భారతంలో Renault Bridger ఆవిష్కరణ – SUV మార్కెట్‌లో సవాలు

ఫ్రాన్స్‌కు చెందిన ఆటోమొబైల్ కంపెనీ Renault.. భారత మార్కెట్ కోసం కొత్తగా రూపొందించిన Renault Bridger concept SUVను ఆవిష్కరించింది. ప్రస్తుతం షోకార్‌గా ఉన్న ఈ మోడల్ ఉత్పత్తి దశకు దగ్గరగా ఉందని కంపెనీ వెల్లడించింది. ఈ SUV ప్రొడక్షన్ వెర్షన్‌ను 2027 చివరి నాటికి భారతదేశంలోనే మొదట లాంచ్ చేయనున్నట్లు Renault ప్రకటించింది.

రెనాల్ట్ కొత్త కారు

Renault భారత మార్కెట్లో తన SUV పోర్ట్‌ఫోలియోను విస్తరించే లక్ష్యంతో Renault Bridger conceptను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న Kiger SUV ఆశించిన స్థాయిలో అమ్మకాలు సాధించకపోవడంతో, ఈ మోడల్‌ను రూపొందించినట్లు సమాచారం. ముఖ్యంగా ప్రీమియం SUV సెగ్మెంట్‌లో ప్రాచుర్యం పొందుతున్న బాక్సీ (boxy) డిజైన్‌ను Renault Bridgerలో ఉపయోగించారు.

భారతదేశంలో ప్రస్తుతం sub-4 metre SUV సెగ్మెంట్ మంచి ఆదరణ పొందుతోంది. ప్రస్తుతం ఈ విభాగంలో Tata Nexon, Maruti Suzuki Brezza, Hyundai Venue, Kia Sonet వంటి మోడళ్లు పోటీపోటీగా అమ్ముడవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో Renault Bridgerను కంపెనీ Mini Duster తరహాలో కారును కారును లాంచ్ చేయడానికి సిద్ధమైంది.

లేటెస్ట్ బాక్సీ డిజైన్

Renault Bridger కారులో చెప్పుకోదగ్గ ఆకర్షణ దాని బాక్సీ డిజైన్. ఇటీవలి కాలంలో అనేక SUV బ్రాండ్లు ఇదే స్టైల్‌ను అనుసరిస్తున్నాయి. ఈ ట్రెండ్‌ను దృష్టిలో ఉంచుకుని Renault కూడా అదే మార్గాన్ని ఎంచుకుంది. Bridger ముందు భాగంలో ఆకర్షణీయమైన LED హెడ్‌లైట్లు ఉన్నాయి.

ప్రస్తుతం అనేక SUVల్లో కనిపించే split-headlight డిజైన్‌కు భిన్నంగా, Renault ఒకే హౌసింగ్‌లో హెడ్‌లైట్ & DRLలను అమర్చింది. DRLలు బ్రౌ ఆకారంలో ఉండటం వలన ముందు భాగం ప్రత్యేకంగా కనిపిస్తుంది. ముందు గ్రిల్‌పై illuminated Renault wordmark ఉండటం ఈ కాన్సెప్ట్ మోడల్‌కు ప్రత్యేకత. బంపర్‌పై సిల్వర్ ఫినిష్‌తో స్కిడ్ ప్లేట్ తరహా స్టైలింగ్ ఎలిమెంట్ కూడా కనిపిస్తుంది.

ఈ కాన్సెప్ట్ SUVకు Beige Dune Satin కలర్ ఫినిష్ ఇవ్వగా, బోనెట్ & రూఫ్ గ్లోస్ బ్లాక్ రంగులో ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్‌లో చూసినప్పుడు Bridger ఒక mini Defender తరహా SUVగా కనిపిస్తుంది. ఇది 18-inch అలాయ్ వీల్స్ పొందుతుంది. సుమారు 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ లభిస్తుంది. బాడీ ప్యానెల్స్‌లో ఉన్న మస్క్యులర్ డిజైన్ SUVకు మంచి లుక్‌ను ఇస్తుంది. వెనుక భాగంలో టెయిల్‌గేట్‌పై అమర్చిన స్పేర్ వీల్ ఈ మోడల్‌కు సంప్రదాయ SUV స్టైల్‌ను అందిస్తుంది.

ఇంటీరియర్ & ఫీచర్స్ డీటెయిల్స్

Renault ఇంకా Bridger ఇంటీరియర్ ఫోటోలు విడుదల చేయలేదు. అయితే కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ SUVలో 400 లీటర్ల బూట్ స్పేస్ ఉండనుంది. అదేవిధంగా వెనుక సీట్లలో ప్రయాణించే వారికి 200 మీమీ క్నీ రూమ్ అందించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇది ఈ సెగ్మెంట్‌లో అత్యుత్తమ స్థలం అవుతుందని Renault పేర్కొంది.

Renault Bridger అనేది Renault Global Modular Platform (RGMP)పై రూపొందించబడింది. ఇదే ప్లాట్‌ఫారమ్ కొత్త Duster SUVలో కూడా ఉపయోగించారు. అయితే Bridger కోసం దీనిని కొంచెం చిన్నగా రూపొందించారు. ఈ SUV మొత్తం పొడవు సుమారు 3,995 మిమీ ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ బాడీ డిజైన్ కారణంగా లోపల ఎక్కువ స్థలం లభించేలా రూపొందించారు.

ఇంజిన్ ఆప్షన్స్ ఇలా..

Renault Bridgerను కంపెనీ True Multi-Energy Modelగా పరిచయం చేయాలని భావిస్తోంది. అంటే ఈ SUVలో పలు రకాల పవర్‌ట్రెయిన్ ఎంపికలు ఉండనున్నాయి. సాధారణ పెట్రోల్ వెర్షన్‌లో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉండే అవకాశం ఉంది. అదనంగా కంపెనీ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ ఎంపికలో లభించే అవకాశం ఉంది. భవిష్యత్తులో Renault Bridger EVను కూడా భారత మార్కెట్లో లాంచ్ అవుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

అమ్మకాల్లో గట్టి పోటీ తప్పదా?

Renault Bridger ప్రొడక్షన్ మోడల్ కంపెనీ భారత లైనప్‌లో Kiger కంటే పై స్థాయిలో, కానీ కొత్త Duster కంటే కింద స్థాయిలో ఉండనుంది. ఈ SUV నేరుగా టాటా నెక్సాన్, మారుతి బ్రెజ్జా, మారుతి XUV 3XO, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ కార్లకు ప్రత్యర్థిగా ఉంటుంది. అదేవిధంగా భవిష్యత్తులో Mahindra తీసుకురాబోయే Vision S SUVతో కూడా పోటీ ఉండే అవకాశం ఉంది. కాబట్టి కొత్త రెనాల్ట్ కారు అమ్మకాల్లో గట్టి పోటీని ఎదుర్కునే అవకాశం ఉంది.

Also Read: కారుకు రెడ్ కలర్ నెంబర్ ప్లేట్.. ఎందుకో తెలుసా?