Tuesday, January 27, 2026

2026 జనవరి నెల పెన్షన్ తేదీలో మార్పు: గమనించారా?

కొన్ని రోజుల్లో 2025 ముగుస్తుంది. 2026 వచ్చేస్తోంది. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ అందించే విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇది పెన్షన్ తీసుకునే అందరికి ఓ మంచి శుభవార్త అనే చెప్పాలి. ఎందుకంటే ఒకరోజు ముందుగానే లబ్దిదారులకు పెన్షన్ అందుతుంది.

డిసెంబర్ 31వ తేదీ పెన్షన్

ఏపీ గవర్నమెంట్ 2026 ఏడాది జనవరి 1వ తేదీకంటే ముందు.. అంటే 2025 డిసెంబర్ 31న పెన్షన్ అందించడానికి సిద్ధమైంది. కాబట్టి ఆ రోజు రాష్ట్రంలోని దాదాపు 90 శాతం మంది లబ్దిదారులకు పెన్షన్ అందించనుంది. పెన్షన్ అందించే కార్యక్రమం డిసెంబర్ 31న ఉదయం 7 గంటల నుంచే ప్రారంభమవుతుందని చెబుతున్నారు. ఒకవేల కొన్ని అనివార్య కారణాల వల్ల (టెక్నికల్ సమస్యలు, బయోమెట్రిక్ ఇష్యూ, సర్వర్ ప్రాబ్లమ్ మొదలైనవి).. పెండింగ్ పడితే, జనవరి 2వ తేదీన పెన్షన్ అందిస్తారు.

ఇంటివద్దకే పెన్షన్

డిసెంబర్ 31వ తేదీన సంబంధిత అధికారులు (గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది).. లబ్ధిద్దరులకు పెన్షన్ తమ ఇంటి వద్దనే అందిస్తారు. కాబట్టి వృద్దులు, దివ్యంగులు పెన్షన్ తీసుకోవడానికి ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం నిర్దేశించిన రోజు వృద్ధాప్య పెన్షన్ మాత్రమే కాకుండా.. దివ్యంగుల పెన్షన్, వితంతు పెన్షన్, చేనేత, మత్స్యకార పెన్షన్, ఇతర పెన్షన్లను అందిస్తారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడంలో భాగంగా.. పెన్షన్ పెంచడం జరిగింది. ప్రస్తుతం వృద్దులకు, వితంతువులకు, ట్రాన్స్‌జెండర్లకు, మత్స్యకారులు మొదలైనవారికి నెలకు రూ. 4000 పెన్షన్ అందిస్తున్నారు. కాగా దివ్యంగులకు లేదా కొంతమంది వ్యాధిగ్రస్తులకు నెలకు రూ. 6000 పెన్షన్ అందిస్తున్నారు.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత.. చెప్పినట్లుగానే చాలావరకు పథకాలను, హామీలను నెరవేర్చారు. కేంద్ర ప్రభుత్వం సైతం రాష్ట్రాభివృద్ధికి దోహదపడుతోంది. ఓ వైపు రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు ముఖ్యమంత్రిగా పాలన సాగిస్తుంటే.. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ కూడా ప్రజలకు సేవ చేయడంలో బిజీ అయ్యారు. మరోవైపు ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్.. విద్యకు సంబంధించిన, పిల్లల భవిష్యత్తులు బాటలు వేస్తూనే, రాష్ట్రంలో కంపెనీలు నెలకొల్పడానికి కావలసిన ప్రయత్నాలు చేస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం మీదున్న నమ్మకం.. లేదా తమ కంపెనీలను విస్తరించాలనే ఉద్దేశ్యంతో గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు సైతం రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమయ్యాయి. ఓ వైపు ప్రజలకు సేవ చేస్తూనే.. మరోవైపు రాష్ట్రంలోని యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడానికి కూడా కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.

కూటమి ప్రభుత్వంపై విమర్శలు

ఏ ప్రభుత్వమైనా పాలన సాగిస్తున్నప్పుడు.. ఒకింత విమర్శ సర్వ సాధారణమే. ఇప్పుడు అదే జరుగుతోంది రాష్ట్రంలో. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పాలనలో ఉన్నప్పుడు.. చంద్రబాబు ప్రభుత్వం విమర్శించడం.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ విమర్శించడం మామూలే. ఈ విమర్శలు కూడా రాష్ట్రాభివృద్ధికి దోహదపడతాయి. అధికారంలో ఉన్న ప్రభుత్వం తప్పు చేస్తే.. ప్రత్యర్థులు దాన్ని గట్టిగా ప్రశ్నించడం వల్లనే, ప్రగతి సాధ్యమవుతుంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. ప్రజా శ్రేయస్సు, రాష్ట్రాభివృద్ధి ముఖ్యం. ఇది ఏ రాజకీయ నాయకుడైన తప్పకుండా గుర్తుంచుకోవాలి.

Uma Siri
Uma Sirihttps://marthatelugu.com/
ఉమశ్రీ చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ట్రెండింగ్ అంశాలు, వివిధ విభాగాలపై ప్రత్యేక కథనాలను రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, సైన్స్ & టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, పాలిటిక్స్ తదితర రంగాలకు సంబంధించిన విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో ఆయనకు 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.

Related Articles