టూవీలర్ విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన బజాజ్ ఆటో.. భారతదేశంలో తన అప్డేటెడ్ పల్సర్ 150 బైక్ లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 1.09 లక్షలు (ఎక్స్ షోరూమ్). మూడు వేరియంట్లలో లభించే ఈ ఆధునిక బైక్.. డిజైన్, ఫీచర్స్, ఇంజిన్ వివరాలను ఈ కథనంలో వివరంగా చూసేద్దాం.
మూడు వేరియంట్స్, ధరలు
కొత్త బజాజ్ పల్సర్ 150 బైక్.. ఎస్‌డీ, ఎస్‌డీ యూజీ, టీడీ యూజీ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 1.09 లక్షలు, రూ. 1.12 లక్షలు, రూ. 1.15 లక్షలు (ఎక్స్ షోరూమ్). స్టాండర్డ్ బైక్ ధరతో పోలిస్తే.. ఈ కొత్త బైక్ ధర రూ. 3600 ఎక్కువ. అయితే ఇది ధరకు తగిన అప్డేట్స్ పొందింది.
డిజైన్.. ఇంజిన్ వివరాలు
లేటెస్ట్ బజాజ్ పల్సర్ 150.. ఎల్ఈడీ హెడ్‌లైట్, ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్ పొందుతుంది. అప్డేటెడ్ గ్రాఫిక్స్ డిజైన్ చూడవచ్చు. ఈ కొత్త బైక్ అదే 149 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ద్వారా.. 8500 ఆర్‌పీఎమ్ వద్ద 13.8 బీహెచ్‌పీ పవర్, 6500 ఆర్‌పీఎమ్ వద్ద 13.4 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్ ద్వారా.. మంచి పనితీరును అందిస్తుంది. కాబట్టి పనితీరు విషయంలో కొత్తదనాన్ని కోరుకోలేరు.
కొత్త హంగులతో బజాజ్ పల్సర్
కొత్త బజాజ్ పల్సర్ 150 బైక్ ఆధునిక హంగులతో మార్కెట్లో లాంచ్ కావడానికి ప్రధాన కారణం.. కస్టమర్లకు ఆకట్టుకోవడానికే. ఇయర్ ఎండ్, రానున్న సంక్రాంతి పండుగల సమయంలో చాలామంది బైక్ కొనాలని చూస్తారు. అలాంటి సమయంలో కొత్త బజాజ్ ఈ లేటెస్ట్ బైక్ లాంచ్ చేయడం అనేది.. కొత్త కస్టమర్లను ఆకట్టుకోవడంలో భాగంగా అనే తెలుస్తోంది.
చాలా కాలంగా బజాజ్ పల్సర్ 150 బైక్ అదే డిజైన్ కలిగి ఉండటం వల్ల.. చాలామంది ఇందులో కొత్త అప్డేట్ కోసం వేచి చూసారు. అలాంటి వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. డిజైన్ అప్డేట్స్ కనిపించినప్పటికీ.. ఫీచర్స్, ఇంజిన్, పనితీరులో ఎలాంటి మార్పు లేదు.
పల్సర్ బైకులకున్న డిమాండ్
భారతదేశంలో ఎక్కువమంది బైక్ కొనుగోలుదారులు తమ మొదటి ఎంపికగా ఎంచుకునే బైకుల జాబితాలో బజాజ్ పల్సర్ ఒకటి. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ బైక్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్డేట్స్ పొందుతూ ఉంది. ఈ విధంగా చాన్నాళ్లుగా.. మార్కెట్లో మంచి అమ్మకాలను పొందుతూ.. ప్రత్యర్థులకు అమ్మకాల పరంగా పోటీ ఇస్తూ.. పల్సర్ తన హవా చూపిస్తోంది.
2026లో కూడా తన ఉనికిని, ఆధిపత్యాన్ని చూపించుకోవడంలో భాగంగా.. ఇప్పుడు పల్సర్ 150 మోడల్ అప్డేటెడ్ బైక్ అమ్మకానికి వచ్చింది. ఇది కూడా మంచి అమ్మకాలను పొందే అవకాశం ఉందని పరిస్థితులు చెబుతున్నప్పటికీ.. ఎలాంటి అమ్మకాలను పొందుతుందనే విషయం తెలుసుకోవాలంటే మాత్రం.. ఇంకొన్ని రోజులు వేచి చూడక తప్పదనిపిస్తోంది. కాగా కంపెనీ కూడా వచ్చే ఏడాది (2026లో) మరిన్ని కొత్త బైకులను మార్కెట్లో లాంచ్ చేయనుంది. అయితే ఏ బైకులను లాంచ్ చేస్తుందనే విషయం మాత్రం ప్రస్తుతానికి వెల్లడి కాలేదు.
ఉమశ్రీ చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ట్రెండింగ్ అంశాలు, వివిధ విభాగాలపై ప్రత్యేక కథనాలను రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, సైన్స్ & టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, పాలిటిక్స్ తదితర రంగాలకు సంబంధించిన విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో ఆయనకు 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.