Tuesday, January 27, 2026

కేవలం నలుగురిని మాత్రమే కొని.. 21 మందిని రిటైన్ చేసుకున్న టీమ్ ఇదే

2026 వేసవి రోజులు కంటే ముందే ఐపీల్ హీట్ మొదలయింది. 2025 నవంబర్ 15న రిటైన్, ట్రేడ్‌ల దగ్గర నుంచే ఐపీల్ క్రికెట్ వాతావరణం ప్రారంభం అయిందని చెప్పొచ్చు. ఇక్కడ వారి.. వారి అభిమాన ఆటగాళ్ల కోసం టీమ్స్ కోసం ఎంతగానో ఎదురుచూసే వారుంటారు. ఏ ప్లేయర్ ఏ టీమ్‌కు వెళతాడు, ఎవరు ఉంటారు.. అనే విషయంపై ఫ్యాన్స్ ఎంతో ఆసక్తికరంగా ఉన్నారు. ఎక్కువ శాతం టీమ్‌లు అన్నీ తమ ఆటగాళ్లను నిలుపుకోవడానికే మొగ్గు చూపాయి. పంజాబ్ కింగ్స్ ఐపీల్ ప్రాంచైజీ ఏకంగా 21 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకునింది. కానీ కేవలం నలుగురు ఆటగాళ్ల కోసం పంజాబ్ మినీ వేళానికి వెళ్ళింది.

పంజాబ్ జట్టు రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు

శ్రేయస్ అయ్యర్ (రూ. 26 కోట్ల 75 లక్షలు), అర్షదీప్ సింగ్ (రూ. 18 కోట్లు), యుజ్వేంద్ర చాహల్ (రూ.18 కోట్లు), మార్కస్ స్టోయినిస్ (రూ.11 కోట్లు), మార్కో జాన్సన్ (రూ.7 కోట్లు) శశాంక్ సింగ్ (రూ.5 కోట్ల 50 లక్షలు), నేహాల్ వదేరా (రూ.4 కోట్ల 20 లక్షలు) ప్రభుసిమ్రాన్ సింగ్ (రూ.4 కోట్లు), ప్రియాన్స్ ఆర్య (రూ.3 కోట్ల 80 లక్షలు),  మిచెల్ ఓవెన్ (రూ.3 కోట్లు), ఏ ఓమర్జాయ్ (రూ.2 కోట్ల 40 లక్షలు), లాకి ఫెర్గుసన్ (రూ.2 కోట్లు), విజయ్ కుమార్ వైశాక్ (రూ.1 కోటి 80 లక్షలు), యష్ ఠాకూర్ (రూ.1 కోటి 60 లక్షలు), హర్ప్రీత్ బ్రార్ (రూ.1 కోటి 50 లక్షలు), విష్ణు వినోద్ (రూ.95 లక్షలు), జెవియర్ బార్ట్లెట్ (రూ.80 లక్షలు), సూర్యాంశ్ షెడ్జే (రూ.30 లక్షలు), పైలా అవినాష్ (రూ.30 లక్షలు), ముషీర్ ఖాన్ (రూ.30 లక్షలు), హర్నూర్ సింగ్ (రూ.30 లక్షలు).

కొత్తగా కొనుగోలు చేసిన నలుగురు ఆటగాళ్లు

బెన్ ద్వార్షుయిస్ (రూ. 4 కోట్ల 40 లక్షలు), కూపర్ కొన్నోలి (రూ.3 కోట్లు), విశాల్ నిషాద్ (రూ.30 లక్షలు), ప్రవీణ్ దూబే (రూ.30 లక్షలు). కేవలం నలుగురే నలుగురు ఆటగాళ్లను మాత్రమే మినీ వేళంలో కొనుగోలు చేసింది. అందులో ఇద్దరు ఫారినర్స్ కాగా.. మరో ఇద్దరు ఇండియన్ ఆటగాళ్లు ఉన్నారు. రూ.11 కోట్ల 50 లక్షల రూపాయల డబ్బులతో వేలంలోకి వచ్చిన పంజాబ్.. రూ.8 కోట్లు ఖర్చు చేసి 3 కోట్ల 50 లక్షల రూపాయలు పర్సులో నిలుపుకుంది.

