2026 జనవరి 26న ఇండియన్ మార్కెట్లో లాంచ్ కావడానికి ముందే.. రెనాల్ట్ కంపెనీ తన కొత్త డస్టర్ కారు గురించి వెల్లడించింది. దీనికి సంబంధించిన టీజ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రానున్న ఈ కొత్త కారు గురించి.. పూర్తి వివరాలు ఇక్కడ చూసేద్దాం.
కొత్త రెనాల్ట్ డస్టర్..
ఒకప్పుడు ఇండియన్ మార్కెట్లో మంచి అమ్మకాలు పొందిన రెనాల్ట్ డస్టర్ కారు.. కొన్ని అనివార్య కారణాల వల్ల, ఆదరణకు నోచుకోలేదు. అయితే ఇప్పుడు సంస్థ దీనిని కొత్త హంగులతో.. విడుదల చేయడానికి సిద్ధమైంది. అయితే మన దేశంలో విడుదల చేయనున్న డస్టర్ కారు.. గ్లోబల్ మార్కెట్లో అమ్ముడవుతున్న కారు కంటే, కొంత భిన్నంగా ఉంటుంది.
డిజైన్ అప్డేట్ ఎలా?
2026 రెనాల్ట్ డస్టర్ కారు.. అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న కారు మోడల్ సిల్హౌట్ పొందుతుంది. కనుబొమ్మల ఆకారంలో ఉండే ఎల్ఈడీ డీఆర్ఎల్ కనిపిస్తాయి. ఇవి టర్న్ ఇండికేటర్లుగా కూడా పనిచేస్తాయి. వెనుకవైపు.. సెంట్రల్ లైట్ బార్‌తో కనెక్ట్ అయిన ఎల్ఈడీ టెయిల్ లైట్ ఉన్నట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. వై షేప్ ఎల్ఈడీ టెయిల్ లైట్ కూడా ఉంది. రియర్ వైపర్, బ్రాండ్ లోగో మాత్రమే కనిపిస్తున్నాయి. డిజైన్ వివరాలు చాలా తెలియాల్సి ఉంది.
ఇంటీరియర్ వివరాలు
కంపెనీ తన 2026 డస్టర్ ఇంటీరియర్ వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. కానీ ఇది ప్రీమియం ఫీచర్స్ పొందుతుందని చాలామంది అనుకుంటున్నారు. సేఫ్టీ ఫీచర్స్ కూడా ఎక్కువగానే ఉంటాయని సమాచారం.
కొత్త రెనాల్ట్ డస్టర్ కారు.. 7 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 10.1 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, పనోరమిక్ సన్‌రూఫ్ కూడా ఉంటాయని సమాచారం. సేఫ్టీ విషయానికి వస్తే.. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగులు, బ్లైండ్ స్పాట్ మానిటర్‌తో కూడిన 360 డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం వంటివన్నీ ఉంటాయని తెలుస్తోంది. అయితే.. వీటికి సంబంధించిన వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.
పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ ఏమిటి?
రెనాల్ట్ కంపెనీ లాంచ్ సమయంలో డస్టర్ కారును.. పెట్రోల్ ఇంజిన్ ఎంపికలో మాత్రమే అందించే అవకాశం ఉంది. కాగా రాబోయే రోజుల్లో ఇది స్ట్రాంగ్ హైబ్రిడ్ రూపంలో కూడా అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు. కాగా.. ఇది గ్లోబల్ మార్కెట్లో 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.
అంచనా ధర ఎంతంటే?
భారతదేశంలో.. రెనాల్ట్ కంపెనీ లాంచ్ చేయనున్న 2026 డస్టర్ కారు ధర రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. ఇది కేవలం అంచనా మాత్రమే. అయితే దీని ధరలు కారు లాంచ్ అయ్యే సమయంలోనే తెలుస్తాయి. అయితే ఇది.. మార్కెట్లో లాంచ్ అయిన తరువాత హ్యుందాయ్ క్రెటా, మారుతి విక్టోరిస్, గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, స్కోడా కుషాక్, ఎంజీ ఆస్టర్ వంటివాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. దీన్నిబట్టి చూస్తే.. మార్కెట్లో ఇది గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుందని అవగతం అవుతోంది.
న్యూస్, మీడియా రంగంలో 12 సంవత్సరాల అనుభవం గల సీనియర్ ప్రొఫెషనల్. అనేక ప్రసిద్ధ తెలుగు టీవీ చానెల్స్‌లో పని చేశారు. ఇప్పటివరకు అనేక వ్యాసాలు, కథనాలు, అలాగే డిజిటల్ కంటెంట్ రచనలు చేయడంలో విశేష అనుభవం ఉంది. డిజిటల్ మార్కెటింగ్, తెలుగు కంటెంట్ సృష్టిలో నైపుణ్యం ఉన్న మహేష్, క్రియేటివ్, ఆకర్షణీయ, సమాచారపరమైన కంటెంట్ రూపకల్పనలో ప్రత్యేకత కలిగిన వ్యక్తి.