గ్యాస్ సిలిండర్ కొనేవారికి శుభవార్త!: 2026 జనవరి నుంచి..

నిత్యావసరాల ధరలు తగ్గినప్పుడే మధ్యతరగతి, పేదవారికి కొంత ఉపశమనం కలుగుతుంది. చాలా సందర్భాల్లో రేట్లు పెరగడం తప్పా.. తగ్గే దాఖలాలు చాలా తక్కువగా కనిపిస్తాయి. అయితే ఇప్పుడు ఎల్‌పీజీ సిలిండర్ తగ్గే అవకాశం ఉన్నట్లు కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులోని నిజానిజాలను గురించి వివరంగా తెలుసుకుందాం. కొత్త ఏడాది శుభారంభం! ఇంధన ధరలు ప్రజల జీవన ఖర్చులపై గణనీయమైన ప్రభావం చూపిస్తాయి. కానీ ఇందులో రాజీపడటానికి అవకాశం లేదు. ఎందుకంటే అవి నిత్యావసరం.. అత్యవసరం కూడాను. అయితే […]

నిత్యావసరాల ధరలు తగ్గినప్పుడే మధ్యతరగతి, పేదవారికి కొంత ఉపశమనం కలుగుతుంది. చాలా సందర్భాల్లో రేట్లు పెరగడం తప్పా.. తగ్గే దాఖలాలు చాలా తక్కువగా కనిపిస్తాయి. అయితే ఇప్పుడు ఎల్‌పీజీ సిలిండర్ తగ్గే అవకాశం ఉన్నట్లు కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులోని నిజానిజాలను గురించి వివరంగా తెలుసుకుందాం.

కొత్త ఏడాది శుభారంభం!

ఇంధన ధరలు ప్రజల జీవన ఖర్చులపై గణనీయమైన ప్రభావం చూపిస్తాయి. కానీ ఇందులో రాజీపడటానికి అవకాశం లేదు. ఎందుకంటే అవి నిత్యావసరం.. అత్యవసరం కూడాను. అయితే 2025 చివరలో గ్లోబల్ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినట్లు.. పలు నివేదికలు వెల్లడించాయి. ఇదే జరిగితే.. 2026 సంవత్సరం శుభారంభం పలికినట్లే అవుతుంది.

పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు (పీఎన్‌జీఆర్‌బీ).. కొత్త టారిఫ్ నియమాలు 2026 జనవరి 1నుంచే సీఎన్జీ, డొమెస్టిక్ పీఎన్జీ ధరలు రూ. 2 నుంచి రూ. 3 వరకు (ఒక యూనిట్‌కు) తగ్గే అవకాశం ఉంది. ఇది కేవలం వాహనదారులకు, గ్యాస్ సిలిండర్ ఉపయోగించే కుటుంబాలకు ఊరటనిస్తుంది. కాగా.. డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలు మాత్రం 2025 ఏప్రిల్ నుంచి దాదాపు స్థిరంగానే ఉంటున్నాయి. రాబోయే రోజుల్లో వీటి ధరలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరల తగ్గుదల.. ఆహార పదార్థాలు ధరలపై కూడా కొంత ప్రభావం చూపించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

ధరలు తగ్గే అవకాశం!

2021లో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గాయి. కాగా వచ్చే ఏడాది (2026) ఈ ధరలు.. అంతలా తగ్గే అవకాశం ఉంది. దీంతో రేట్లు తగ్గుతాయి. 2025 డిసెంబర్ నెలలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు దేశంలోని చాలా నగరాల్లో రూ. 900 కంటే తక్కువే ఉన్నాయి. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రం.. వివిధ స్థానిక పన్నుల కారణంగా రూ. 900 నుంచి రూ. 950 మధ్యలో ఉన్నాయి.

తగ్గిన క్రూడ్ ఆయిల్ ధరలు!

2025 డిసెంబర్ నెలలో క్రూడ్ ఆయిల్ ధరలు 19.52 శాతం తగ్గాయి. దీనికి కారణం వివిధ దేశాల్లో సరఫరా పెరగడం, డిమాండ్ మందగించడం. అంతే కాకుండా రష్యా – ఉక్రెయిన్ శాంతి చర్చలు కూడా దీనికి దోహదపడ్డాయని తెలుస్తోంది. క్రూడ్ రిఫైనింగ్ ప్రాసెస్ నుంచి ఎల్‌పీజీ, సీఎన్జీ, పీఎన్జీ ఉత్పత్తి అవుతాయి. క్రూడ్ ఆయిల్ ధరలే తగ్గినప్పుడు.. అందులో నుంచి ఉత్పత్తి అయ్యే ఉత్పత్తుల ధరలు కూడా తగ్గుతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన ప్రయోజనం కూడా

సామాన్యులపై నిత్యావసర ధరల భారం తగ్గించడానికి ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) పథకం కూడా సహాయపడుతోంది. ఈ పథకం కింద.. 9 సిలిండర్లకు.. ఒక్కో సిలిండర్ కొనుగోలుపై 300 రూపాయల సబ్సిడీ లభిస్తుంది. 2016లో మొదలైన ఈ స్కీమ్ ద్వారా.. 10 కోట్ల మంది ప్రయోజనం పొందారు. సబ్సిడీ డబ్బు.. నేరుగా ఖాతాదారుడి బ్యాంక్ అకౌంట్లో యాడ్ అవుతుంది. ఇది మాత్రమే కాకుండా.. ప్రభుత్వం మరిన్ని సబ్సిడీలను అందించడానికి యోచిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Uma Siri
Uma Sirihttps://marthatelugu.com/
ఉమశ్రీ - నేను MarthaTelugu వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు ఆటోమొబైల్, లైఫ్ స్టైల్ విభాగాల్లో అత్యంత ప్రావీణ్యం కలిగి ఉంది. ఈ విభాగాల్లో యూజర్లకు అవసరమైన అన్ని వార్తలను సమగ్రంగా అందిస్తాను. నాకు జర్నలిజం రంగంలో 8 సంవత్సరాల అనుభవం ఉంది.

Related Articles

Latest Articles