంగా గోల్డ్ రేటు 1740 రూపాయాలు తగ్గింది. దీంతో పసిడి ప్రియులు కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ రోజు కొత్త ధరలు ఎలా ఉన్నాయంటే..
బంగారం ధరలు ఈ రోజు (నవంబర్ 18)
- హైదరాబాద్: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1740 రూపాయలు తగ్గి రూ. 1,23,660 వద్దకకు చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 1600 తగ్గి.. రూ. 1,13,350 వద్ద నిలిచింది.
- విజయవాడ: నగరంలో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 1740 తగ్గింది. దీంతో రేటు రూ. 1,23,660గా ఉంది. ఇదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1600 తగ్గి.. రూ. 113350 వద్ద నిలిచింది.
- చెన్నై: దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే చెన్నై గోల్డ్ రేటులో కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. ఇక్కడ 24 క్యారెట్ల ధర రూ. 1520 తగ్గి.. 1,24,370 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు 1400 రూపాయలు తగ్గి, రూ. 1,14,000 వద్ద నిలిచింది. దీన్నిబట్టి చూస్తే ఇక్కడ ధరలు తెలుగు రాష్ట్రాల్లో కంటే కొంత ఎక్కువగా ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.
- ఢిల్లీ: భారతదేశ రాజధాని నగరంలో కూడా గోల్డ్ రేట్లు పెరిగాయి. ఇక్కడ 24 క్యారెట్లు, 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు వరుసగా రూ. 1740, రూ. 1600 తగ్గింది. దీంతో పసిడి ధరలు వరుసగా రూ. 1,23,810 & రూ. 1,13,500 వద్ద ఉన్నాయి. మొత్తం మీద చెన్నైలో పసిడి ధరలు ఎక్కువ కావడం గమనార్హం.
వెండి ధరలు ఇలా..
గత నెలలో ఏకంగా రెండు లక్షల రూపాయలు దాటేసిన కేజీ వెండి రేటు.. ఈ రోజు (మంగళవారం) రూ. 1.70 లక్షలకు చేసింది. ఈ రోజు (2025 నవంబర్ 18) కేజీ వెండి రేటు రూ.3000 తగ్గడంతో ధర రూ. 1.70 లక్షలకు చేరింది. ఒకప్పుడు లక్ష రూపాయల కంటే తగ్గువ ఉన్న వెండి రేటు.. ఈ రోజు ఇంత వేగంగా పెరిగిందంటే.. దీనికి కారణం వెండికి డిమాండ్ అమాంతం పెరగడమే. భవిష్యత్తులో సిల్వర్ రేటు మరింత పెరుగుతుందని పలువురు నిపుణులు చెబుతున్నారు.
అందుకే గోల్డ్ రేటు పెరుగుతోంది?
బంగారం ధరలు భారతదేశంలో మాత్రమే కాకుండా.. ప్రపంచ మార్కెట్లో కూడా పెరుగుతున్నాయి. దీనికి కారణం గోల్డ్ కొనేవాళ్ల సంఖ్య పెరగడం లేదా ఇందులో పెట్టుబడి పెట్టేవాళ్లు పెరగడమే. అంతే కాకుండా అమెరికా డాలర్ విలువలో వచ్చే మార్పు కూడా.. బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి.
భౌగోళిక, రాజకీయ కారణాలు.. ఎగుమతులు, దిగుమతులు.. కొన్ని దేశాలు విధించే భారీ సుంకాలు కూడా పసిడి ధరలను అమాంతం పెంచుతాయి. అయితే చైనా వంటి దేశాలు బంగారం దిగుమతిని తగ్గించుకునే అవకాశం ఉందని, దీనివల్ల పసిడి ధరలు కొంత తగ్గే అవకాశం ఉందని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. ఎంత ధరలు తగ్గినా.. దీనికున్న డిమాండ్ మాత్రం ఇతర దేశాల్లో (భారతదేశంలో కూడా) తగ్గక పోవడం వల్ల.. బంగారం రేటు ఊహకందని రీతిలో తగ్గే అవకాశం మాత్రం లేదు. ఒకవేళా తగ్గినా.. బంగారం విలువ తగ్గే ప్రసక్తే లేదు.
డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు. ప్రముఖ విశ్వ విద్యాలయం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో MA తెలుగు చేశారు. తాజా సినిమా, పాలిటిక్స్, నేషనల్, స్పోర్ట్స్‌కు సంబంధించిన వార్తలతో పాటు ప్రత్యేకమైన కథనాలు రాస్తారు. డిజిటల్ కంటెంట్ రైటర్‌గా సంవత్సరం అనుభవం కలిగి ఉన్నారు. ఈయనకు పాటలు, కవితలు, షార్ట్ ఫిలిమ్స్ వంటివాటికి మాటలు రాసే అలవాటు ఉంది. సహజంగా జానపద, సినిమా పాటలు గాయకుడు.