బైక్ రైడ్ చేసే ప్రతి ఒక్కరూ ఆరు అడుగుల ఆజానుబాహులు కావలసిన అవసరం లేదు. పొట్టి వాళ్లు కూడా ఉంటారు. అలాంటి పొట్టివాళ్లకు సరిపోయే బైకులు కూడా మార్కెట్లో చాలానే ఉన్నాయి. ఈ కథనంలో సీటు హైట్ తక్కువగా ఉన్న టాప్ 5 బైకుల గురించి తెలుసుకుందాం.
జావా 42
సీటు ఎత్తు తక్కువగా ఉన్న బైకుల జాబితాలో చెప్పుకోదగ్గది, ప్రధానమైనది జావా 42. కేవలం 740 మిమీ ఎత్తు సీటు కలిగిన ఈ బైక్.. మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. రూ. 2 లక్షల ఖరీదైన ఈ బైక్.. మిడ్ సెట్ ఫుట్‌పెగ్‌లను పొందుతుంది. ట్రాఫిక్‌లో కూడా ఇది సజావుగా ముందుకు సాగుతుంది. డిజైన్ కూడా ఇతర బ్రాండ్ బైకుల కంటే కొంత భిన్నంగా ఉంటుంది. అత్యాధునిక ఫీచర్స్ లభిస్తాయి.
టీవీఎస్ రైడర్
రైడర్ 125 బైక్.. బైక్ రైడర్లకు చాలా అనుకూలంగా ఉంటుంది. దీని సీటు ఎత్తు 780 మిమీ. టీవీఎస్ కంపెనీకి చెందిన ఈ బైక్ ధర రూ. లక్ష వరకు ఉంటుంది. తక్కువ ఎత్తైన సీటును మాత్రమే కాకుండా.. ఈ బైక్ నిర్మాణం కూడా చాలా తేలికగా ఉంటుంది. సీటు హైట్ కొంత తక్కువగా ఉండటం వల్ల.. బెస్ట్ రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. రోజువారీ వినియోగానికి ఉపయోగకరంగా ఉంటుంది. దీనిని హ్యాండిల్ చేయడం కూడా సులభమే.
రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350
మీటియోర్ 350 బైక్.. రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ లాంచ్ చేసిన పాపులర్ మోడల్. తక్కువ ఎత్తు కలిగిన సీటును కలిగిన టూ వీలర్. 765 మిమీ ఎత్తు కలిగిన సీటు ఇందులో లభిస్తుంది. పొట్టి సీటు కలిగినప్పటికీ.. పనితీరు మాత్రం అద్భుతంగా ఉంటుంది. ముందు వైపు అమర్చిన ఫుట్‌పెగ్‌లు నిటారుగా ఉండే హ్యాండిల్‌బార్ అన్నీ కూడా మంచి రైడింగ్ పొజిషన్ అందిస్తాయి. రోజువారీ వినియోగానికి మాత్రమే కాకుండా లాంగ్ రైడ్ చేయడానికి కూడా ఇది అనుకూలంగా ఉంటుంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350
తక్కువ సీటు ఎత్తు కలిగిన మరో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్.. ఈ క్లాసిక్ 350. దీని సీటు ఎత్తు 750 మిమీ. ఫ్లాట్ సీటు కలిగి ఉండటం వల్ల.. లాంగ్ రైడ్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. దీని ధర సుమారు రూ. 2 లక్షలు. ఆకట్టుకునే డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల.. ఇది చాలామంది కొనుగోలుదారులను ఆకట్టుకోవడంలో సక్సెస్ సాధించింది. మార్కెట్లో కూడా ఎక్కువ సేల్స్ పొందిన బైకుల జాబితాలో ఇది కూడా ఒకటి కావడం గమనార్హం.
కవాసకి వల్కాన్ ఎస్
వల్కాన్ ఎస్ బైక్ గురించి కూడా దాదాపు అందరికీ తెలుసు. కవాసకి కంపెనీకి చెందిన ఈ టూవీలర్.. సీటు ఎత్తు 705 మిమీ. ఇది చూడటానికి కొంచెం భిన్నంగా ఉన్నప్పటికీ.. మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుందని మాత్రం చెప్పవచ్చు. క్రూయిజర్ స్టైల్ డిజైన్.. భూమికి దగ్గరగా ఉన్న ఫుట్‌పెగ్‌లు అన్నీ కూడా రైడర్లకు చాలా అనుకూలంగా ఉంటాయి. వీల్‌బేస్ కొంత పొడవుగా ఉంటుంది.
ఇండియన్ మార్కెట్లో కొంత హైట్ సీటు కలిగిన బైకుల జాబితాలో జావా 42, రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350, మీటియోర్ 350, కవాసకి వల్కాన్ ఎస్ మాత్రమే కాకుండా.. బజాజ్ అవెంజర్, టీవీఎస్ రోనిన్ బైకులు కూడా ఉన్నాయి.
హిమాన్షు – నేను MarthaTelugu వెబ్సైట్లో ఒక సంవత్సర కాలంగా పనిచేస్తున్నాను. నాకు ప్రత్యేకించి స్పోర్ట్స్ వార్తలు రాయడంలో అనుభవం ఉంది. జర్నలిజం రంగంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన నేను.. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయాలు, క్రీడలు, సినిమా రంగాలకు సంబంధించిన ఆర్టికల్స్ రాశారు.
