ఎప్పుడు చూసిన అక్కడ బస్ టికెట్ రేట్లు పెరిగాయి, ఇక్కడ కరెంట్ ఛార్జీలు పెరిగాయని చాలా సందర్భాల్లో వినే ఉంటారు. అయితే ట్రైన్ టికెట్ రేట్లు పెరగడం చాలా అరుదు. కానీ ఈ ఏడాది మాత్రం ఈ ఛార్జీలు రెండోసారి పెరిగాయి. గతంలో జులైలో ఒకసారి పెరిగాయి. ఇప్పుడు పెరిగిన ఛార్జీలు ఈ రోజు (2025 డిసెంబర్ 26) నుంచే అమల్లోకి వస్తాయి. ఈ విషయాన్ని రైల్వే శాఖ అధికారికంగా వెల్లడించింది.
దూరాన్ని బట్టి ఛార్జి
215 కిమీ దూరానికి ఆర్డినరీ క్లాస్ ట్రైన్ టికెట్ ధర కిలోమీటర్లు 5 పైసలు, మెయిల్ / ఎక్స్‌ప్రెస్ రైళ్లలో నాన్ ఏసీ క్లాస్ మరియు ఇతర రైళ్లలో అన్ని ఏసీ తరగతులకు 2 పైసలు పెంపును ప్రకటిస్తూ.. రైల్వే మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. సవరించిన కొత్త ఛార్జీల ప్రకారం.. సబర్బన్ సేవలు, సీజన్ టికెట్ ఛార్జీలలో ఎటువంటి మార్పు లేదు. అయితే నాన్ ఏసీ (నాన్ సబర్బన్) సేవలకు, సెకండ్ క్లాస్ ఆర్డినరీ, స్లీపర్ క్లాస్ ఆర్డినరీ, ఫస్ట్ క్లాస్ ఆర్డినరీ ఛార్జీలను గ్రేడెడ్ పద్దతిలో సవరించడం జరిగిందని వెల్లడించింది.
కొత్త ఛార్జీలు ఇలా..
సవరించిన కొత్త ట్రైన్ టికెట్ ఛార్జీల ప్రకారం.. సెకండ్ క్లాస్ ఆర్డినరీలో 215 కిమీ దూరానికి ఎలాంటి పెరుగుదల లేదు. అంటే రోజువారీ.. తక్కువ దూరాలకు ప్రయాణించేవారికి ఎలాంటి ఇబ్బంది లేదన్నమాట. అయితే అంతంతే ఎక్కువ దూరం.. అనగా 216 కిమీ నుంచి 750 కిమీ వరకు ఛార్జీలు రూ. 5 పెరుగుతుంది. ఆ తరువాత దూరాన్నిబట్టి టికెట్ రేటు పెరుగుతుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
- 216 కిమీ నుంచి 750 కిమీ దూరానికి: 5 రూపాయలు
- 751 నుంచి 1250 కిమీ దూరానికి: 10 రూపాయలు
- 1251 కిమీ నుంచి 1750 కిమీ దూరానికి: 15 రూపాయలు
- 1751 కిమీ నుంచి 2250 కిమీ దూరానికి: 20 రూపాయలు
పై విధంగా ధరలు పెరుగుదల ఉంటుంది. ఇందులో స్లీపర్, ఫస్ట్ క్లాస్, ఏసీ చైర్ కార్, ఏసీ 3 టైర్, ఏసీ 2 టైర్, ఏసీ ఫస్ట్ క్లాస్ ఉన్నాయి. నాన్ ఏసీ మెయిల్ / ఎక్స్‌ప్రెస్ కోచ్‌లలో 500 కిమీ దూరం ప్రయాణించడానికి టికెట్ కొనుగోలుపై అదనంగా 10 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. రాజధాని, వందే భారత్, తేజస్, మహామాన, గతిమాన్, అంత్యోదయ, యువ ఎక్స్‌ప్రెస్, అమృత్ భారత్ మొదలైన ట్రైన్లకు కూడా పెరిగిన టికెట్ ధరలు వరిస్తాయి.
ఇప్పటికే బుక్ చేసుకున్న టికెట్లపై ధరల ప్రభావం
ఈ రోజు నుంచి.. అంటే 2026 డిసెంబర్ 26 లేదా ఆ తరువాత బుక్ చేసుకున్న ట్రైన్ టికెట్లకు మాత్రమే పెరిగిన ఛార్జీలు వర్తిస్తాయి. అంతకుముందు బుక్ చేసుకున్న టికెట్ ధరలపై పెరిగిన ధరల ప్రభావం ఉండదు. కాబట్టి ఇప్పటికే టికెట్స్ బుక్ చేసుకున్నవాళ్లు అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. కొత్త ఛార్జీల వివరాలను కూడా త్వరలోనే అధికారికంగా ప్రదర్శించనున్నారు. ప్రతి రోజూ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల రక్షణ తమ బాధ్యత అని, పెంచిన ధరలు ప్రయాణికులపై పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
హిమాన్షు కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, సినీ రంగాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలను అందిస్తున్నారు. గతంలో ఆయన ఏపీ, తెలంగాణకు సంబంధించిన ఆసక్తికర వార్తలు, రాజకీయాలు, క్రికెట్ వార్తలు రాశారు. హైపర్ లోకల్ న్యూస్ రైటింగ్‌లో అనుభవం కలిగిన ఆయన వీడియో టీమ్‌తో కూడా పని చేసిన అనుభవం కలిగి ఉన్నారు. జర్నలిజం రంగంలో 14 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆయన ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయాలు, క్రీడలు, సినిమా రంగాలకు సంబంధించిన ఆర్టికల్స్ రాశారు.