భారతదేశంలో నివసించే.. భారతీయ పౌరులకు ఆధార్ కార్డు దాదాపు అన్నింటికీ ఆధారం. ప్రభుత్వ పథకాలను పొందటానికి, బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ ఓపెన్ చేయడానికి, డ్రైవింగ్ లైసెన్స్ మొదలైవని పొందటానికి కూడా ఇది చాలా అవసరం. ఆలాంటి ఆధార్ కార్డును.. తప్పకుండా పాన్ కార్డుతో లింక్ చేయాలి. ఈ విషయాన్ని ప్రభుత్వం కొన్నాళ్ల నుంచి చెబుతూనే ఉంది. కొందరు ఆధార్ & పాన్ లింక్ చేసుకున్నప్పటికీ.. మరికొందరు ఈ విషయాన్ని విస్మరించారు. అలాంటి వారికోసం కేంద్రం మరో గడువును ఇచ్చింది.
ఆదమరిస్తే ఇనాక్టివ్!
పాన్ కార్డు & ఆధార్ కార్డు చాలా ముఖ్యమైన డాక్యుమెంట్స్. ఈ రెండూ లేకపోతే చాలా ఆర్ధిక సంబంధిత విషయాలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ రెండింటిని లింక్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని ఆదమరిస్తే.. పాన్ కార్డులు నిష్క్రియం (ఇనాక్టివ్) అయ్యే అవకాశం ఉంది. కాబట్టి గడువు (2025 డిసెంబర్ 31) లోపల లింక్ చేసుకోవాలి.
ఆధార్ & పాన్ కార్డులను లింక్ చేయడానికి ప్రత్యేకించి మీసేవ, లేదా ఇతర కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కొంత అవగాహనా ఉంటే.. ఎవరైనా ఆన్లైన్లోనే పూర్తి చేసుకోవచ్చు. దీనికోసం కింద చెప్పిన విధానం అనుసరించాల్సి ఉంటుంది.
- ముందు మీరు ఆదాయ పన్ను శాఖ (ఇన్కమ్ ట్యాక్స్) అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
- అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసిన తరువాత స్క్రీన్ మీద.. కుడివైపున క్విక్ లింక్స్ అనే ఎంపిక కనిపిస్తుంది. అందులో మీరు కిందకు వెళ్తే.. లింక్ ఆధార్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
- లింక్ ఆధార్ ఎంపికను ఓపెన్ చేసిన తరువాత.. అక్కడ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి.. వ్యాలిడేట్ మీద క్లిక్ చేయాలి.
- ఇలా చేసిన తరువాత రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబెరుకు ఓటీపీ వస్తుంది. దీనిని ధృవీకరించాలి.
- ధృవీకరణ పూర్తయిన తరువాత.. లింక్ ఆధార్ స్టేటస్ ఎంపికలో.. స్టేటస్ చెక్ చేసుకోవాలి.
- ఇప్పటికే మీ పాన్ కార్డు ఇనాక్టివ్ అయి ఉంటే.. చిన్న మొత్తంలో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
- ఈ విధానం చాలా సులభంగా ఉంటుంది. కాబట్టి ఎవరూ ఆలస్యం చేయకుండా లింక్ చేసుకోవడం ఉత్తమం.
పాన్ & ఆధార్ లింక్ చేయకపోతే..
- ప్రభుత్వం నిర్దేశించిన విధానం ప్రకారం.. మీ పాన్ కార్డును, ఆధార్ కార్డుతో ఈ నెల చివరి నాటికి (2025 డిసెంబర్ 31 లోపల) లింక్ చేయకపోతే.. ఇన్కమ్ ట్యాక్స్ రితుర్న్ దాఖలు చేయలేరు & ధృవీకరించబడదు కూడా.
- రిటర్న్ కూడా నిలిచిపోతాయి. పెండింగ్ రిటర్న్స్ ప్రాసెస్ కూడా ఆగిపోతుంది.
- టీడీఎస్/టీసీఎస్ క్రెడిట్ వంటివి కూడా ఫారమ్ 6ఏఎస్’లో కనిపించవు. అంతే కాకుండా దీనికి వర్తించే వడ్డీ రేటు కూడా తగ్గే అవకాశం ఉంటుంది.
- బ్యాంకింగ్, ఫైనాన్స్ పనులు (బ్యాంక్ అకౌంట్ కేవైసీ అప్డేట్ కాదు, డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ కాదు, ఈపీఎఫ్ విత్‌డ్రా జరగదు) ఆగిపోతాయి.
పాన్ & ఆధార్ లింక్ ఎందుకు తప్పనిసరి?
- ఇప్పుడు మనం టెక్నాలజీ యుగంలో ఉన్నాం. ఈ డిజిటలైజేషన్ యుగంలో మీ ఆధార్ & పాన్ లింకింగ్ అనేది చాలా కీలకం.
- ఆధార్ & పాన్ కార్డు లింక్ చేయకాపోతే.. చాలా ఆర్థికపరమైన సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
- పన్ను దాఖలకు సంబంధించిన జవాబుదారీ తనాన్ని ప్రోత్సహించడానికి ఆధార్, పాన్ లింక్ తప్పనిసరి.
- ముఖ్యంగా ఆదాయ పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడానికి.. ఆధార్ & పాన్ లింకింగ్ చాలా అవసరం.
లాస్ట్ డేట్ ఎప్పుడంటే?
భారత ప్రభుత్వం.. ఆధార్, పాన్ లింక్ చేయడానికి గడువును చాలా సార్లు పెంచింది. ఇప్పుడు మరోసారి గడువును 2025 డిసెంబర్ 31 వరకు పెంచింది. బహుశా ఈ డేట్ తరువాత మరోమారు గడువును పెంచుతుందా?, లేదా? అనే విషయం ప్రస్తుతానికి తెలియదు. బహుశా ఇప్పటికే చాలాసార్లు గడువు పొడిగించింది కాబట్టి.. డిసెంబర్ తరువాత పొడిగించే అవకాశం లేదనిపిస్తోంది. కాబట్టి గడువు లోపల పాన్ & ఆధార్ లింక్ చేయకపోతే.. 2026 జనవరి నుంచి మీ పాన్ కార్డు ఇనాక్టివ్ అవుతుంది. ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి.
ఉమశ్రీ చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ట్రెండింగ్ అంశాలు, వివిధ విభాగాలపై ప్రత్యేక కథనాలను రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, సైన్స్ & టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, పాలిటిక్స్ తదితర రంగాలకు సంబంధించిన విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో ఆయనకు 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.