2025 ప్రారంభం నుంచి ఇండియన్ మార్కెట్లో లెక్కకు మించిన కార్లు లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఇందులో పెట్రోల్, డీజిల్, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. అయితే ఈ ఏడాది ముగిసేలోపు మరికొన్ని కార్లను లాంచ్ కావడానికి సిద్ధమవుతున్నాయి. అయితే ఈ కథనంలో త్వరలో లాంచ్ అయ్యే ఎలక్ట్రిక్ కార్లు ఏవి? వారి వివరాలు ఏమిటి? అనేది తెలుసుకుందాం.
మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్
భారతీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా.. ఈనెల 27న (నవంబర్ 27) తన ఎక్స్ఈవీ 9ఎస్ కారును లాంచ్ చేయనుంచి. ఇది ఇప్పటికే మార్కెట్లో అమ్మకానికి ఉన్న, బ్రాండ్ యొక్క ఎక్స్ఈవీ 9ఈ, బీఈ 6 జాబితాలోకి చేరుతుంది. కాబట్టి ఇది కూడా ఐఎన్జీఎల్ఓ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడి ఉంటుంది. కంపెనీ ఈ కారుకు సంబంధించిన పవర్‌ట్రెయిన్, స్పెసిఫికేషన్‌లను అధికారికంగా వెల్లడించలేదు. కానీ ఇందులో 59 కిలోవాట్, 79 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్స్ ఉంటాయని సమాచారం.
మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్ ఎలక్ట్రిక్ కారు.. త్రిభుజాకారంలో ఉండే ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, కనెక్టెడ్ ఎల్ఈడీ లైట్ బార్ వంటివి పొందుతుంది. ఇంటీరియర్ దాదాపు 9ఈ మాదిరిగా ఉంటుంది. ట్రిపుల్ స్క్రీన్ సెటప్, పనోరమిక్ సన్‌రూఫ్, స్లైడింగ్ మిడిల్ రో సీట్లు, హార్మాన్ కార్టాన్ స్పీకర్ సిస్టం మొదలైనవి ఈ లేటెస్ట్ కారులో ఉండనున్నాయి.
మారుతి సుజుకి ఈ-విటారా
2025 డిసెంబర్ 2న మారుతి సుజుకి.. తన గ్రాండ్ విటారా కారును లాంచ్ చేయనుంది. ఇది 49 కిలోవాట్ బ్యాటరీ (344 కిమీ రేంజ్), 61 కిలోవాట్ బ్యాటరీ (428 కిమీ రేంజ్) ఎంపికలలో అందుబాటులో ఉంటుంది. డిజైన్ పరంగా.. ఇది సాధారణ గ్రాండ్ విటారా మాదిరిగా ఉన్నప్పటికీ.. ఇందులో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్ లాంప్, యారో స్టైల్ వీల్స్ ఉన్నాయి. కారు లోపలి భాగంలో.. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం కోసం డ్యూయెల్ స్క్రీన్ ఉంటాయి. అంతే కాకుండా.. 360 డిగ్రీ కెమెరా, పవర్డ్ డ్రైవర్ సీటు, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే వంటివి కూడా ఇందులో ఉంటాయి.
టాటా సియెర్రా ఈవీ
దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్.. నవంబర్ 25న సియెర్రా కారును లాంచ్ చేయనుంది. అంటే సంస్థ ఆ రోజు ఈ కారు ధరలను ప్రకటించనుంది. ఆ తరువాత.. ఈ ఏడాది చివరి నాటికి లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో.. దీనిని ఎలక్ట్రిక్ కారుగా లాంచ్ చేయనుంది. కాగా దీనికి సంబంధించిన చాలా వివరాలు తెలియాల్సి ఉంది.
టాటా సియెర్రా ఈవీ.. అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెస్స్ సిస్టం, పనోరమిక్ సన్‌రూఫ్, జేబీఎల్ బ్రాండెడ్ ఆడియో సిస్టం, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు మొదలైవి పొందనున్నట్లు సమాచారం. అయిత్ డిజైన్ పరంగా కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇది క్లోస్డ్ గ్రిల్ పొందుతుంది. ఈ ప్రాంతంలో ఛార్జింగ్ పోర్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కారుకు సంబందించిన చాలా వివరాలు రాబోయే రోజుల్లో ఒక్కొక్కటిగా వెల్లడవుతాయి. బహుశా సియెర్రా ఈవీ గురించి కంపెనీ త్వరలోనే ఓ అధికారిక ప్రకటన చేసే అవకాశం కూడా ఉందని భావిస్తున్నాము.
న్యూస్, మీడియా రంగంలో 12 సంవత్సరాల అనుభవం గల సీనియర్ ప్రొఫెషనల్. అనేక ప్రసిద్ధ తెలుగు టీవీ చానెల్స్‌లో పని చేశారు. ఇప్పటివరకు అనేక వ్యాసాలు, కథనాలు, అలాగే డిజిటల్ కంటెంట్ రచనలు చేయడంలో విశేష అనుభవం ఉంది. డిజిటల్ మార్కెటింగ్, తెలుగు కంటెంట్ సృష్టిలో నైపుణ్యం ఉన్న మహేష్, క్రియేటివ్, ఆకర్షణీయ, సమాచారపరమైన కంటెంట్ రూపకల్పనలో ప్రత్యేకత కలిగిన వ్యక్తి.