ప్రతియేటా భారతదేశంలో లెక్కకు మించిన కంపెనీలు.. లెక్కకు మించిన కార్లను లాంచ్ చేస్తూనే ఉన్నాయి. కొత్త కార్లు కొనేవారు ఎంతమంది ఉన్న.. ఇండియన్ మార్కెట్లో కొన్ని కార్లకు మాత్రం ఎప్పుడూ డిమాండ్ అలాగే అలాగే ఉంది. ఈ జాబితాలో మారుతి డిజైన్, హ్యుందాయ్ ఆరా, హోండా అమేజ్, ఫోక్స్‌వ్యాగన్ వర్టస్, హోండా సిటీ మోడల్స్ ఉన్నాయి. ఈ కథనంలో వీటికి మాత్రమే ఎందుకు ఎక్కువ డిమాండ్?, వీటి ధరలు ఎలా ఉన్నాయనే విషయాలు వివరంగా చూసేద్దాం.
మారుతి సుజుకి డిజైన్
దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన సెడాన్లలో ఒకటైన మారుతి డిజైర్.. 2025లో 19072 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. కేవలం 6.25 లక్షల రూపాయల ప్రారంభ ధర వద్ద అందుబాటులో ఉన్న ఈ కారు.. సన్‌రూఫ్, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్స్ పొందుతుంది. మంచి డిజైన్ కలిగిన ఈ కారు.. పెట్రోల్ ఇంజిన్ ఎపికలో మాత్రమే కాకుండా సీఎన్‌జీ రూపంలో కూడా అందుబాటులో ఉంది. దీని మైలేజ్ 24.79 కిమీ అని తెలుస్తోంది.
హ్యుందాయ్ ఆరా
రూ. 5.99 లక్షల (ఎక్స్ షోరూమ్) ధర వద్ద అందుబాటులో ఉన్న.. హ్యుందాయ్ ఆరా భారతదేశంలో ఎక్కువమంది కొనుగోలు చేస్తున్న మోడల్. ఈ కారు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఎంపికలో మాత్రమే కాకుండా.. సీఎన్‌జీ రూపంలో కూడా అందుబాటులో ఉంది. ఇది మాన్యువల్, ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలో లభిస్తోంది. 37 కేజీల కెపాసిటీ కలిగిన సీఎన్‌జీ ట్యాంక్ కలిగిన ఈ మోడల్.. మంచి మైలేజ్ కూడా అందిస్తుంది. 2025 డిసెంబర్ నెలలో కంపెనీ దీనిని 4925 యూనిట్లు విక్రయించింది.
హోండా అమేజ్
ఎక్కువమంది కొనుగోలుదారులు ఇష్టపడి కొనుగోలు చేస్తున్న కార్ల జాబితాలో.. హోండా కంపెనీకి చెందిన అమేజ్ కూడా ఉంది. దీని ప్రారంభ ధర రూ. 7.48 లక్షలు (ఎక్స్ షోరూమ్). అమేజ్ కారు.. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఎంపికలో అందుబాటులో ఉంది. డిసెంబర్ 2025లో కంపెనీ మొత్తం 2575 అమేజ్ కార్లను విక్రయించింది. ఇది రోజువారీ వినియోగానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ధర కూడా కొంత తక్కువ కావడంతో ఆల్ టైమ్ బెస్ట్ సెల్లింగ్ మోడల్ క్రెడిట్ దక్కించుకుంది.
ఫోక్స్‌వ్యాగన్ వర్టస్
ధర కొంచెం ఎక్కువే అయినప్పటికీ.. ఫోక్స్‌వ్యాగన్ కంపెనీకి చెందిన వర్టస్ కారు ఎక్కువ అమ్మకాలు పొందుతున్న ఒక మోడల్. సంస్థ 2025 డిసెంబర్ నెలలో 2378 యూనిట్లను విక్రయించింది. దీని ప్రారంభ ధర రూ. 10.50 లక్షలు (ఎక్స్ షోరూమ్). మంచి పనితీరును అందించడం మాత్రమే కాకుండా.. సేఫ్టీలో ఫైవ్ స్టార్ రేటింగ్ పొందటం వల్ల ఎక్కువమంది దీనిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇది 1.5 లీటర్ టర్బో పెట్రోల్, 1.0 లీటర్ టీఎస్ఐ ఇంజిన్ ఎంపికలతో లభిస్తుంది.
హోండా సిటీ
2025 డిసెంబర్ నెలలో 943 యూనిట్ల అమ్మకాలను పొందిన హోండా సిటీ.. ఎక్కువమందికి ఇష్టమైన మోడల్. దీని ప్రారంభ ధర రూ. 11.95 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ సెడాన్ 1.5 లీటర్ ఇంజిన్ ద్వారా మంచి పనితీరును అందిస్తుంది. మాన్యువల్, సీవీటీ ట్రాన్స్‌మిషన్ ఎంపికలలో ఇది అందుబాటులో ఉంది. డిజైన్, ఫీచర్స్ అన్నీ కూడా వాహన వినియోగదారులకు కావలసిన విధంగా ఉన్నాయి.
ఉమశ్రీ చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ట్రెండింగ్ అంశాలు, వివిధ విభాగాలపై ప్రత్యేక కథనాలను రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, సైన్స్ & టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, పాలిటిక్స్ తదితర రంగాలకు సంబంధించిన విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో ఆయనకు 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.