భారత్‌లో LPG కొరత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే.. మంగళవారం “Natural Gas and Petroleum Products Distribution Order, 2026”ను ప్రకటించింది. Petroleum and Natural Gas Regulatory Board అనుమతితో దేశవ్యాప్తంగా గ్యాస్ పైప్‌లైన్ నెట్‌వర్క్ విస్తరణకు మార్గం సుగమం చేసింది. ఈ చర్యతో గృహాలు, పరిశ్రమలకు నిరంతర ఇంధన సరఫరా లక్ష్యంగా పెట్టుకుంది.
దీనిని Essential Commodities Act, 1955 కింద జారీ చేశారు. కాబట్టి ప్రభుత్వం కీలక ఇంధన వనరుల సరఫరాను నియంత్రించే విస్తృత అధికారాలు పొందింది. గ్యాస్ పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, వినియోగదారులకు నిరంతర సరఫరా అందించడం ఈ నిర్ణయానికి ప్రధాన ఉద్దేశ్యం. ఈ నిర్ణయం కేవలం LPG కొరత సమస్యను తగ్గించడమే కాకుండా, భవిష్యత్తులో ఇంధన భద్రతను పెంచే దిశగా కీలక అడుగుగా భావిస్తున్నారు. పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరా పెరగడం వల్ల దిగుమతులపై ఆధారపడటం కూడా తగ్గే అవకాశం ఉంది.
PNG కనెక్షన్లకు ప్రోత్సాహం
కొత్త ఆర్డర్ ప్రకారం నగర గ్యాస్ పంపిణీ (CGD) నెట్‌వర్క్ విస్తరణకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా PNG (Piped Natural Gas) కనెక్షన్లను వేగంగా అందించడంపై దృష్టి పెట్టారు.
హౌసింగ్ సొసైటీలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు (RWAs) గ్యాస్ పైప్‌లైన్ ఏర్పాటుకు మూడు పని దినాల్లో అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. అనుమతి నిరాకరించిన లేదా ఆలస్యం చేసిన సందర్భంలో, మూడు నెలల తర్వాత ఆ ఇళ్లకు LPG సరఫరా నిలిపివేయవచ్చు. అంతే కాకుండా.. వినియోగదారులు PNG కనెక్షన్ కోసం దరఖాస్తు చేయకపోతే కూడా LPG సరఫరా నిలిపివేయవచ్చు. అయితే సాంకేతికంగా పైప్‌లైన్ సాధ్యం కాని ప్రాంతాల్లో ఈ నిబంధన వర్తించదు.
60 పనిదినాల్లో అనుమతులు
ఈ గ్యాస్ పైప్‌లైన్ ఆర్డర్‌లో అనుమతుల ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా మార్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, మున్సిపల్ సంస్థలు నిర్ణీత కాలవ్యవధిలో అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది.
చిన్న ప్రాజెక్టులకు 10 రోజులు, పెద్ద పైప్‌లైన్ ప్రాజెక్టులకు 60 పని దినాల్లో అనుమతులు ఇవ్వాలి. ఈ గడువులో అనుమతి రాకపోతే, అది “డీమ్డ్ క్లియరెన్స్”గా పరిగణించబడుతుంది. అదనంగా అనవసర పన్నులు, చార్జీలు విధించకుండా స్పష్టమైన ఫీజు నిర్మాణాన్ని కూడా ప్రవేశపెట్టారు. “డిగ్ అండ్ పే” లేదా “డిగ్ అండ్ రీస్టోర్” వంటి విధానాలను అమలు చేస్తారు.
బిజినెస్‌కు ఊతం.. వివాదాలకు చెక్!
ఈ ఆర్డర్ ఆయిల్, గ్యాస్ రంగంలో వ్యాపార సౌలభ్యాన్ని పెంచుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అనుమతులు, పరిహారం, భూసంబంధిత సమస్యలపై స్పష్టత ఇవ్వడం ద్వారా వివాదాలు తగ్గుతాయి. ప్రైవేట్ భూముల్లో పైప్‌లైన్ వేయడానికి ముందుగా యజమానులతో ఒప్పందం చేసుకోవాలి. అది సాధ్యం కాకపోతే జిల్లా అధికారుల అనుమతితో ప్రాజెక్ట్ కొనసాగించవచ్చు. భూమి విలువ ఆధారంగా పరిహారం నిర్ణయించబడుతుంది. ఇది వివాదాలను తగ్గించడంలో కీలకంగా ఉంటుంది.
వినియోగదారుల కోసం కీలక చర్యలు
ఈ ఆర్డర్ వినియోగదారుల ప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకుని రూపొందించబడింది. సమయపాలనతో కనెక్షన్లు ఇవ్వడం, వివాద పరిష్కార వ్యవస్థ, స్పష్టమైన నిబంధనలు ఇందులో ఉన్నాయి. అమలును పర్యవేక్షించడానికి Petroleum and Natural Gas Regulatory Boardను నోడల్ ఏజెన్సీగా నియమించారు. మొత్తానికి ఈ గ్యాస్ పైప్‌లైన్ ఆర్డర్ దేశంలో గ్యాస్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసి, LPG కొరతను తగ్గించడంలో కీలక పాత్ర పోషించనుంది.
Also Read: ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేస్తే పూర్తిగా రీఫండ్: కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్!

డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు. ప్రముఖ విశ్వ విద్యాలయం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో MA తెలుగు చేశారు. తాజా సినిమా, పాలిటిక్స్, నేషనల్, స్పోర్ట్స్‌కు సంబంధించిన వార్తలతో పాటు ప్రత్యేకమైన కథనాలు రాస్తారు. డిజిటల్ కంటెంట్ రైటర్‌గా సంవత్సరం అనుభవం కలిగి ఉన్నారు. ఈయనకు పాటలు, కవితలు, షార్ట్ ఫిలిమ్స్ వంటివాటికి మాటలు రాసే అలవాటు ఉంది. సహజంగా జానపద, సినిమా పాటలు గాయకుడు.
