హీరో కార్తీ, కృతి శెట్టి జంటగా నటించిన సినిమా అన్నగారు వస్తారు. నలన్ కుమారస్వామి దర్శకత్వంలో.. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో సత్యరాజ్, రాజ్ కిరణ్, ఆనంద్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 2025 డిసెంబర్ 5వ తేదీన.. సినిమా విడుదల అవుతుందని సమాచారం. అయితే దీనికి సంబంధించిన టీజర్ విడుదల చేసి అభిమానులకి మంచి అప్డేట్ ఇచ్చారు.
రాబోయే కార్తీ సినిమాలు ఇవే..
కార్తీ అన్నగారు వస్తారు (తమిళంలో “వా వాథియార్”) సినిమా ఈ సంవత్సరంలోనే డిసెంబర్ 5వ తేదీ విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీని తర్వాత వరుసగా ఒకదానికి తర్వాత ఒకటి క్యూ కట్టాయి. అన్నగారు వస్తారు సినిమా యాక్షన్ అండ్ ఫుల్ కామెడీ జానర్లో ఉండనుంది.
ఇందులో కార్తీ కొంచెం జాలీ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. కానీ తాత మాత్రం కొన్ని విలువలతో పెంచాలి అనుకుంటాడు. మరి ఎలా వీటిని ఛేదించాడు అనేది ఆసక్తికరంగా ఉంటుందంట. టీజర్ ఫుల్ ఎనర్జెటిక్.. పూర్తి కామెడీ యాక్షన్‌తో నిండిపోయింది. కార్తీ మార్క్ పక్కాగా కనిపిస్తోంది. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సంతోష్ నారాయణ్.. ఇంతకముందు పా.రంజిత్ దర్శకత్వంలో వచ్చిన కార్తీ నటించిన మద్రాస్ చిత్రానికి మంచి సంగీతం అందించారు. ఆ తర్వాత కార్తీ మరొక సినిమా కాష్మోరాకు కూడా మ్యూజిక్ అందించారు. ఆ రెండు చిత్రాలు సంగీతం బాగుండటంతో ఇప్పుడు ఈ ‘అన్నగారు వస్తారు’తో మూడవ చిత్రంలో టీజర్‌కు కూడా బాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. ఇలా వీరిద్దరిది సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు.
కార్తీ 29వ సినిమా..
దీని తర్వాత డైరెక్టర్ తమిళ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్లో కార్తీ తన 29వ సినిమా “మార్షల్” చేస్తున్నారు. జూలైలో షూటింగ్ ప్రారంభం అయింది. కళ్యాణి ప్రియదర్శి హీరోయిన్గా, సత్యరాజ్ కీలక పాత్ర చేస్తున్నారు. ఇది ఒక పొలిటికల్ థ్రిల్లర్ మరియు యాక్షన్ మూవీగా తెరకేక్కనుంది.
సర్దార్, ఖైదీ ఈ రెండు కూడా కార్తీ కెరియర్లో మంచి హిట్ టాక్ తెచ్చుకున్నాయి. దాంతో ఇప్పుడు వీటికి సీక్వెల్స్ సిద్ధమవుతున్నాయి. సర్దార్-2 షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల దశలో ఉన్నది. ఇది కూడా డిసెంబర్ నెలలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రజిష విజయన్, మాళవిక మోహన్,ఎస్. జె. సూర్య, యోగి బాబు ప్రధాన పాత్రలు చేస్తున్నారు. పి.ఎస్. మిథ్రాన్ దర్శకత్వంలో ప్రిన్స్ పిక్చర్స్ మరియు ఐవీవై ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై లక్ష్మణ్ కుమార్, ఈసాన్ సక్సెనా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఖైదీ-2 సినిమా..
ఇక ఖైదీ-2 సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. ఈ సినిమా దర్శకుడు లోకేష్ కనగరాజ్ వేరే సినిమాల్లో బిజీగా ఉండటం కారణంగా ఈ చిత్రం ఆలస్యం అవుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ సినిమాకు డ్రీమ్ వారియర్ పథాకం ఎస్.ఆర్. ప్రభు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అర్జున్ దాస్, బేబీ మోనికా, నరైన్, హరీష్ ఉత్తమన్ తదితరులు నటిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్, రిలీజ్ విషయాలు ఇంకా ఖరారు కాలేదు. 2026లో ఉండచ్చు అని అంచనా. ఈ విధంగా కార్తీ వరుసగా షూటింగ్స్, రిలీజ్‌లతో బిజీగా ఉన్నారు.
డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు. ప్రముఖ విశ్వ విద్యాలయం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో MA తెలుగు చేశారు. తాజా సినిమా, పాలిటిక్స్, నేషనల్, స్పోర్ట్స్‌కు సంబంధించిన వార్తలతో పాటు ప్రత్యేకమైన కథనాలు రాస్తారు. డిజిటల్ కంటెంట్ రైటర్‌గా సంవత్సరం అనుభవం కలిగి ఉన్నారు. ఈయనకు పాటలు, కవితలు, షార్ట్ ఫిలిమ్స్ వంటివాటికి మాటలు రాసే అలవాటు ఉంది. సహజంగా జానపద, సినిమా పాటలు గాయకుడు.