భార్యలకు తమ భర్తలు గిఫ్ట్స్ ఇవ్వడం సర్వసాధారణం అయిపోయింది. ఇటీవల భారతీయ నటి నయనతార పుట్టినరోజుకు.. ఆమె భర్త విగ్నేష్ శివన్ రోల్స్ రాయిస్ ఎలక్ట్రిక్ కారును గిఫ్ట్ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా హాలీవుడ్ నటి నర్గీస్ ఫఖ్రీకి ఆమె భర్త టోనీ బీగ్ రోల్స్ రాయిస్ కల్లినన్ కారును గిఫ్ట్ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె (నర్గీస్ ఫఖ్రీ) తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు.
భార్యకు ఖరీదైన గిఫ్ట్
నటి నర్గీస్ ఫఖ్రీ కొన్ని రోజులకు ముందు (అక్టోబర్ 20) తన 46వ పుట్టినరోజు జరుగుకుంది. ఈ సందర్భంగా ఆమె భర్త టోనీ బీగ్.. ఖరీదైన రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన కల్లినన్ గిఫ్ట్‌గా ఇచ్చారు. కొత్తకారును గిఫ్ట్ ఫ్యాక్ మాదిరిగా చేసి ఉండటం ఫోటోలలో గమనించవచ్చు. కారును ఎడారి ప్రాంతం మధ్యలో ఆపి ఉంచి, దానైపైన నర్గీస్ కూర్చుని ఉండటం చూడవచ్చు. మరో ఫొటోలో ఆమె వెనుక వ్యూయింగ్ సూట్ మీద కూర్చుని ఉంది. అది కూడా రోల్స్ రాయిస్ కారు కావడం గమనార్హం.
నర్గీస్ ఫఖ్రీకు గిఫ్ట్‌గా ఇచ్చిన రోల్స్ రాయిస్ కల్లినన్ ధర ఎంత అనేది వెల్లడించలేదు. కాబట్టి మనం కూడా ఖచ్చితమైన ధరను వెల్లడించలేము. ఎందుకంటే రోల్స్ రాయిస్ ధరలు.. దాని ఫీచర్స్, కలర్ వంటి వాటిమీద ఆధారపడి ఉంటాయి. కల్లినన్ ధర ప్రస్తుతం సాధారణంగా రూ. 10 కోట్ల కంటే ఎక్కువ ఉంటుందని అంచనా.
కల్లినన్ డిమాండ్ ఇలా
రోల్స్ రాయిస్ కంపెనీ మార్కెట్లో విక్రయిస్తున్న కార్లలో.. కల్లినన్ కారుకు అధిక డిమాండ్ ఉంది. చాలామంది సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ ప్రముఖులు కూడా ఎక్కువగా ఈ మోడల్ కారునే వినియోగిస్తుంటారు. ఇప్పుడు ఈ జాబితాలోకి నర్గీస్ ఫఖ్రీ కూడా ఉన్నారు.
సిరీస్ I కల్లినన్ అనేది రోల్స్ రాయిస్ వాహనాల్లో ఆల్ వీల్ డ్రైవ్ (ఏడబ్ల్యుడీ) అప్షన్ కలిగిన మొదటి కారు. ఇది 6.75 లీటర్ వీ12 పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇంజిన్ 571 హార్స్ పవర్, 850 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కాగా కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్ వేరియంట్ 600 హార్స్ పవర్, 900 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.
ఫీచర్స్ ఇలా..
ప్రస్తుతం మార్కెట్లో రోల్స్ రాయిస్ కల్లినన్ ఫేస్‌లిఫ్ట్ అందుబాటులో ఉంది. ఇది సాధారణ కల్లినన్ కంటే కూడా అత్యాధునిక డిజైన్ పొందుతుంది. ఫీచర్స్ కూడా అప్డేటెడ్. లగ్జరీ అనుభవాన్ని అందించే క్యాబిన్ లభిస్తుంది. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌ను కలిగిన మొదటి రోల్స్ రాయిస్ కారు ఇదే (కల్లినన్ ఫేస్‌లిఫ్ట్) కావడం గమనార్హం. రోటరీ కంట్రోల్ కూడా ఇందులో చూడవచ్చు. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కప్యానెల్ మాత్రమే కాకుండా.. డాష్‌బోర్డ్‌లో సిగ్నేచర్ అనలాగ్ క్లాక్ కూడా ఉంటుంది. వెనుక ప్రయాణికుల కోసం 12 ఇంచెస్ ఎంటర్టైన్మెంట్ స్క్రీన్స్ లభిస్తాయి.
రోల్స్ రాయిస్ కార్లు.. ఇతర కార్ల మాదిరిగా కాకుండా భిన్నంగా ఉంటాయి. కంపెనీ ఈ కార్లను తయారు చేయడంలో మాత్రమే కాకుండా.. విక్రయించే సమయంలో కూడా చాలా రూల్స్ పాటిస్తుంది. ధరలు కూడా చాలా ఎక్కువే. అయితే ధరలకు తగిన ఫీచర్స్ ఈ బ్రాండ్ కార్లలో తప్పకుండా లభిస్తాయి.
ఉమశ్రీ చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ట్రెండింగ్ అంశాలు, వివిధ విభాగాలపై ప్రత్యేక కథనాలను రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, సైన్స్ & టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, పాలిటిక్స్ తదితర రంగాలకు సంబంధించిన విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో ఆయనకు 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.