చాలా రోజుల నిరీక్షణ తరువాత.. మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ తన ఫెసిలిఫ్టేడ్ ఎక్స్‌యూవీ700 లేదా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ కారును లాంచ్ చేసింది. ఇది ఇండియన్ మార్కెట్లో ఎంజీ హెక్టర్, టాటా సఫారీ, హ్యుందాయ్ ఆల్కజార్ వంటి కార్లకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ లేటెస్ట్ దేశీయ కారు ధర, డిజైన్, ఇతర వివరాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకోవాలంటే.. ఈ కథనం చూసేయాల్సిందే.
రేటు, బుకింగ్స్, డెలివరీ డీటెయిల్స్
మహీంద్రా అండ్ మహీంద్రా లాంచ్ చేసిన లేటెస్ట్ ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ కారు మల్టిపుల్ వేరియంట్లలో లభిస్తుంది. దీని ధరలు రూ. 13.66 లక్షల నుంచి రూ. 23.64 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ఈ ధరలు మొదటి 40000మంది కస్టమర్లకు మాత్రమే అని సంస్థ స్పష్టం చేసింది. కాబట్టి ధరలు రాబోయే రోజుల్లో మారే అవకాశం ఉంది. కాగా.. కంపెనీ ప్రస్తుతం ఈ కారు కోసం ఫ్రీ బుకింగ్స్ నిలిపివేసినప్పటికీ.. మళ్లీ జనవరి 14 నుంచి బుకింగ్స్ స్వీకరించనున్నట్లు సమాచారం. డెలివరీలు కూడా అదే రోజు నుంచి మొదలవుతాయని చెబుతున్నారు.
పవర్‌ట్రెయిన్ వివరాలు
మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ కారు రెండు ఇంజిన్ ఎంపికలతో లభిస్తుంది. అవి 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ (200 హార్స్ పవర్ & 380 ఎన్ఎమ్ టార్క్), 2.2 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ (185 హార్స్ పవర్ & 450 ఎన్ఎమ్ టార్క్). ఇవి 6 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతాయి. ఈ ఇంజిన్ ఆప్షన్స్ సాధారణ ఎక్స్‌యూవీ 700లో కారులో కూడా కనిపిస్తాయి.
డిజైన్ ఎలా ఉందంటే?
ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ కారు ముందు భాగం చూడటానికి కొంత ఎలక్ట్రిక్ కారు మాదిరిగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ రీ-డిజైన్ చేసిన ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, రీఫ్రెష్డ్ గ్రిల్ మొదలైనవి ఉన్నాయి. వెనుక భాగంలో విలోమ ఆకారంలో ఉండే.. పూర్తి వెడల్పు అంతటా ఉన్న లైట్ బార్ కనిపిస్తుంది. డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్ చూడవచ్చు.
ఫీచర్స్ విషయానికి వస్తే..
మహీంద్రా కొత్త ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ కారు డిజైన్ పరంగా మాత్రమే కాకుండా.. ఫీచర్స్ పరంగా కూడా ఉత్తమంగా ఉంటుంది. ఇందులో ట్రిపుల్ 10.25 ఇంచెస్ స్క్రీన్ కనిపిస్తుంది. ఇది చూడటానికి చాలా ప్రీమియం లుక్ ఇస్తుంది. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే వంటి వాటితోపాటు 60 కంటే ఎక్కువ ఫంక్షన్‌లతో కూడిన అలెక్సా ఇంటిగ్రేషన్ కూడా ఉంది.
టూ స్పోక్ స్టీరింగ్ వీల్, వెంటిలేషన్ & ఎయిర్ కండిషనింగ్ కోసం టచ్ బేస్డ్ ప్యానెల్ ఈ కారులో కనిపిస్తుంది. పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ముందు ప్రయాణికుల కోసం పవర్ బాస్ మోడ్, 16 స్పీకర్ హర్మాన్ కార్టాన్ సౌండ్ సిస్టం, వైర్‌లెస్ ఛార్జింగ్, డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ కూడా ఉన్నాయి.
సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే..
మహీంద్రా కొత్త ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ కారు 7 ఎయిర్‌బ్యాగ్‌లు, 540 డిగ్రీ కెమెరా, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఐసోఫిక్స్ సీట్ యాంకరేజ్‌లు వంటి సేఫ్టీ ఫీచర్లతో పాటు.. లెవెల్ 2 ఏడీఏఎస్ ఫీచర్స్ (అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, ఆటోమాటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ మొదలైనవి) కూడా ఉన్నాయి. మొత్తం మీద ఇది దేశీయ విఫణిలో అత్యుత్తమ ఫీచర్స్, డిజైన్, ఇంజిన్ ఎంపికలతో అందుబాటులోకి వచ్చేసింది కాబట్టి.. ఇది మంచి అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నాము.
ఉమశ్రీ చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ట్రెండింగ్ అంశాలు, వివిధ విభాగాలపై ప్రత్యేక కథనాలను రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, సైన్స్ & టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, పాలిటిక్స్ తదితర రంగాలకు సంబంధించిన విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో ఆయనకు 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.