చెన్నై సూపర్ కింగ్స్ ఐపీల్ చరిత్రలో ఐదు సార్లు (2010, 2011, 2018, 2021, 2023) ఛాంపియన్‌గా నిలిచింది. సుమారు పదిసార్లు ఫైనల్స్ ఆడింది. అంత గొప్ప హిస్టరీ కలిగిన, స్థిరత్వం ఉన్న జట్టు సీఎస్‌కే. దాదాపు పదిహేడు సంవత్సరాల కాలం అవుతున్న ఐపీల్ క్రికెట్‌లో పన్నెండు సార్లు ప్లేఆఫ్స్‌కు వెళ్ళింది. ఎంఎస్. ధోనీ.. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు చెన్నైతోనే ఉన్నాడు. కామ్ అండ్ కూల్ కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్న ఈయన ఉండటం వల్లనే ఆ జట్టుకు ఇన్ని విజయాలు సాధ్యం అయ్యాయి.
ఐపీఎల్‌లో మంచి పేరు ఉన్న సీఎస్‌కే గత కొంతకాలంగా ఎక్కడో పట్టుతప్పినట్టుగా అనిపిస్తోంది. అందుకే పోయిన ఏడాది ప్లేఆఫ్స్‌కు వెళ్లకపోవడం గురించి పక్కన పెడితే 14 మ్యాచ్‌లో కేవలం.. నాలుగు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున పడిపోయింది. దానిని ఎలాగైన అధిగమించితీరాలనే ధ్యేయంతో మంచి టీమ్‌ను సిద్ధం చేసుకుంది.
చెన్నై సూపర్ కింగ్స్ 2026 జట్టు
రుతురాజ్ గైక్వాడ్ (రూ.18 కోట్లు), సంజూ శాంసన్ (రూ.18 కోట్లు), శివమ్ దూబే (రూ.12 కోట్లు), నూర్ అహ్మద్ (రూ.10 కోట్లు), ఖలీల్ అహమద్ (రూ.4 కోట్ల 80 లక్షలు), ఎంఎస్. ధోనీ (రూ.4 కోట్లు), అన్సుల్ కాంబోజ్ (రూ.3 కోట్ల 40 లక్షలు), గుర్జపనీత్ సింగ్ (రూ.2 కోట్ల 20 లక్షలు), డెవాల్డ్ బ్రెవిస్ (రూ.2 కోట్ల 20 లక్షలు), నాథన్ ఎల్లిస్ (రూ.2 కోట్లు), జామీ ఓవర్టన్ (రూ.1 కోటి 50 లక్షలు), ఆయుష్ మాత్రే (రూ.30 లక్షలు), రామకృష్ణ గోష్ (రూ.30 లక్షలు), ఉర్విల్ పటేల్ (రూ.30 లక్షలు), ముకేశ్ చౌదరి (రూ.30 లక్షలు), శ్రేయస్ గోపాల్ (రూ.30 లక్షలు), కార్తీక్ శర్మ (రూ.14 కోట్ల 20 లక్షలు), ప్రశాంత్ వీర్ (రూ.14 కోట్ల 20 లక్షలు), రాహుల్ చాహర్ (రూ.5 కోట్ల 20 లక్షలు), అకీల్ హోసేన్ (రూ.2 కోట్లు), మాట్ హేన్రి (రూ.2 కోట్లు), మాత్యు షార్ట్ (రూ.1 కోటి 50 లక్షలు), జాక్ పౌల్క్స్ (రూ.75 లక్షలు), సర్పరాజ్ ఖాన్ (రూ.75 లక్షలు), అమాన్ ఖాన్ (రూ.40 లక్షలు).
కొత్తగా టీంలోకి వచ్చిన ప్లేయర్స్
కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్, రాహుల్ చాహర్, అకీల్ హోసేన్, మాట్ హేన్రి, మాత్యు షార్ట్, జాక్ పౌల్క్స్, సర్పరాజ్ ఖాన్, అమాన్ ఖాన్
బ్యాటర్స్
- రుతురాజ్ గైక్వాడ్
- ఆయుష్ మాత్రే
- డివాల్డ్ బ్రెవిస్
- సర్ఫరాజ్ ఖాన్
కీపర్స్
- ఎంఎస్. ధోనీ
- సంజూ శాంసన్
- ఉర్విల్ పటేల్
- కార్తీక్ శర్మ
ఆల్ రౌండర్స్
- అన్షుల్ కాంబోజ్
- జామీ ఓవర్టన్
- రామకృష్ణ గోష్
- ప్రశాంత్ వీర్
- శివమ్ దూబే
- అమాన్ ఖాన్
- మాత్యు షార్ట్
- జాక్ ఫౌల్క్స్
బౌలర్స్
- ఖలీల్ అహ్మద్
- నూర్ అహమద్
- ముకేశ్ చౌదరి
- నాథన్ ఎల్లిస్
- శ్రేయస్ గోపాల్
- గుర్జపణీత్ సింగ్
- అకేల్ హోసేన్
- మాట్ హెన్రి
- రాహుల్ చాహర్
చెన్నై సూపర్ కింగ్స్.. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కూడా మంచి ప్లేయర్స్ ఉండేలా ప్రణాళిక రచించింది. అందుకోసం వీలైనంత మందిని వేలంలోకి వదిలి కొత్త వాళ్లను తీసుకుంది. ట్రేడ్ ద్వారా సంజూ శాంసన్ లాంటి గొప్ప ఆటగాడిని తెచ్చుకుంది. ఈ సీజన్ తరువాత ధోనీ రిటైర్ అవుతాడు అనే ప్రచారం జరుగుతున్న వేళ అతనికి జట్టు విజయంతో వీడ్కోలు పలకాల్సి ఉంటుంది. అలాగే చెయ్యాలి అని కూడా సిఎస్కే అభిమానుల్లోనే మాత్రమే కాకుండా.. అందరిలోనూ ఉంటుంది. మరి ఇప్పుడు ఎంఎస్. ధోనికి విజయంతో ఆనందగా పంపిస్తారా? లేక ఓటమితో బాధగా మైదానాన్ని వీడనిస్తారా? అనేది వచ్చే రెండు మూడు నెలల్లో తెలిపోనుంది.
డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు. ప్రముఖ విశ్వ విద్యాలయం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో MA తెలుగు చేశారు. తాజా సినిమా, పాలిటిక్స్, నేషనల్, స్పోర్ట్స్‌కు సంబంధించిన వార్తలతో పాటు ప్రత్యేకమైన కథనాలు రాస్తారు. డిజిటల్ కంటెంట్ రైటర్‌గా సంవత్సరం అనుభవం కలిగి ఉన్నారు. ఈయనకు పాటలు, కవితలు, షార్ట్ ఫిలిమ్స్ వంటివాటికి మాటలు రాసే అలవాటు ఉంది. సహజంగా జానపద, సినిమా పాటలు గాయకుడు.






