భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్ పెరిగిపోతున్నాయి. యూపీఐ (ఫోన్‌పే, గూగుల్ పే మొదలైనవి) అందుబాటులోకి వచ్చిన తరువాత జేబులో డబ్బులు పెట్టుకునే అలవాటే దాదాపు మారిపోయిందని చెప్పాలి. పాన్ షాప్ అయినా.. పెద్ద షాపింగ్ మాల్స్ అయినా మొత్తం ఆన్‌లైన్ ట్రాన్సక్షన్ చేసేస్తున్నారు. ఒకవేళా డబ్బులు ఇస్తే.. చిల్లరకు సంబంధించిన సమస్యలు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కొత్త ప్రణాళిక రచించింది.
ఏటీఎంల ద్వారా.. చిన్న నోట్లు!
ఇప్పటి వరకు ఏటీఎంలలో 500 రూపాయలు, 200 రూపాయలు, 100 రూపాయల నోట్ల మాత్రమే అందుబాటులో ఉండేవి. అంటే మనం ఏటీఎం నుంచి డబ్బు తీసుకునే తప్పక చాలా వరకు రూ. 500 నోట్లే వచ్చేవి. చాలా అరుదుగా లేదా తక్కువ ఏటీఎంలలో మాత్రమే ఈ 200, 100 రూపాయల నోట్లు వచ్చేవి. ఇప్పుడు చిల్లర సమస్యలను తీర్చడానికి ప్రభుత్వం చిన్న కరెన్సీ నోట్లను (రూ.50, రూ.20, రూ.10) ఏటీఎంల ద్వారా అందించనుంది.
ముంబైలో ఫైలెట్ ప్రాజెక్ట్!
చిన్న నోట్లను ఏటీఎం ద్వారా అందించడానికి ప్రభుత్వం.. ముంబైలో ఓ ఫైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభించింది. ఇది సక్సెస్ అయితే.. త్వరలోనే దేశ వ్యాప్తంగా ఏటీఎంలలో చిన్న కరెన్సీ నోట్లు అందుబాటులోకి వస్తాయి. ఇదే జరిగితే ప్రజలకు చిల్లర కష్టాలు తీరినట్లే అవుతుంది.
ముంబైలో ఈ కొత్త ప్రాజెక్టు కింద స్థానిక మార్కెట్స్, రైల్వే స్టేషన్స్, బస్ డిపో, హాస్పిటల్స్, ప్రభుత్వ కార్యాలయాల సమీపంలో ఏటీఎంలను ఏర్పాటు చేసి.. చిన్న నోట్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అంతే కాకుండా పెద్ద నోట్లను మార్చుకోవడానికి కూడా ప్రభుత్వం వెసులుబాటు కల్పించడానికి సిద్ధమవుతోంది. అంటే.. పెద్ద నోట్లను సులభంగా మార్చుకోవడానికి మార్గం ఏర్పాటు చేస్తోందన్నమాట.
నిజానికి టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా.. కొన్ని అవసరాలను రీప్లేస్ చేయడం చాలా కష్టమనే చెప్పాలి. భారతదేశంలో డిజిటల్ చెల్లింపులు అందుబాటులోకి వచ్చిన మాట వాస్తవమే.. కానీ ఇప్పటికీ కొన్ని మారుమూల ప్రాంతాల్లో డిజిటల్ చెల్లింపులు అంతగా అందుబాటులో లేదు. అంతెందుకు.. సిటీలలో కూడా కొన్ని పెట్రోల్ బంకులలో కూడా డిజిటల్ చెల్లింపులకు అనుమతి లేదు. ఇలాంటి సమయంలో డబ్బు తప్పకుండా అవసరం అవుతుంది.
నగదు ముఖ్యమే!
డిజిటల్ చెల్లింపుల వల్ల లెక్కకు మించిన మోసాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో డిజిటల్ చెల్లింపులను అనుమతించరు. ఇలాంటి సమయంలో డబ్బు ఇవ్వడం తప్పా.. ప్రజలకు వేరే మార్గం లేదు. కాబట్టి ప్రజలు దీనికి అనుగుణంగా మారిపోవాలి.
ఇది కాకుండా.. చాలామంది రోజువారీ కూలీలు, వీధి వ్యాపారులు, చిన్న దుకాణదారులు, ప్రయాణికులు కూడా తమ రోజువారీ అవసరాల దృష్ట్యా నగదుపైనే ఆధారపడతారు. ఇలాంటి వారు చిల్లర కోసం కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. ప్రభుత్వం చిన్న కరెన్సీ నోట్లను అందించే ఏటీఎంలను విరివిగా అందుబాటులోకి తెస్తే.. ఇబ్బందులు తొలగిపోతాయి.
గతంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు.. తమ రాష్ట్రాలలో చిన్న నోట్లకు కొరత ఏర్పడిందని, దానికి ప్రభుత్వం పరిష్కారం చూపించాలని వెల్లడించాయి. ఆ సమస్యకు చెక్ పెట్టడానికి ప్రభుత్వం ఇప్పుడు సంకల్పించింది. బహుశా దేశంలో.. త్వరలోనే చిన్న నోట్లు అందించే ఏటీఎంలు అందుబాటులోకి రానున్నాయి. సమస్య కూడా తొలగిపోనుంది.
న్యూస్, మీడియా రంగంలో 12 సంవత్సరాల అనుభవం గల సీనియర్ ప్రొఫెషనల్. అనేక ప్రసిద్ధ తెలుగు టీవీ చానెల్స్‌లో పని చేశారు. ఇప్పటివరకు అనేక వ్యాసాలు, కథనాలు, అలాగే డిజిటల్ కంటెంట్ రచనలు చేయడంలో విశేష అనుభవం ఉంది. డిజిటల్ మార్కెటింగ్, తెలుగు కంటెంట్ సృష్టిలో నైపుణ్యం ఉన్న మహేష్, క్రియేటివ్, ఆకర్షణీయ, సమాచారపరమైన కంటెంట్ రూపకల్పనలో ప్రత్యేకత కలిగిన వ్యక్తి.