Thalapathy Vijay Assets Affidavit: చెన్నైలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లో బిజీగా మారారు. తాజాగా ఆయన స్థాపించిన టీవీకే పార్టీ తరఫున తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగుతూ నామినేషన్ దాఖలు చేశారు. ఆదివారం అభ్యర్థుల జాబితా విడుదల చేసిన విజయ్, సోమవారం అధికారికంగా నామినేషన్ సమర్పించారు. ఈ సందర్భంగా తన ఆస్తుల వివరాలను అఫిడవిట్‌లో వెల్లడించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
విజయ్(vijay) రాజకీయాల్లోకి రావడం తమిళనాడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సినీ రంగంలో భారీ ఫాలోయింగ్ ఉన్న ఆయన, ఇప్పుడు ప్రజా సేవ వైపు అడుగులు వేయడం గమనార్హం. టీవీకే పార్టీ ద్వారా రాష్ట్రంలోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుండటం రాజకీయ సమీకరణాలను మార్చే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.
నిజానికి తమిళనాడులో సినీ నటులు రాజకీయాల్లోకి రావడం కొత్త విషయం కాదు. కానీ విజయ్ వంటి ప్రస్తుత సూపర్ స్టార్ నేరుగా ఎన్నికల్లో పోటీ చేయడం ప్రజల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ముఖ్యంగా చెన్నైలోని పెరంబూరు, తిరుచ్చి తూర్పు నియోజకవర్గాల నుంచి ఆయన పోటీ చేయడం రాజకీయ వేడిని పెంచింది.
రూ.600 కోట్ల ఆస్తులు.. అఫిడవిట్(Thalapathy Vijay Assets Affidavit)లో వెల్లడి
విజయ్ తన అఫిడవిట్‌లో మొత్తం ఆస్తుల విలువను దాదాపు రూ.600 కోట్లుగా పేర్కొన్నారు. ఇందులో స్థిర, చరాస్తులు రెండూ ఉన్నాయి. నగదు రూపంలో తన వద్ద రూ.2 లక్షలు, తన భార్య సంగీత వద్ద రూ.1 లక్ష ఉన్నట్లు తెలిపారు. బ్యాంక్ ఖాతాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో సుమారు రూ.388 కోట్లు ఉన్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా ఆయన పేరుమీద ఒక్క రూపాయి అప్పు కూడా లేదని అఫిడవిట్‌లో స్పష్టంగా పేర్కొనడం విశేషం.
లగ్జరీ కార్లు – బంగారం, వెండి
- బీఎండబ్ల్యూ 530
- బీఎండబ్ల్యూ ఐ7
- టయోటా లెక్సస్ 350
- టయోటా వెల్‌ఫైర్
- మారుతి సుజుకి స్విఫ్ట్
- టీవీఎస్ ఎక్సెల్ సూపర్
విజయ్ తన వాహనాల వివరాలను కూడా అఫిడవిట్‌లో వెల్లడించారు. వీటి మొత్తం విలువ రూ.14.35 కోట్లు అని పేర్కొన్నారు. అంతే కాకుండా.. ఆయన వద్ద 883 గ్రాముల బంగారం, రూ.15 లక్షల విలువైన వెండి వస్తువులు కూడా ఉన్నట్లు తెలిపారు.
అప్పులు.. ఆసక్తికర వివరాలు
విజయ్ తన కుటుంబ సభ్యులకు ఇచ్చిన అప్పుల వివరాలను కూడా అఫిడవిట్‌లో పొందుపరిచారు.
- భార్య సంగీతకు: రూ.12.60 కోట్లు
- తండ్రి చంద్రశేఖర్‌కు: రూ.3.02 కోట్లు
- తల్లికి: రూ.87.12 లక్షలు
- కుమారుడికి: రూ.8.78 లక్షలు
- కుమార్తె దివ్యకు: రూ.4.6 లక్షలు
- టీవీకే పార్టీలో కీలక నేత అయిన ఎన్ ఆనంద్ కు రూ.3 కోట్లు అప్పుగా ఇచ్చినట్లు వెల్లడించారు.
సంగీత(snageetha) పేరుపై భారీ ఆస్తులు
విజయ్ భార్య సంగీత పేరుమీద కూడా గణనీయమైన ఆస్తులు ఉన్నాయి. ఆమె వద్ద.. రూ.4.07 కోట్ల విలువైన బంగారం, 2 కిలోల వెండి, రూ.1 కోటి విలువైన వజ్రాలు ఉన్నట్లు వెల్లడించారు. సంగీత చరాస్తుల మొత్తం విలువ రూ.15.51 కోట్లు కాగా, స్థిరాస్తులు రూ.25 లక్షలుగా పేర్కొన్నారు.
తమిళనాడు(tamilnadu) అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23న జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయ్ రాజకీయ ప్రస్థానం ఎంతవరకు సక్సెస్ అవుతుందన్నది ఆసక్తికరంగా మారింది. చెన్నై సహా రాష్ట్రవ్యాప్తంగా ఆయన ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి.
Also read: Thalapathy Vijay TVK Candidates List: విజయ్ సంచలన నిర్ణయం.. డ్రైవర్ కుమారునికి MLA టికెట్

గిరిబాబు – నేను MarthaTelugu వెబ్‌సైట్‌లో డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో MA తెలుగు చేశారు. నాకు రైటర్‌గా మూడేళ్ల అనుభవం ఉంది. నాకు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు రాయడంలో ప్రావీణ్యం ఉంది. వార్తలు మాత్రమే కాకుండా పాటలు, కవితలు, షార్ట్ ఫిలిమ్స్ వంటివాటికి మాటలు రాసే అలవాటు ఉంది. సహజంగా జానపద, సినిమా పాటలు గాయకుణ్ణి.
