ఇండియన్ మోటార్ సైకిల్ కంపెనీ తన 125వ యానివర్సరీ సందర్భంగా.. 2026 చీఫ్ వింటేజ్ పేరుతో బైక్ ఆవిష్కరించింది. ఈ లేటెస్ట్ బైక్ 1940 కాలం నాటి ఐకానిక్ చీఫ్ మోడల్స్ నుంచి ప్రేరణ పొందింది. అయితే ఇది క్లాసిక్ అమెరికని స్టైలింగ్ పొందటమే కాకుండా.. మంచి పర్ఫామెన్స్, టెక్నాలజీ వంటి వాటిని పొందుతుంది.
దశాబ్దాల నాటి ప్రేరణ
కొత్త చీఫ్ వింటేజ్ బైక్ దాని పూర్వీకుల వారసత్వాన్ని నిలుపుకోవడం మాత్రమే కాకుండా.. నేటి రైడర్లను ఆకట్టుకునేలా డిజైన్ పొందింది. ఇది అసలైన 1940లలో మార్కెట్లో అమ్ముడైన అసలైన ఇండియన్ చీఫ్ బైక్ నుంచి ప్రేరణ పొందింది. ఇందులో ఫ్రంట్ ఫెండర్లు, లిట్ హెడ్‌డ్రెస్ ఆర్నమెంట్, వైర్ స్పోక్ వీల్స్, వింటేజ్ స్టైల్ సీటు మొదలైనవి ఉన్నాయి. రియర్ సబ్‌ఫ్రేమ్, క్లాసిక్ హ్యాండిల్‌బార్లు ఓల్డ్ మోడల్ బైకును గుర్తుకు తెస్తాయి.
కొత్త స్టైలింగ్!
డిజైన్ మాత్రమే కాకుండా.. ఇంజిన్ ఫినిషింగ్ మీద కూడా కంపెనీ శ్రద్ద చూపింది. థండర్ స్ట్రోక్ ఇంజిన్ సిల్వర్ పెయింటెడ్ సిలిండర్ హెడ్స్, పుష్ రాడ్ ట్యూబ్లతో కూడిన బ్లాక్ సిలిండర్లను ఈ బైకులో చూడవచ్చు. ఇది ఒకప్పుడు.. ప్రారంభంలో భారతదేశంలోని మోటార్ సైకిళ్లలో కనిపించే స్టైలింగ్.
ఇంజిన్ డీటెయిల్స్
1940 నాటి ఇండియన్ చీఫ్ బైక్ అమెరికన్ ఆటోమొబైల్ చరిత్రలో ఓ ప్రత్యేకమైన గుర్తింపు పొందింది. ఇప్పుడు దాని ప్రేరణతో మార్కెట్లో లాంచ్ అయిన 2026 చీఫ్ బైక్.. తప్పకుండా చాలామంది బైక్ ప్రేమికులను ఆకట్టుకుంటుందని సమాచారం. ఇందులో ఎయిర్ కూల్డ్ థండర్ స్ట్రోక్ 116 వీ-ట్విన్ ఇంజిన్ ఉంటుంది. ఇది 156 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి ఇది దూర ప్రయాణాలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఫీచర్స్ ఇలా..
2026 చీఫ్ బైక్.. టూర్, స్టాండర్డ్, స్పోర్ట్స్ అనే మూడు రైడింగ్ మోడ్స్ పొందుతుంది. రైడర్ తమ రైడింగ్ ప్రాధాన్యతను బట్టి త్రాటల్ రెస్పాన్స్ అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బైకులో లేటెస్ట్ ఎలక్ట్రానిక్స్ పొందుతుంది. ఇందులో రైడ్ కమాండ్ సిస్టం ద్వారా పవర్ ఇచ్చే 101 మిమీ రౌండ్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే ఉండటం చూడవచ్చు. రైడర్లు యాప్ ఎన్‌హాన్స్‌డ్ న్యావిగేషన్ కూడా ఉపయోగించవచ్చు. ఇది గూగుల్ మ్యాప్స్, యాపిల్ మ్యాప్స్ వంటి స్మార్ట్‌ఫోన్ యాప్‌ల నుంచి నేరుగా మోటార్‌సైకిల్ డిస్‌ప్లేకి కనెక్ట్ చేస్తుంది.
టర్న్ బై టర్న్ న్యావిగేషన్, రైడ్ డేటా, మ్యూజిక్ కంట్రోల్, బ్లూటూత్ లేదా యూఎస్బీ ద్వారా ఫోన్ కనెక్టివిటీ వంటి ఫీచర్స్ 2026 చీఫ్ బైకులో ఉన్నాయి. కాగా కంపెనీ ఈ బైక్ ధరలను ఇంకా వెల్లడించలేదు. అంతే కాకుండా ఇది.. ఎప్పుడు మార్కెట్లోకి అమ్మకానికి వస్తుందనే విషయాన్ని సంస్థ వెల్లడించలేదు.
లిమిటెడ్ ఎడిషన్‌గా వస్తుందా?
ఒక కంపెనీ విజయాలకు గుర్తుగా వాహనాలను లాంచ్ చేయడం ఇదేమి కొత్త కాదు. ఇప్పటికే చాలా సంస్థలు తమ వారసత్వాలకు నిదర్శనంగా బైకులు, కార్లను లాంచ్ చేశాయి. ఇవన్నీ చాలా వరకు లిమిటెడ్ ఎడిషన్ రూపంలోనే అందుబాటులోకి వవచ్చాయి. అయితే ఇప్పుడు ఇండియన్ మోటార్ సైకిల్ ఆవిష్కరించి బైక్.. ఎన్ని యూనిట్లు అమ్మకానికి రానుంది అనే విషయాలు తెలియాల్సి ఉంది.
హిమాన్షు కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, సినీ రంగాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలను అందిస్తున్నారు. గతంలో ఆయన ఏపీ, తెలంగాణకు సంబంధించిన ఆసక్తికర వార్తలు, రాజకీయాలు, క్రికెట్ వార్తలు రాశారు. హైపర్ లోకల్ న్యూస్ రైటింగ్‌లో అనుభవం కలిగిన ఆయన వీడియో టీమ్‌తో కూడా పని చేసిన అనుభవం కలిగి ఉన్నారు. జర్నలిజం రంగంలో 14 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆయన ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయాలు, క్రీడలు, సినిమా రంగాలకు సంబంధించిన ఆర్టికల్స్ రాశారు.






