భారతదేశంలో అత్యధిక అమ్మకాలు పొందిన కార్ల జాబితాలో టాటా మోటార్ కంపెనీకి చెందిన టాటా పంచ్ ఒకటి. ఈ కారు ఇప్పుడు పెట్రోల్, ఎలక్ట్రిక్, సీఎన్జీ రూపాల్లో అమ్మకాలనికి ఉంది. అయితే.. ఇది ఫేస్‌లిఫ్ట్ రూపంలో లాంచ్ కావడానికి సిద్ధమైంది. కాబట్టి.. ఈ కథనంలో ఈ కారు లాంచ్ డేట్, ఇతరత్రా వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
లాంచ్ డేట్
టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ జనవరి 13న ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతుందని సమాచారం. అయితే ధరలు ఎప్పుడు వెల్లడవుతానే విషయాన్ని కంపెనీ వెల్లడించాల్సి ఉంది. కాగా ఇప్పటికే చాలాసార్లు.. ఈ కారు టెస్టింగ్ సమయంలో కనిపించింది. కాబట్టి త్వరలోనే ఇది భారతదేశంలో లాంచ్ అవుతుంది.
డిజైన్ బాగుందా?
నిజానికి టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ మోడల్.. దాదాపు సాధారణ మోడల్ మాదిరిగానే ఉంటుంది. కానీ ఇందులో కొన్ని అప్డేట్స్ గమనించవచ్చు. పంచ్ ఫేస్‌లిఫ్ట్ యొక్క ఫ్రంట్ గ్రిల్ దిగువ చివరలో ఎయిర్ డ్యామ్ ఉంటుంది. అయితే ఈవీ మోడల్ మాదిరిగా.. ఫాసియా రిఫ్రెష్ అప్పీల్ పొందే అవకాశం ఉంది. డీఆర్ఎల్, కనెక్టింగ్ లైట్స్ అన్నీ కూడా ఇప్పటికే మార్కెట్లో అమ్మకానికి ఉన్న పంచ్ కార్లలో మాదిరిగానే ఉంటాయి. సిల్హౌట్ పాత పంచ్ కారులో ఉన్నట్లుగా ఉన్నప్పటికీ.. అల్లాయ్ వీల్స్ డిజైన్ అప్డేట్ పొంది ఉంటుందని తెలుస్తోంది. కాంట్రాస్టింగ్ బ్లాక్ రూఫ్‌తో ఇది కొత్త పెయింట్ స్కీమ్ పొందుతుందని భావిస్తున్నారు. కారు వెనుక భాగం కూడా చాలావరకు నవీనీకరించబడినట్లు సమాచారం.
ఇంటీరియర్ డిజైన్, ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే?
టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ మోడల్.. ప్రకాశవంతమైన లోగో కలిగి టూ స్పోక్ స్టీరింగ్ వీల్ పొందుతుంది. 10.25 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టం ఉంటుంది. టచ్ ఎనేబుల్డ్ బటన్స్ కూడా పొందుతుందని తెలుస్తోంది. 360 డిగ్రీ కెమెరా, ఆటో ఫోల్డింగ్ ఓఆర్వీఎం వంటి వాటితో పాటు.. ఏసీ వెంట్స్ మొదలైనవన్నీ ఉంటాయి.
పంచ్ అంటేనే భద్రత.. కాబట్టి కొత్తగా లాంచ్ అయ్యే పంచ్ ఫేస్‌లిఫ్ట్ కారు కూడా అత్యాధునిక సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంటుందని భావిస్తున్నాము. ఇప్పటికే పంచ్ కారు.. దేశంలో అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటిగా ఉంది. ఈ కారణంగానే.. దీని అమ్మకాలు.. ఈ విభాగంలోని ప్రత్యర్థుల కంటే ఎక్కువగా ఉంది.
పవర్‌ట్రెయిన్ మారుతుందా?
కొత్త టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ ఇంజిన్ అప్డేట్ పొందే అవకాశం లేదు. కాబట్టి.. ఇది సాధారణ కారులోని అదే 1.2 లీటర్ త్రీ సిలిండర్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 88 హార్స్ పవర్, 115 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్, ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఎంపికలలో లభిస్తుంది.
అంచనా ధర
టాటా మోటార్స్.. పంచ్ ఫేస్‌లిఫ్ట్ ధరలను అధికారికంగా వెల్లడించలేదు. కానీ ఇది అవుట్గోయింగ్ వెర్షన్ ధర (రూ. 5.50 లక్షలు ఎక్స్ షోరూమ్) కంటే.. కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఫేస్‌లిఫ్ట్ ధర రూ. 6 లక్షల వరకు ఉండే అవకాశం ఉంటుందని సమాచారం. ఇది హ్యుందాయ్ ఎక్స్టర్, సిట్రోయెన్ సీ3 వంటి వాటికి అమ్మకాల్లో పోటీగా ఉంటుంది.
హిమాన్షు కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, సినీ రంగాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలను అందిస్తున్నారు. గతంలో ఆయన ఏపీ, తెలంగాణకు సంబంధించిన ఆసక్తికర వార్తలు, రాజకీయాలు, క్రికెట్ వార్తలు రాశారు. హైపర్ లోకల్ న్యూస్ రైటింగ్‌లో అనుభవం కలిగిన ఆయన వీడియో టీమ్‌తో కూడా పని చేసిన అనుభవం కలిగి ఉన్నారు. జర్నలిజం రంగంలో 14 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆయన ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయాలు, క్రీడలు, సినిమా రంగాలకు సంబంధించిన ఆర్టికల్స్ రాశారు.