భారత్‌లో ఈ నెలలో గోల్డ్, సిల్వర్ ధరలు భారీగా పడిపోయాయి. బంగారం ధర దాదాపు 20% తగ్గగా, వెండి ధర 33% వరకు క్షీణించింది. దీంతో ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన లాభాలు పూర్తిగా ఆవిరైపోయాయి. మార్కెట్ నిపుణుల ప్రకారం.. 1980 మార్చి తర్వాత ఇదే మొదటిసారి ఇంత పెద్ద స్థాయిలో గోల్డ్, సిల్వర్ పతనం నమోదు కావడం గమనార్హం అని తెలుస్తోంది.
గత కొన్నేళ్లుగా గోల్డ్, సిల్వర్ పెట్టుబడిదారులకు మంచి రాబడులు ఇచ్చాయి. ముఖ్యంగా ఆర్థిక అనిశ్చితి సమయంలో బంగారం “సేఫ్ హేవన్”గా భావించబడుతుంది. అయితే ఇటీవల పరిస్థితులు మారడంతో బులియన్ మార్కెట్‌లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం భారత మార్కెట్‌పై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ గోల్డ్, సిల్వర్ ధరల పతనం పెట్టుబడిదారులు, గృహిణులు మరియు ఆభరణాల కొనుగోలుదారులపై ప్రభావం చూపుతోంది. ఇప్పటికే బంగారం కొనుగోలు చేసిన వారికి నష్టాలు కలిగే అవకాశం ఉండగా, కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ఒక అవకాశంగా మారవచ్చు.
45ఏళ్లలో ఇదే పెద్ద పతనం
మార్కెట్ విశ్లేషకుల ప్రకారం..1980 మార్చి తర్వాత ఇంత భారీగా గోల్డ్, సిల్వర్ ధరలు పడిపోవడం ఇదే తొలిసారి. ఆ సమయంలో బంగారం ధరలు సుమారు 24% పడిపోగా, వెండి ధరలు 41% వరకు తగ్గాయి. ప్రస్తుత పరిస్థితులు కూడా దాదాపు అదే స్థాయిలో మారుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గోల్డ్ 20%, సిల్వర్ 33% తగ్గడం మార్కెట్‌కు పెద్ద సంకేతంగా భావిస్తున్నారు. భారత్‌లో కూడా ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ ధరలు గణనీయంగా తగ్గాయి.
గవర్నమెంట్ బాండ్ల వైపు పెట్టుబడులు
ఈ పతనానికి ప్రధాన కారణంగా గవర్నమెంట్ బాండ్లకు పెరుగుతున్న డిమాండ్ అని నిపుణులు చెబుతున్నారు. భారత్‌తో పాటు అనేక దేశాల్లో 10-ఇయర్ బాండ్ రిటర్న్స్ భారీగా పెరగడం వల్ల పెట్టుబడిదారులు బంగారం నుంచి బాండ్ల వైపు మళ్లుతున్నారు.
సాధారణంగా బంగారం రాబడులు స్థిరంగా ఉండగా, ప్రస్తుతం బాండ్లపై ఎక్కువ వడ్డీ లభించడం వల్ల పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను మార్చుకుంటున్నారు. దీని ప్రభావంగా గోల్డ్, సిల్వర్ ధరలు తగ్గుతున్నాయి. మార్కెట్ నిపుణుల మాటల్లో, “ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టుబడిదారులు రిస్క్ తగ్గించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. అందుకే గోల్డ్ నుంచి బయటకు వచ్చి బాండ్లలో పెట్టుబడులు పెడుతున్నారు” అని తెలిపారు.
కొనుగోలుదారులకు అవకాశం?
ఇప్పటి పరిస్థితుల్లో గోల్డ్, సిల్వర్ ధరలు తగ్గడం కొనుగోలుదారులకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా పెళ్లిళ్లు లేదా పండుగల కోసం బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సరైన సమయం కావొచ్చని వ్యాపారులు చెబుతున్నారు.
అయితే పెట్టుబడిదారులు మాత్రం జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్‌లో ఇంకా అస్థిరత కొనసాగుతున్నందున ధరలు మరింత మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. భారత్‌లో గోల్డ్‌కు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా, ధరలు తగ్గినా డిమాండ్ పూర్తిగా తగ్గే అవకాశాలు తక్కువగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ రోజు గోల్డ్, సిల్వర్ రేటు
బంగారం ధరలు ఈ రోజు (మార్చి 24) కూడా పతనమయ్యాయి. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 140350 (తులం ధర). 22 క్యారెట్ల రేటు రూ.128650 వద్ద (10 గ్రాములు) నిలిచింది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ ధరలు వరుసగా రూ. 2940, రూ. 270 తక్కువ. వెండి విషయానికి వస్తే.. కేజీ సిల్వర్ రేటు రూ.2.40 లక్షలకు చేరింది. మునుపటి ధరలతో పోలిస్తే.. ఈ ధరలు చాలా తగ్గినట్లు అర్థమవుతోంది.
Also Read: క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా.. ఏప్రిల్ 1 కొత్త రూల్స్ రానున్నాయ్!

డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు. ప్రముఖ విశ్వ విద్యాలయం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో MA తెలుగు చేశారు. తాజా సినిమా, పాలిటిక్స్, నేషనల్, స్పోర్ట్స్‌కు సంబంధించిన వార్తలతో పాటు ప్రత్యేకమైన కథనాలు రాస్తారు. డిజిటల్ కంటెంట్ రైటర్‌గా సంవత్సరం అనుభవం కలిగి ఉన్నారు. ఈయనకు పాటలు, కవితలు, షార్ట్ ఫిలిమ్స్ వంటివాటికి మాటలు రాసే అలవాటు ఉంది. సహజంగా జానపద, సినిమా పాటలు గాయకుడు.
