New Rules from April 1: భారతదేశంలో ఏప్రిల్ 1 నుంచి పలు కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. డిజిటల్ చెల్లింపులు, పెట్రోల్, బ్యాంకింగ్, ఫాస్ట్‌ట్యాగ్, బీమా రంగాల్లో ఈ కొత్త నిబంధనలు ప్రభావం చూపనున్నాయి. ప్రజల రోజువారీ జీవితంపై కూడా ఈ మార్పులు ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఉంది.
ప్రతి సంవత్సరం ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన ఏప్రిల్ 1 నుంచి కేంద్ర ప్రభుత్వం, ఆర్థిక సంస్థలు కొత్త నియమాలను అమలు చేస్తుంటాయి. ఈసారి కూడా భద్రత, పారదర్శకత, డిజిటల్ వ్యవస్థల బలోపేతం లక్ష్యంగా పలు మార్పులు తీసుకువచ్చారు. ఈ మార్పులు ఎందుకు ముఖ్యమంటే.. ప్రతి ఒక్కరి రోజువారీ లావాదేవీలు, ప్రయాణాలు, బ్యాంకింగ్ కార్యకలాపాలు వీటితో ముడిపడి ఉంటాయి. కాబట్టి ఈ నియమాలను ముందుగానే తెలుసుకోవడం అవసరం.
డిజిటల్ చెల్లింపులపై కొత్త సెక్యూరిటీ రూల్స్(New Rules from April 1)
ఇకపై OTPతో మాత్రమే డిజిటల్ చెల్లింపులు చేయడం సాధ్యం కాదు. ప్రతి ట్రాన్సాక్షన్‌కి కనీసం రెండు ధృవీకరణ పద్ధతులు తప్పనిసరి.
PIN లేదా Password, రిజిస్టర్డ్ డివైజ్, ఫింగర్ ప్రింట్, ఫేస్ ఐడీ ఇలాంటివన్నమాట. ఈ మార్పు వల్ల ఆన్‌లైన్ మోసాలు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు. అయితే వినియోగదారులకు కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉంది.
E20 పెట్రోల్ తప్పనిసరి
దేశవ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకుల్లో ఇకపై E20 పెట్రోల్ అందుబాటులో ఉండడం తప్పనిసరి. ఇది 20% ఎథనాల్ మిశ్రమంతో ఉండే ఇంధనం. పర్యావరణ పరిరక్షణ, దిగుమతుల తగ్గింపు లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
FASTag KYC లేకపోతే అకౌంట్లు బ్లాక్
హైవే టోల్ చెల్లింపులకు ఉపయోగించే FASTag అకౌంట్లకు KYC తప్పనిసరి చేశారు. KYC పూర్తి చేయని అకౌంట్లు బ్లాక్ అవుతాయి. దీంతో టోల్ ప్లాజాల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
బ్యాంక్ ఛార్జీలు పెంపు
కొన్ని బ్యాంకులు డెబిట్ కార్డు నిర్వహణ ఛార్జీలను పెంచాయి. ఇది ఖాతాదారులపై అదనపు భారం పెంచే అవకాశం ఉంది. ఖాతాదారులు తమ బ్యాంక్ వివరాలను చెక్ చేసుకోవడం మంచిది.
బీమా పాలసీలు డిజిటల్ రూపంలోనే
ఇక నుంచి అన్ని కొత్త బీమా పాలసీలు ఎలక్ట్రానిక్ రూపంలో మాత్రమే జారీ చేయాలి. ఇది పేపర్ వినియోగాన్ని తగ్గించడంతో పాటు భద్రతను పెంచుతుంది.
మొత్తం మీద మార్చి నెల ముగియనగానే.. భారత్‌లో అమల్లోకి రానున్న ఈ కొత్త నియమాలు ప్రజల జీవితాల్లో పలు మార్పులను తీసుకురానున్నాయి. ముఖ్యంగా డిజిటల్ చెల్లింపులు, బ్యాంకింగ్, ప్రయాణాలపై ఇవి ప్రభావం చూపనున్నాయి.
Also Read: Jio 30 days recharge plans: జియో 30 రోజుల రీచార్జ్ ప్లాన్లు – ప్రయోజనాలు

గిరిబాబు – నేను MarthaTelugu వెబ్‌సైట్‌లో డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో MA తెలుగు చేశారు. నాకు రైటర్‌గా మూడేళ్ల అనుభవం ఉంది. నాకు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు రాయడంలో ప్రావీణ్యం ఉంది. వార్తలు మాత్రమే కాకుండా పాటలు, కవితలు, షార్ట్ ఫిలిమ్స్ వంటివాటికి మాటలు రాసే అలవాటు ఉంది. సహజంగా జానపద, సినిమా పాటలు గాయకుణ్ణి.
