మహాకుంభమేళా సమయంలో సోషల్ మీడియా ద్వారా రాత్రికి రాత్రే సెన్సేషన్‌గా మారిన మోనాలిసా (మోనాలిసా భోస్లే) గురించి ఇప్పుడు అందరికీ తెలుసు. ఒకప్పుడు పూసలమ్ముకుంటూ.. జీవనం సాగించే కుటుంబం నుంచి వచ్చిన ఈమె, నేడు సెలబ్రిటీగా మారిపోయింది. హిందీ సినిమాలో నటించిన తరువాత.. ఇప్పుడు తెలుగు సినిమాలో కూడా ఒక లీడ్ రోల్‌లో కనిపించనున్నట్లు సమాచారం. కాగా ఈమె ఇటీవల ఎయిర్‌పోర్టులో కనిపించారు.
కొత్తగా మోనాలిసా!
ఎయిర్‌పోర్టులో కనిపించిన మోనాలిసాకు.. పూసలమ్మిన మోనాలిసాకు చాలా తేడా కనిపిస్తోంది. సినిమా రంగంలోకి అడుగుపెట్టగానే.. వేషం మొత్తం మారిపోయింది. ఎయిర్‌పోర్టులో కనిపించిన ఈమెను చాలామంది గుర్తుపట్టలేకపోయారు. దీన్ని బట్టి చూస్తే మోనాలిసా ఏ స్థాయికి ఎదిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇదేమీ తప్పు కాదు, ఏ రంగంలో ఉన్నప్పుడు.. ఆ రంగానికి తగిన విధంగా తయారవ్వడం సర్వ సాధారణం. ఇందులో భాగంగానే ఈమె స్టైలిష్ డ్రెస్ వేసుకుని కనిపించారు.
బ్లాక్ షర్ట్, బ్లూ ప్యాంట్ వేసుకుని. దానిపై పింక్ కలర్ జాకెట్ వేసుకున్నారు. స్టైలిష్ కళ్లజోడు పెట్టుకున్నారు. ఇన్నోవా కారులో నుంచి దిగడం కూడా చూడవచ్చు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు మొత్తానికి మోనాలిసా హీరోయిన్ అయిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు.
కలిసొచ్చిన అదృష్టం!
మహాకుంభమేళాలో పూసలమ్ముకుంటూ.. అమాయకంగా కనిపించిన మోనాలిసా, పలువురి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను ఆకట్టుకుంది. దీంతో ఆమె రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోయింది. దీంతో అక్కడ ఉండలేక.. తన సొంత ఊరికి వెళ్లిపోయింది.
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు ఎంతోమందిని ఆకట్టుకున్నాయి. ఇందులో బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా కూడా ఉన్నారు. ఈయన మోనాలిసాతో సినిమా తీయడానికి సిద్ధమయ్యారు. దీనికోసం అన్నీ సిద్ధం కూడా చేసుకున్నారు. మణిపూర్ డైరీస్ పేరుతో.. సినిమా ప్రారంభించారు. కానీ కొన్ని కారణాల వల్ల సనోజ్ మిశ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో సినిమా ఆగిపోయింది.
తెలుగు సినిమాలో మోనాలిసా
బాలీవుడ్ సినిమా పక్కన పెడితే.. మొనాలిసాకు తెలుగు సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. చాలా రోజులకు ముందు కొత్త సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమంలో మొనాలిసా కనిపించారు. సినిమా పెరుగును అధికారికంగా వెల్లడించనప్పటికీ.. వెంగమాంబ మూవీ ప్రొడక్షన్ వారు.. ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు సమాచారం. సాయి చరణ్ హీరోగా.. శ్రీను కొటుపాటి దర్శకత్వం వహించనున్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయం తెలియాల్సి ఉంది.
అదృష్టాన్ని నమ్ముకోవడం మంచిదేనా!
నిజానికి అందరి విషయంలో అదృష్టం వస్తుందని, వారి జీవితాలు మారిపోతాయని చెప్పడం అసాధ్యం. ఎందుకంటే ఇది కొందరి జీవితాల్లో మాత్రమే సాధ్యమవుతుంది. అదృష్టం కలిసి వచ్చినప్పటికీ.. తమను తాము నిరూపించుకున్నప్పుడే తాము ఉంటున్న రంగంలో నిలదొక్కుకోగలరు. పోటీని ఎదుర్కోగలరు. అదృష్టం కొద్దీ పాపులారిటీ వస్తే.. దానిని నిలబెట్టుకోవడానికి తప్పకుండా శ్రమించాలి. లేకుంటే.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విషయాన్ని తప్పకుండా అందరూ గుర్తుంచుకోవాలి. పోటీ ప్రపంచంలో ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉండాలి. అప్పుడే ఎవరిని వారు దృఢంగా నిర్మించుకోగలరు.
శౌర్య వర్ధన్ సబ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. సినిమా, రాజకీయం వంటి విభిన్న అంశాలపై సమగ్రమైన ఆర్టికల్స్ అందిస్తూ వస్తున్నాను. ఈ రంగంలో నాకు నాలుగు సంవత్సరాల అనుభవం ఉంది. రాయడంలో నైపుణ్యంతో, చదువరులకు స్పష్టమైన మరియు ఆసక్తికరమైన కంటెంట్ అందించడం నా లక్ష్యం.