Google Maps :కొత్త ఫీచర్ వచ్చేసింది.. గూగుల్ మ్యాప్స్‌తో మాట్లాడండి!

Google Maps: టెక్నాలజీ దిగ్గజం Google తన Google Mapsలో కొత్తగా ‘Ask Maps’ అనే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు మ్యాప్స్‌తో నేరుగా మాట్లాడి సమాచారం తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఈ సదుపాయం అమెరికా, భారత్‌లో ప్రారంభమై, హైదరాబాద్ సహా పలు నగరాల్లో వినియోగదారులకు అందుబాటులోకి వస్తోంది.

గత కొన్నేళ్లుగా Google తన మ్యాప్స్(Google Maps)సేవలను మరింత ఆధునికంగా మార్చే దిశగా కృషి చేస్తోంది. నావిగేషన్ మాత్రమే కాకుండా, వినియోగదారులకు అవసరమైన సమాచారం మొత్తం ఒకే ప్లాట్‌ఫామ్‌లో అందించాలనే లక్ష్యంతో ఈ కొత్త ఫీచర్‌ను రూపొందించింది. ముఖ్యంగా AI టెక్నాలజీ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో, మ్యాప్స్‌లో కూడా అదే మార్పులను తీసుకువచ్చింది.

ఈ కొత్త ఫీచర్ వినియోగదారులకు ఎంతో ఉపయోగకరంగా మారనుంది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి భారీ నగరాల్లో ట్రాఫిక్, రెస్టారెంట్లు, ప్రాంతాల వివరాలు తెలుసుకోవడం సులభమవుతుంది. వినియోగదారులు కేవలం ప్రశ్న అడిగితే చాలు, మ్యాప్స్ వెంటనే సమాధానం ఇస్తుంది.

‘Ask Maps-Google Maps ’ ఫీచర్

‘Ask Maps’ అనేది Gemini AI ఆధారంగా పనిచేసే స్మార్ట్ ఫీచర్. ఇది సాధారణ సెర్చ్ కంటే భిన్నంగా పనిచేస్తుంది. వినియోగదారులు “HYDలో బెస్ట్ రెస్టారెంట్స్ ఏవి?” వంటి ప్రశ్నలు అడిగితే, మ్యాప్స్ వాటిని విశ్లేషించి సరైన సూచనలు ఇస్తుంది. ఇది కేవలం ప్రదేశాలను చూపడం మాత్రమే కాకుండా, ఆ ప్రాంతంలోని వాతావరణం, రద్దీ పరిస్థితులు, ప్రత్యేకతలు వంటి వివరాలను కూడా అందిస్తుంది. దీంతో వినియోగదారులకు పూర్తి సమాచారాన్ని ఒకేసారి పొందే అవకాశం లభిస్తుంది.

ఈ ఫీచర్ వల్ల ఉపయోగం!

హైదరాబాద్ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంలో ఈ ఫీచర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రయాణం చేయాలంటే ముందుగానే పరిస్థితులు తెలుసుకోవడం అవసరం. ఈ సందర్భంలో ‘Ask Maps’ ఫీచర్ ఎంతో సహాయపడుతుంది.

ఉదాహరణకు, మీకు అవసరం పాడినప్పుడు “హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్ తక్కువగా ఉన్న మార్గం ఏది?” అని అడిగితే, మ్యాప్స్ వెంటనే ట్రాఫిక్ లేకుండా ఉండే.. ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తుంది. అలాగే “ఇక్కడ దగ్గర్లో మంచి కాఫీ షాప్స్ ఏవి?” అని అడిగితే, మీకు సరైన ఎంపికలను చూపిస్తుంది. ఈ విధంగా Google Maps వినియోగం మరింత సులభం అవుతుంది.

టెక్నాలజీలో కొత్త దశ!

ఈ ఫీచర్ ద్వారా Google టెక్నాలజీలో మరో ముందడుగు వేసినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. AI ఆధారిత సేవలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, మ్యాప్స్ వంటి సాధారణ యాప్‌లను కూడా స్మార్ట్‌గా మార్చడం ఈ ఫీచర్ ప్రత్యేకత. ఇది కేవలం నగరాల్లోనే కాకుండా, గ్రామీణ ప్రాంతాల్లో కూడా వినియోగదారులకు ఉపయోగపడే అవకాశం ఉంది. భవిష్యత్తులో మరిన్ని ఫీచర్లను కూడా జోడించే అవకాశం ఉందని టెక్ విశ్లేషకులు భావిస్తున్నారు.

భవిష్యత్తులో మరిన్ని మార్పులు?

ప్రస్తుతం అమెరికా మరియు భారత్‌లో ప్రారంభమైన ఈ ‘Ask Maps’ ఫీచర్, త్వరలో ఇతర దేశాల్లో కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వినియోగదారుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా మరిన్ని అప్‌డేట్లు వచ్చే అవకాశం ఉందని సమాచారం. హైదరాబాద్ సహా భారతదేశంలోని ప్రధాన నగరాల్లో ఈ ఫీచర్ విస్తృతంగా ఉపయోగంలోకి వస్తే, మ్యాప్స్ వినియోగం పూర్తిగా మారిపోతుందని నిపుణులు అంటున్నారు. టెక్నాలజీతో రోజువారీ జీవితాన్ని సులభతరం చేయడంలో ఇది మరో కీలక అడుగుగా భావిస్తున్నారు.

Also Read: SSB Recruitment 2026 Notification: 1,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్!