భారతదేశంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ హవా కొనసాగుతున్న తరుణంలో.. కంపెనీ మరో బైక్ లాంచ్ చేసింది. దీనిపేరు హిమాలయన్ మన బ్లాక్ ఎడిషన్. ఇది చూడటానికి సాధారణ హిమాలయన్ బైక్ మాదిరిగా.. ఉన్నప్పటికీ రంగులో చాలా వ్యత్యాసం ఉండటం చూడవచ్చు. ఈ సరికొత్త బైక్ ధర, ఇంజిన్ వంటి అన్ని వివరాలతో ఈ ప్రత్యేక కథనం..
ప్రారంభ ధర
సరికొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ మన హిమాలయన్ ఎడిషన్ ప్రారంభ ధర రూ. 3.37 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కొత్త ఎడిషన్ ధర సాధారణ ఎడిషన్ ధర కంటే కూడా రూ. 17000 ఎక్కువ. కాగా కంపెనీ ఈ బైక్ కోసం బుకింగ్స్ స్వీకరించడం మొదలుపెట్టింది. దీనిని బ్రాండ్ అధికారిక డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి.
అదే ఇంజిన్
నిజానికి.. హిమాలయన్ మన బ్లాక్ ఎడిషన్‌ను ఈఐసీఎంఏ 2025లో ప్రదర్శించారు. ఈ బైక్ డిజైన్ అప్డేట్స్ పొందినప్పటికీ.. మెకానికల్ అప్డేట్స్ పొందలేదు. కాబట్టి అదే 452 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 8000 ఆర్పీఎం వద్ద 40 హార్స్ పవర్, 5500 ఆర్పీఎం వద్ద 40 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ అదే సిక్స్ స్పీడ్ గేర్‌బాక్స్ & స్లిప్పర్ క్లచ్ వంటివి పొందుతుంది. కాగా ఈ బైక్ రెండు చివరలలోనూ.. 200 మిమీ సస్పెన్షన్ ఉంటుంది. బ్రేకింగ్ విషయంలో కూడా ఎలాంటి అప్డేట్స్ పొందలేదు.
విభిన్న యాక్ససరీస్
మన బ్లాక్ ఎడిషన్ హిమాలయన్ బైక్.. బ్లాక్ ర్యాలీ హ్యాండ్ గార్డ్స్, బ్లాక్ ర్యాలీ సీటు, కఠినమైన భూభాగాల్లో సజావుగా ముందుకు సాగటానికి ఉపయోగపడే ర్యాలీ మడ్ గార్డ్, ట్యూబ్‌లెస్ స్పోక్డ్ వీల్స్ వంటి ఫ్యాక్టరీ ఎక్విప్డ్ అడ్వెంచర్ యాక్ససరీస్ పొందవచ్చు. ఇవన్నీ ఈ స్పెషల్ ఎడిషన్ బైకును.. సాధారణ బైక్ కంటే భిన్నంగా చూపిస్తుంది.
ప్రేరణ అదే..
హిమాలయన్ మన బ్లాక్ ఎడిషన్ అనేది.. మన పాస్ ప్రాంతం నుంచి ప్రేరణ పొందింది. ఈ కారణంగానే దీనిని అదేపేరుతో లాంచ్ చేయడం జరిగింది. అంతే కాకుండా బ్రాండ్ ఉపయోగించిన విభిన్న ప్యానెల్స్ కారణంగా.. ఇది ఒక స్పెషల్ డిజైన్ పొందింది. అయితే ఆఫ్ రోడ్ లక్షణాలు మాత్రం అలాగే ఉన్నాయి.
ఇతర వివరాలు
మన బ్లాక్ ఎడిషన్ హిమాలయన్ బైక్.. చూడటానికి డిజైన్ పరంగా కొంత భిన్నంగా ఉన్నప్పటికీ.. ఛాసిస్, రియర్ సస్పెన్షన్ ఆర్మ్, వీల్ సైజు, టైర్ కాంపౌండ్, రైడ్ ఎత్తు సాధారణ హిమాలయన్ బైకునే తలపిస్తాయి. అంటే ఇవన్నీ సాధారణ హిమాలయన్ బైకులో ఉన్న విధంగానే ఉన్నాయన్న మాట. అయితే సాధారణ బైక్ కంటే ఇది ఒక కేజీ తక్కువ బరువు ఉంటుంది. అంటే బ్లాక్ మన హిమాలయన్ కర్బ్ వెయిట్ 195 కేజీలన్న మాట.
హిమాలయన్ బైకుకు ఉన్న ఆదరణ
మన దేశంలో చాలామంది ఆఫ్ రోడింగ్ ప్రియులు బాగా ఇష్టపడే బైకుల జాబితాలో హిమాలయన్ ఒకటి. ఇది మార్కెట్లో లాంచ్ అయినప్పటి నుంచి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతూనే ఉంది. ఇందులో కూడా విభిన్న వేరియంట్స్ ఉన్నాయి. కాగా కంపెనీ ఇప్పుడు మన బ్లాక్ హిమాలయన్ ఎడిషన్ పేరుతో లాంచ్ చేసింది. ఇది ఎలాంటి అమ్మకాలను పొందుతుందో తెలుసుకోవడానికి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
ఉమశ్రీ చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ట్రెండింగ్ అంశాలు, వివిధ విభాగాలపై ప్రత్యేక కథనాలను రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, సైన్స్ & టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, పాలిటిక్స్ తదితర రంగాలకు సంబంధించిన విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో ఆయనకు 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.