బిగ్‏బాస్ 9 విజేతగా కళ్యాణ్: తనూజ, పవన్, ఇమ్ము, సంజన రెమ్యునరేషన్ ఎంతంటే?

చాలామందికి 105 రోజులు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించిన తెలుగు రియాలిటీ షో బిగ్‏బాస్ తెలుగు సీజన్ 9 నిర్విఘ్నంగా ముగిసింది. కామన్‌మెన్ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టిన కళ్యాణ్ పడాలా.. టైటిల్ గెలుచుకోగా, తనూజ రెండో స్థానంలో నిలిచి రన్నర్‌గా మిగిలారు. వీరితోపాటు డీమాన్ పవన్, ఇమ్మాన్యుయేల్, సంజన టాప్ 5 లిస్టులో నిలిచారు.

బిగ్‏బాస్ హౌస్‌లో మూడు నెలలు.. ఎన్నో టాస్కులు పూర్తి చేసి, టాప్ 5లో నిలిచిన వీరిలో ఒక్కొక్కరికి ఎంత రెమ్యునరేషన్ వచ్చింది. విన్నర్ ప్రైజ్ మనీ ఎంత అనే వివరాలు వివరంగా ఇక్కడ చూసేద్దాం.

కళ్యాణ్ పడాల

బిగ్‏బాస్ తెలుగు సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాలా.. టైటిల్ గెలుచుకోవడంతో పాటు రూ. 35లక్షల ప్రైజ్ మనీ కూడా సొంతం చేసుకున్నారు. దీనితోపాటు ఓ ప్రైవేట్ సంస్థ రూ. 5 లక్షల చెక్ అందించింది. ఇది కాకుండా మారుతి సుజుకి కంపెనీ.. విజేతకు రూ. 10 లక్షల కంటే ఎక్కువ ఖరీదైన విక్టోరిస్ కారును గిఫ్ట్ ఇచ్చింది.

పైన చెప్పుకున్న గిఫ్ట్స్ మాత్రమే కాకుండా.. బిగ్‏బాస్ హౌస్‌లో మూడు నెలలు (15 వారాలు) ఉన్నందుకు కళ్యాణ్ పడాలకు రూ. 8.4 లక్షలు లభించినట్లు సమాచారం. అంటే వారానికి రూ. 70000 రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఇలా మొత్తం మీద దాదాపు రూ. 60 లక్షలు పొందినట్లు సమాచారం.

తనూజ పుట్టస్వామి

బుల్లితెర ప్రేక్షకులకు బాగా పరిచయమున్న తనూజ.. బిగ్‏బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన తరువాత మరింతమంది అభిమానులను సంపాదించుకుంది. కళ్యాణ్ టైటిల్ గెలుచుకుంటే.. తనూజ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. హౌస్‌లోని అందరితో కలిసి మెలిసి కళ్యాణ్ గెలుపుకు ప్రధాన కారణం కూడా. కాగా ఈమె హౌస్‌లో 15 వారాలు ఉంన్నందుకుగానూ.. వారానికి రూ. 2.50 లక్షల చొప్పున రూ. 37.5 లక్షలు సంపాదించినట్లు సమాచారం.

డీమాన్ పవన్

మూడో స్థానంలో ఉన్న డీమాన్ పవన్.. రూ. 15 లక్షల ఆఫర్ తీసుకుని తనకు తానుగానే బయటకు వచ్చేసారు. ప్రారంభం నుంచే అనేక విమర్శలు ఎదుర్కొన్న ఇతడు తెలివిగా నడుచుకుని.. ఆఖరి నిమిషాల్లో మంచి నిర్ణయం తీసుకున్నారు. దీనితో ఇతనికి రూ. 15 లక్షల సూట్‌కేసు లభించింది. ఇది మాత్రమే కాకుండా.. వారానికి రూ. 70వేలు చొప్పున.. 15 వారాలకు రూ. 10.50 లక్షల రెమ్యునరేషన్ కూడా లభించింది. దీంతో ఇతడు సంపాదించిన మొత్తం 25.50 లక్షల రూపాయలు.

ఇమ్మాన్యుయేల్

జబర్దస్త్ ద్వారా తెరపైకి వచ్చిన కమెడియన్ ఇమ్మాన్యుయేల్.. నాలుగో స్థానంలో నిలిచారు. నిజానికి ఇతనికి చాలామంది సపోర్ట్ చేస్తూ.. అసలైన బిగ్‏బాస్ 9 తెలుగు టైటిల్ విన్నర్ అని సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా.. ఆటతీరుతో ప్రేక్షులకు మెప్పించడం మాత్రమే కాకుండా.. కామెడీ చేస్తూ నవ్వించారు. ఇతడిని 15 వారాలకుగానూ.. వారానికి రూ. 2.6 లక్షల చొప్పున రూ. 39 లక్షలు సంపాదించారు.

సంజన గల్రాని

నటిగా సుమారు 50 సినిమాల్లో నటించిన సంజన గల్రాని.. బిగ్‏బాస్ తెలుగు సీజన్ 9లో టాప్ 5 కంటెస్టెంట్స్ జాబితాలో ఒకరిగా నిలిచారు. చివరి నిమిషంలో ఎలిమినేట్ అయ్యారు. 15 వారాలు హౌస్‌లో ఉండి.. తనదైన రీతిలో ప్రేక్షకులను మెప్పించిన ఈమె ఎలిమినేట్ అయినప్పటికీ.. భారీ రెమ్యునరేషన్ తీసుకుంది. వారానికి రూ. 2.80 లక్షల చొప్పున.. మొత్తం 15 వారాలకు రూ. 42 లక్షలు సంపాదించింది.

బిగ్‏బాస్ తెలుగు సీజన్ 9.. రెమ్యునరేషన్ వివరాలు కేవలం అంచనా మాత్రమే. రెమ్యునరేషన్ వివరాలను బిగ్‏బాస్ నిర్వాహకులు లేదా అందులో పాల్గొన్న కంటెస్టెంట్స్ అధికారికంగా వెల్లడించలేదు. కాబట్టి రెమ్యునరేషన్ దాదాపు అంచనా. ఈ విషయాన్ని పాఠకులు గమనించగలరు.