శీతాకాలం మొదలైపోయింది. మంచు క్రమంగా పెరుగుతోంది. నగరాల్లో కాలుష్యం కూడా పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ పోలీస్ యంత్రాంగం ఎరైవ్ – ఎలైవ్ పేరుతో ఓ కొత్త కార్యక్రమం ప్రారంభించింది. ఈ కార్యక్రమం ఎందుకు ప్రారంభించారు?, దీనివల్ల ఉపయోగాలు ఏమిటి అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
చలికాలం.. పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే.. ఈ ప్రభావం నగరాల్లో ఎక్కువగా ఉంటుంది. పొగమంచు కారణంగా ఎదురుగా వచ్చే పాదాచారులు, జంతువులు, వాహనాలు స్పష్టంగా కనిపించవు. కాబట్టి అనుకోని అతిధిలాగా.. అనుకోని ప్రమాదం జరుగుతుంది. కాబట్టి ఈ శీతాకాలంలో రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు తప్పకుండా కొన్ని సూచనలు పాటించాలి.
వాహనదారుల కోసం సూచనలు
- మీరు చేరుకోవాల్సిన గమ్యం చేరుకోవడానికి.. నిర్ణీత సమయం కంటే కొంత ముందుగానే బయలుదేరాలి. ఇలా బయలుదేరినప్పుడు.. మీరు నెమ్మదిగా ప్రయాణం చేసినా.. సరైన సమయానికి మీరు గమ్యం చేరుకోగలరు.
- నేషనల్ హైవేలపై ప్రయాణించేటప్పుడు.. లేన్ చూసుకోవాలి. వేగంగా వెల్తూ లేన్స్ మారితే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. నిబద్దతతో మీరు వాహనం నడిపినప్పుడే.. ముందున్న వాహనాలను గుర్తించడం సాధ్యమవుతుంది. కాబట్టి శీతాకాలంలో ప్రయాణం సురక్షితంగా జరగాలంటే కొంత జాగ్రత్త అవసరం.
- ఉదయం సమయంలో లేదా పొగమంచు ఎక్కువగా ఉన్న సమయంలో కారు అద్దాలను కొంచెం కిందికి దించుకోవాలి. ఇలా చేయడం వల్ల.. మంచు ఒకేచోట పేర్కుకోకుండా ఉంటుంది. ఇలా వద్దనుకుంటే వైపర్స్ ఉపయోగించి ఎప్పటికప్పుడు పొగమంచు తొలగించుకుంటూ ఉండాలి. పొగ మంచు ఎక్కువగా ఉంటే.. కొంత సేపు వాహనాన్ని పక్కకు ఆపి, తరువాత బయలుదేరడం మంచిది.
- మరో ముఖ్యమైన విషయం.. పొగమంచు ఎక్కువగా ఉన్నప్పుడు మీరు వెనుక వచ్చే వాహనదారులకు కనిపించకపోవచ్చు. అలాంటప్పుడు హజార్డ్ లైట్స్ ఆన్ చేసుకోవాలి. ఇవి ఇండికేషన్ మాదిరిగా పనిచేస్తాయి. వెనుక వచ్చేవారు మీ వాహనాన్ని సులభంగా గుర్తించగలుగుతారు.
- శీతాకాలంలో మంచు ఎక్కువగా కురవడం వల్ల, రోడ్లు కూడా తడిగా మారుతాయి. ఇలా తడిగా మారినప్పుడు.. సడన్ బ్రేక్ వేస్తే కొన్నిసార్లు వాహనం స్కిడ్ అవుతుంది. కాబట్టి ఇలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలంటే.. పరిమిత వేగంతో వాహనాన్ని నడపాల్సి ఉంటుంది.
పొగ మంచు వల్ల జరిగే అనర్థాలు
మంచు కాలంలో దట్టమైన మంచు ఏర్పడటం వల్ల లెక్కకు మించిన ప్రమాదాలు జారుగుతుంటాయి. దీనికి కారణం రోడ్డు సరిగ్గా కనిపించకపోవడం, ముందు వెళ్లే వాహనం కనిపించకపోవడమే. కాబట్టి ప్రయాణం అత్యవసరమైతే తప్పా.. మంచు ఉన్న సమయంలో జర్నీ మొదలు పెట్టకుండా ఉండటమే మంచిది. ఒకవేళా ప్రయాణం సాగించాలంటే.. తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే మనం ప్రారంభంలో చెప్పుకున్నట్లు.. ప్రమాదం అనుకోని అతిథి రూపంలో వస్తుంది.
ఇప్పటికే కొన్ని నగరాల్లో పొగమంచు, కాలుష్యం రెండూ కలిసి.. ప్రమాదంగా మారాయి. దీంతో గాలి కలుషితమైపోతోంది. ప్రజలు బయటకు రాలేని పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. దీనికి కారణం వాహనాల వల్ల ఏర్పడే కాలుష్యం, ప్యాకరీల నుంచి వచ్చే పొగ మొదలైనవి. కాబట్టి శీతాకాలంలో తప్పకుండా వాహన వినియోగదారులు రోడ్డుపై ప్రయాణించే సమయంలో జాగ్రత్త పడాల్సిందే.
ఉమశ్రీ చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ట్రెండింగ్ అంశాలు, వివిధ విభాగాలపై ప్రత్యేక కథనాలను రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, సైన్స్ & టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, పాలిటిక్స్ తదితర రంగాలకు సంబంధించిన విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో ఆయనకు 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.






