టాలీవుడ్‌లో సంచలనం.. వెంకటేష్‌తో కీర్తి సురేష్ జోడీ?

టాలీవుడ్‌ చిత్ర సీమలో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ గురించి చర్చలు జోరుగా సాగుతున్నాయి. హీరో వెంకటేష్ & దర్శకుడు అనిల్ రావిపూడి కలయికలో తెరకెక్కబోయే కొత్త సినిమాలో.. హీరోయిన్‌గా కీర్తి సురేష్ నటించే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. 2027 సంక్రాంతికి విడుదలయ్యే ఈ సినిమాపై చర్చలు జరుగుతున్నప్పటికీ.. అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.

అనుకున్న విధంగా.. ఈ సినిమా తెరకెక్కితే అది వెంకటేష్-అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఐదో సినిమా అవుతుంది. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన F2 వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించాయి. అందుకే ఈ కొత్త ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

వెంకటేష్–అనిల్ రావిపూడి హిట్ కాంబినేషన్

టాలీవుడ్‌లో విజయవంతమైన దర్శకుడు రావిపూడిలు, హీరో వెంకటేష్ కాంబినేషన్‌ చాలా ప్రత్యేకం అనే చెప్పాలి. ఈ జంట కలిసి చేసిన సినిమాలు వినోదాత్మకంగా ఉండటంతో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాయి. ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, కొత్త సినిమా పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో మరో కీలక పాత్రలో నటుడు కళ్యాణ్ రామ్ కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి.

ప్రస్తుతం వెంకటేష్.. త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ”ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47” సినిమాలో బిజీగా ఉన్నారు. ఆ సినిమా పూర్తయ్యాక అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.

హీరోయిన్‌గా కీర్తి సురేష్!

అనిల్ రావిపూడి, వెంకటేష్ సినిమాలో హీరోయిన్‌గా కీర్తి సురేష్ పేరు బలంగా వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకారమా వెలువడలేదు. దీనికి సంబంధించిన చర్చలు కొనసాగుతున్నాయని, ఇంకా ఈ విషయం ఒక కొలిక్కి రాలేదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

కీర్తి సురేష్ గతంలో చేసిన సినిమాలతో.. మంచి నటిగా గుర్తింపు పొందింది. ఆమె చివరిసారిగా బాలీవుడ్ నటుడు వరుణ్ ధవన్‌తో కలిసి నటించిన ”బేబీ జాన్” సినిమాలో కనిపించింది. ఇప్పుడు వెంకటేష్ సరసన నటిస్తే అది ప్రేక్షకులకు కొత్త జోడీగా, మరింత కనువిందు చేసే అవకాశం ఉంది.

సంక్రాంతి రిలీజ్‌పై అంచనాలు

నిజానికి సంక్రాంతి సీజన్ అనేది.. టాలీవుడ్‌కు చాలా కీలకమైన సమయం. పెద్ద సినిమాలు సైతం ఎక్కువగా ఈ పండుగ సమయంలోనే రిలీజ్ అవుతాయి. అందుకే వెంకటేష్-అనిల్ రావిపూడి కొత్త సినిమా కూడా సంక్రాంతి 2027 విడుదలగా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

ఇంతకుముందు వెంకటేష్ అనిల్ రావిపూడి సినిమాల్లో.. తమన్నాతో F2లో రొమాన్స్ చేయగా, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఐశ్వర్య రాజేష్ & మీనాక్షి చౌదరితో కలిసి నటించారు. ఇప్పుడు కొత్త సినిమాలో కీర్తి సురేష్ జోడీగా వస్తే అది మరో కొత్త కాంబినేషన్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్‌లో పెద్ద హీరోలు కూడా ఉండే అవకాశం ఉందని సమాచారం. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా వినోదం, భావోద్వేగం కలిసిన కథను సిద్ధం చేస్తున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

అయితే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. కానీ.. వెంకటేష్-అనిల్ రావిపూడి కాంబినేషన్ మరోసారి తెరపైకి రాబోతుందనే వార్తే అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది. కీర్తి సురేష్ ఈ ప్రాజెక్ట్‌లో చేరుతుందా?, లేదా? అనే విషయంపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశముంది.

Also Read: అల్లు అర్జున్ ఇంటికి కొత్త లగ్జరీ కారు – వైరల్ వీడియో