కొణిదెల నిహారిక తన సొంత బ్యానర్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌లో నిర్మించినటువంటి కమిటీ కుర్రాళ్లు సినిమా మంచి విజయం సాధించింది. 2024 సంవత్సరంలో ఆ చిత్రం గెలుపు ఇచ్చిన ఊపులో మరో సినిమాని తీసేసారు. మ్యాడ్ సినిమా ఫేమ్ సంగీత్ శోభన్ హీరోగా రాకాస చిత్రాన్ని ఆమె జీ స్టూడియోస్ సౌత్ కలిసి నిర్మించారు. 2026 జనవరి 23న ఈ సినిమా టీజర్ విడుదల చేశారు.
భయం, కామెడీ పండిస్తున్న గ్లింప్స్
రాకాసా గ్లింప్స్ వీడియో మొదలవగానే ఒక గుహ కనిపిస్తుంది, అందులోకి వెళ్లగానే మొత్తం చీకటిగా ఉంటుంది. ఆ చీకటి నిండిన పాడుపడ్డ గుహలో చనిపోయిన మనిషి కలేబరం ఒకటి కనిపించి అందులో నుంచి పెద్ద తేలు బయట వస్తుంది. ఒక వ్యక్తి నడుచుకొని వచ్చి అక్కడ మండుతున్న రెండు వెలుగుతున్న కట్టెల్లో నుంచి చేత్తో ఒక కట్టెను తీసుకోగానే ఆ కట్టే కింద నుంచి ఒక శవం కట్టెను అందించినట్టు భూమిలో నుంచి ఒక చెయ్యి పైకి లేస్తుంది అప్పటి నుంచి బాగానే అనిపించిన ఒక్కసారిగా భయం పుడుతుంది.
బ్యాక్‌గ్రౌండ్‌లో శోభన్ యుగయుగాలుగా ప్రతి కథలో ఒక సమస్య, ఆ సమస్యను చేధించడానికి ఒక వీరుడుపుడతాడు, ఆ వీరుడు ఎవడు అని తెలిసేలోపే నిశ్శబ్దంగా తన పని ముగిస్తాడు, ఈ కథలో ఆ వీరుడు అంటూ డైలాగ్ వస్తుండగా ఆ మండుతున్న కట్టే వెలుతురులోంచి హీరో ముఖం మనకు కనబడుతుంది. మొదటగా భయపడిన హీరోను ఎలివేట్ చేస్తూ ఆ మాటలు చెప్పే విధానం మనకు నవ్వు తెప్పిస్తుంది. అలా నడుస్తూ వెళ్తుడుండగా వెంటనే ఒక తాడుతో కట్టిన వలన వచ్చి హీరోని సడన్‌గా పైకి లాక్కెల్లిపోతుంది. వల చుట్టూ తన లాగే పైకి వచ్చిన వలలు ఉంటాయి. అందులో మొత్తం చనిపోయిన శవాల పుర్రెలు, ఎముకలు, అన్నీ కలేబరాలే కనిపిస్తాయి. ఎలా కిందకు దిగేది అని శోభన్ ఆలోచన చేస్తుండగా ఎదురుగా ఒక మండుతున్న మంటల వెలుతురులోంచి ఒక రకమైన కట్టెకు పదునైన ఇనుప ముల్లు తన మీదకి వస్తున్నట్టుగా చూపిస్తూ అక్కడితో ఒక థ్రిల్లింగ్ ఇంట్రెస్ట్ మరియు ఒక రకమైన భయాన్ని కలిగిస్తూ గ్లింప్స్ ముగుస్తుంది.
హీరోయిన్‌గా నయన్ సారిక
ఇది ఒక పాంటసీ, హారర్ అండ్ కామెడీ ఆధారంగా తీసిన సినిమాగా తెలుస్తోంది. సంగీత్ శోభన్ ఎంత మంచి హాస్యాన్ని పండించగలడో మ్యాడ్ సినిమాలో మనం అందరం చూశాము. కాబట్టి ఈ చిత్రంలో అంతే నటనను కనబరుస్తాడని అర్థమవుతోంది. ఇక ఇతర నటీనటుల విషయానికి వస్తే హీరోయిన్‌గా నయన్ సారిక చేస్తుండగా, బ్రహ్మాజీ, తనికెళ్ళ భరణి, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను లాంటివారు కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
రిలీజ్ ఎప్పుడంటే?
ఈ చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సల్ ఇద్దరు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనుదీప్ దేవ్ సంగీతం సమకూర్చారు. 03 ఏప్రిల్ 2026న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా ఓటీటీకి సంబంధించిన రైట్స్ నెట్‌ఫ్లిక్స్ మరియు జీ5 దక్కించుకున్నట్టుగా సమాచారం. నిహారికకు చెందిన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ సంస్థ పది సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆ సందర్భంగా ఈ మధ్య దానికి సంబందించిన వేడుకలు కూడా జరిగాయి.
డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు. ప్రముఖ విశ్వ విద్యాలయం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో MA తెలుగు చేశారు. తాజా సినిమా, పాలిటిక్స్, నేషనల్, స్పోర్ట్స్‌కు సంబంధించిన వార్తలతో పాటు ప్రత్యేకమైన కథనాలు రాస్తారు. డిజిటల్ కంటెంట్ రైటర్‌గా సంవత్సరం అనుభవం కలిగి ఉన్నారు. ఈయనకు పాటలు, కవితలు, షార్ట్ ఫిలిమ్స్ వంటివాటికి మాటలు రాసే అలవాటు ఉంది. సహజంగా జానపద, సినిమా పాటలు గాయకుడు.






