మోక్షజ్ఞ ఎంట్రీపై.. బాలకృష్ణ క్లారిటీ: సినిమా పేరు ఏంటంటే?

తెలుగు సినిమా ప్రపంచం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. కొత్త హీరోలు, హీరోయిన్స్ ఈ రంగంలోకి అడుగుపెడుతున్నారు. అయితే నందమూరి బాలకృష్ణ వారసులు మాత్రం ఇంకా సినిమాల్లోకి అరంగేట్రం చేయడం లేదు. ఇప్పుడు, అప్పుడు అంటున్నారు. కానీ ఎప్పుడనే విషయంపై ఇప్పటి వరకు ఒక స్పష్టమైన క్లారిటీ లేదు. ఇప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు.

మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడంటే?

నందమూరి బాలకృష్ణ వారసుడు.. నందమూరి మోక్షజ్ఞ తేజ సినిమా ఎంట్రీకి సంబంధించిన చాలా వార్తలు వినిపిస్తున్నా.. ప్రస్తుతం బాలకృష్ణ అధికారికంగా వెల్లడించారు. ఒకప్పుడు గొప్ప హిట్ సాధించిన ఆదిత్య 396 సినిమాకు కొనసాగింపుగా.. ఆదిత్య 999 మ్యాక్స్తో మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు బాలయ్య పేర్కొన్నారు. గోవాలో జరిగిన ఐఎఫ్ఎఫ్ఐ 2025 (ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఆఫ్ ఇండియా 2025) కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

ఆదిత్య 999 మ్యాక్స్

1991లో బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 సినిమాకు కొనసాగింపుగా ఆదిత్య 999 మ్యాక్స్ రానుంది. ఈ మూవీని ప్రముఖ దర్శకుడు క్రిష్ తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ ప్రిపేర్ చేసుకోవడంలో ఆయన (క్రిష్) బిజీగా ఉన్నట్లు సమాచారం. దీన్నిబట్టి చూస్తే మోక్షజ్ఞ.. తన తండ్రి సినిమాతోనే తెలుగు చిత్ర సీమలో అరంగేట్రం చేయనున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.

అప్పట్లోనే గొప్ప బ్లాక్ బస్టర్ సాధించిన ఆదిత్య 369 సినిమాలో.. సైన్స్ ఫిక్షన్, రొమాన్స్ అన్నీ ఉన్నాయి. 1991లోనే అంత గొప్ప హిట్ సాధించిన ఆ సినిమా.. ఇప్పుడు తెరమీదకు వస్తుందటే ఇంకెలా ఉంటుంది ఊహించుకోవచ్చు. దీన్ని బట్టి చూస్తే.. బాలకృష్ణ, మోక్షజ్ఞ ఇద్దరు ఒకే సినిమాలో కనిపించనున్నారన్న మాట. ఇది బాలయ్య అభిమానులకు పెద్ద పండుగలాంటి వార్త అనే చెప్పాలి. అయితే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది?, హీరోయిన్స్ ఎవరు?, అనే విషయాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.

మోక్షజ్ఞ తేజ గురించి

నందమూరి తారకరామ మోక్షజ్ఞ తేజ.. 1994 సెప్టెంబర్ 5న బాలకృష్ణ & వసుంధర దేవి దంపతులకు జన్మించారు. ఇతడు యూఎస్ఏలో మేనేజ్‌మెంట్ కోర్సు చేసినట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు ఏ సినిమాలో కనిపించలేదు. కానీ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హీరోగా పరిచయం చేయాలని ప్లాన్స్ ఉన్నాయని గతంలో పేర్కొన్నారు. ఆ సినిమా పేరు సింబా అని కూడా పెట్టినట్లు కొన్ని వార్తలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఆ సినిమా బహుశా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. కాబట్టే క్రిష్ దర్శకత్వంలో సినిమాల్లో కనిపించనున్నారని ఇప్పుడు బాలయ్య ప్రకటించారు.

సినిమా రంగంలోని నందమూరి వారసులు

తెలుగు సినిమా రంగంలో చాలావరకు మెగా వారసులు, నందమూరి వారసులే ఉన్నారు. నందమూరి వారసుల జాబితాలో.. దివంగత నటుడు రామారావు, హరికృష్ణ, బాలకృష్ణ వంటివారు మాత్రమే కాకుండా.. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారక రత్న కూడా ఉన్నారు. కాగా ఇందులో రామారావు, హరికృష్ణ, తారక రత్న ప్రస్తుతం లేదు. కాగా మోక్షజ్ఞ తేజ త్వరలోనే సినీ అరంగేట్రం చేయనున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కొడుకు కూడా భవిష్యత్తులో సినిమాల్లో కనిపించే అవకాశం ఉంది.