బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 ఫేమ్ శుభశ్రీ రాయగురు గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. నటిగా చాలామంది అభిమానులను ఆకట్టుకున్న ఈ అమ్మడికి.. ఈ ఏడాది (2025) జూన్ నెలలో నటుడు, ప్రొడ్యూసర్ అయిన అజయ్ మైసూర్‌తో నిశ్చితార్థం జరిగింది. అయితే వీరి పెళ్లికి సంబంధించిన విషయాలు మాత్రం అధికారికంగా వెల్లడి కాలేదు. అయితే చాలా సందర్భాల్లో జంటగా కనిపించారు. ఇప్పుడు కూడా ఈ లవ్ బర్డ్స్ ఖరీదైన కారును సైతం కొనుగోలు చేశారు.
పెళ్ళికి ముందే స్పెషల్ ఎడిషన్ కారు
శుభశ్రీ & అజయ్ కొనుగోలు చేసిన కారు.. మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన ఏఎంజీ 45ఎస్ స్పెషల్ ఎడిషన్ మోడల్. దీనిని వారు ఆస్ట్రేలియాలో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఆ దేశం మొత్తం మీద ఇలాంటి మోడల్ కేవలం 20 మాత్రమే ఉన్నాయి. దీని ధర రూ. కోటి కంటే ఎక్కువే. కొత్త కారు కొనుగోలు చేసిన సందర్భంగా.. శుభశ్రీ & అజయ్ ఇద్దరూ కారు పక్కన నిలబడి ఫోటోలకు ఫోజులిచ్చారు. వీటిని ఆ ఇరువురూ తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. దీంతో అభిమానులు వారికి శుభాకాంక్షలు చెబుతున్నారు.
కొత్త కలర్స్ కొనండి!
కారు కొన్న సందర్భంగా.. చివరికి ఆస్ట్రేలియాలోని కేవలం 20 కార్లలో ఒకటైన మెర్సిడెస్ బెంజ్ ఏఎంజీ 45ఎస్ స్పెషల్ ఎడిషన్ కొనేశాము. కలర్‌ఫుల్ కార్లను కొనుగోలు చేయడం మొదలుపెట్టండి. బ్లాక్, వైట్ కలర్ కార్లు చాలా బోరింగ్ అని పోస్ట్ చేశారు. అయితే వీరు ఆకుపచ్చ రంగు కారును కొనుగోలు చేశారు. కాగా అజయ్ గ్యారేజిలో ఇప్పటికే పలు అన్యదేశ్య ఖరీదైన కార్లు సుమారు 20 కంటే ఎక్కువ ఉన్నాయని సమాచారం.
వైట్ & బ్లాక్ కార్లనే ఎందుకు ఎక్కువ కొంటారంటే?
నిజానికి శుభశ్రీ & అజయ్ చెప్పినట్లు.. చాలామంది వైట్ లేదా బ్లాక్ కార్లను మాత్రమే కొనుగోలు చేస్తుంటారు. దీనికి కారణాలు కూడా చాలానే ఉన్నాయి. తెలుపు రంగు కారు తక్కువ వేడిని గ్రహిస్తుంది. సమశీతోష్ణ పరిస్థితులున్న భారతదేశంలో ఇది చాలా ఉత్తమమైన కలర్ ఆప్షన్. అయితే బ్లాక్ కలర్ లగ్జరీ అండ్ ప్రీమియం లుక్ ఇస్తుంది. ఇలాంటి కారణాల వల్లనే చాలామంది ప్రత్యేకంగా ఈ రంగు కార్లను ఎంచుకుంటారు.
మెర్సిడెస్ బెంజ్ ఏఎంజీ 45ఎస్
బెంజ్ కంపెనీకి చెందిన ఏఎంజీ 45ఎస్ మోడల్.. ఒక స్పెషల్ ఎడిషన్ కారు. దీని ధర ప్రారంభ ధర రూ. 92 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది స్పెషల్ డిజైన్, గ్రాఫిక్స్ అప్డేట్స్ పొందుతుంది. ఇందులోని 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 421 బీహెచ్పీ పవర్, 500 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 3.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అయ్యే ఈ కారు.. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన 4 సిలిండర్ ప్రొడక్షన్ కారుగా ప్రసిద్ధి చెందింది.
డ్యూయెల్ స్క్రీన్ సిస్టం, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, అత్యాధునిక సేఫ్టీ ఫీచర్స్ కలిగిన ఈ కారు మంచి పనితీరును అందించే హైపర్‌ఫార్మెన్స్ మోడల్. ఈ కారులో స్పోర్ట్స్ సీట్లు, ఏరో డైనమిక్ కిట్, ప్రత్యేకమైన అల్లాయ్ వీల్స్ వంటివి గమనించ వచ్చు. ఇది మంచి పనితీరును అందించడానికి ప్రత్యేకంగా రూపొందించడం వల్ల.. చాలామంది కార్ లవర్స్ దీనిని ఇష్టపడుతుంటారు.
ఉమశ్రీ చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ట్రెండింగ్ అంశాలు, వివిధ విభాగాలపై ప్రత్యేక కథనాలను రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, సైన్స్ & టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, పాలిటిక్స్ తదితర రంగాలకు సంబంధించిన విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో ఆయనకు 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.