విదేశీ ఆటగాళ్లు

ఎనిమిది మంది ఫారిన్ ప్లేయర్లను తీసుకోవడానికి ప్రతి జట్టుకు అవకాశం ఉండటం వలన పంజాబ్ కూడా ఎనిమిది మందిని కొనుగోలు చేసింది. వారు ”మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సన్, మిచెల్ ఓవెన్, ఎ. ఒమెర్జాయ్, లాకి ఫెర్గూసన్, జెవియర్ బార్లెట్, బెన్ ద్వార్షుయిస్, కూపర్ కొన్నోలి. వీళ్లందరి కోసం 33 కోట్ల 60 లక్షల రూపాయల అతి తక్కువ మొత్తాన్ని ఖర్చు చేసింది. అంటే అమౌంట్ అంతటిలో కేవలం 26 శాతం మాత్రమే విదేశీ ఆటగాళ్ళ కోసం వెచ్చించింది.

స్వదేశీ ఆటగాళ్ల కోసమే ఎక్కువ మొత్తాన్ని పంజాబ్ తన పర్సును ఖర్చు పెట్టింది.. ఏకంగా 76 కోట్ల 40 లక్షల రూపాయలు. శ్రేయస్ అయ్యర్ కోసం రూ. 26 కోట్ల 75 లక్షలు, అర్షదీప్ సింగ్ కోసం రూ. 18 కోట్లు, యుజవేంద్ర చాహల్ కోసం రూ. 18 కోట్లు ఈ ముగ్గురకే 62 కోట్లు పెట్టడం గమనార్హం.

అందుకే 21మంది రిటైన్

పంజాబ్ కింగ్స్ జట్టు గత సీజన్లో ఫైనల్ వరకు వెళ్లి, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు చేతిలో పరాజయం పాలయింది. శ్రేయస్ అయ్యర్ ఈ టీమ్ కెప్టెన్ కావడం వల్లనే ఫైనల్ చేరుకోవడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. బ్యాటింగ్, బోలింగ్ రెండు విభాగాల్లోను అత్యంత అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. దీంతో ఆట రసవత్తరంగా సాగించింది. అయితే జట్టుకు ఇప్పటి వరకు ఫైనల్లో గెలిచిన చరిత్ర లేదు. 2008 నుంచి ఇప్పటిదాక కేవలం 2014లో ఒకసారి, 2025లో ఒకసారి కలిపి రెండు సార్లు మాత్రమే ఫైనల్స్ వరకు వెళ్లారు. లాస్ట్ ఇయర్ కప్ గెలవడానికి చాలా ప్రయత్నించినప్పటికీ.. అది సాధ్యం కాలేదు. దాదాపు పది సంవత్సరాల తరువాత టీమ్‌కు ఫైనల్ చేర్చడంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో పాటు మిగిలిన ఆటగాళ్ల పాత్ర కూడా ఉంది. అందుకనే 21 మందిని పంజాబ్ ఓనర్స్ రిటైన్ చేసుకున్నారు. ఈసారి ఎలాగైనా కప్ గెలవాలనే కసితో ఉన్నారు. మరి ఎటువంటి ప్రదర్శన చేస్తారానేది చూడాల్సి ఉంది.

Giribabu
Giribabu
డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు. ప్రముఖ విశ్వ విద్యాలయం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో MA తెలుగు చేశారు. తాజా సినిమా, పాలిటిక్స్, నేషనల్, స్పోర్ట్స్‌కు సంబంధించిన వార్తలతో పాటు ప్రత్యేకమైన కథనాలు రాస్తారు. డిజిటల్ కంటెంట్ రైటర్‌గా సంవత్సరం అనుభవం కలిగి ఉన్నారు. ఈయనకు పాటలు, కవితలు, షార్ట్ ఫిలిమ్స్ వంటివాటికి మాటలు రాసే అలవాటు ఉంది. సహజంగా జానపద, సినిమా పాటలు గాయకుడు.

Related Articles