TVS Apache RTR 160 4V: లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన.. 2026 టీవీఎస్ అపాచీ బైక్ ఇదే!

TVS Apache RTR 160 4V: TVS మోటార్ కంపెనీ తన ప్రముఖ స్పోర్ట్స్ బైక్ అపాచీ RTR 160 4Vను 2026 కోసం కొత్త అప్‌డేట్లతో భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ కొత్త వెర్షన్‌లో వినియోగదారులకు మరింత సౌకర్యం, భద్రత కల్పించే ఫీచర్లను జోడించారు. ముఖ్యంగా టాప్ వేరియంట్‌కు మాత్రమే పరిమితమైన కొన్ని ఫీచర్లను ఇప్పుడు బేస్ వేరియంట్‌లో కూడా అందించడం ప్రత్యేకంగా నిలిచింది.

ఇప్పటి వరకు ఈ సెగ్మెంట్‌లో పోటీ ఎక్కువగా ఉండటంతో కంపెనీలు కొత్త టెక్నాలజీ ఫీచర్లను అందించడంపై దృష్టి పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో TVS Apache RTR 160 4V కూడా కొత్త మార్పులతో మార్కెట్లో తన స్థాయిని మరింత బలపరచుకోవాలని చూస్తోంది.

ఈ బైక్‌లో చేసిన మార్పులు ప్రధానంగా రాత్రి సమయంలో స్పష్టమైన విజిబిలిటీ, రైడింగ్ సేఫ్టీ, మరియు యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లపై దృష్టి సారించాయి. దీంతో యువతతో పాటు రోజువారీ వినియోగదారులను కూడా ఆకట్టుకునేలా కంపెనీ ప్రయత్నించింది.

కొత్త ఫీచర్లు ఏమిటి?

2026 అపాచీ RTR 160 4Vలో క్లాస్-D ప్రోజెక్టర్ హెడ్‌ల్యాంప్‌తో పాటు LED DRLs ఇవ్వడం జరిగింది. ఇది రాత్రి సమయంలో రోడ్డు స్పష్టంగా కనిపించడానికి సహాయపడుతుంది. అదనంగా, అసిస్టు మరియు స్లిప్పర్ క్లచ్ ఇప్పుడు అన్ని వేరియంట్లలో స్టాండర్డ్‌గా అందిస్తున్నారు. ఈ మార్పులతో రైడింగ్ అనుభవం మరింత సాఫీగా మారుతుంది. ముఖ్యంగా ట్రాఫిక్‌లో గేర్ మార్పులు సులభంగా ఉండటానికి ఇది ఉపయోగపడుతుంది.

వేరియంట్లు మరియు ధరలు

ఎంట్రీ లెవల్ సింగిల్ ఛానల్ ABS వేరియంట్: టెలిస్కోపిక్ ఫోర్క్స్, డిజిటల్ LCD క్లస్టర్
మిడ్ వేరియంట్ డ్యూయల్ ఛానల్ ABS (USD ఫోర్క్స్): రూ.1.31 లక్షలు
టాప్ వేరియంట్ USD + TFT స్క్రీన్: రూ.1.37 లక్షలు

టాప్ వేరియంట్‌లో 5 అంగుళాల TFT డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. కలర్స్ విషయానికి వస్తే, మ్యాట్ బ్లాక్, రేసింగ్ రెడ్, మెరైన్ బ్లూ వంటి ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

ఇంజిన్ & పనితీరు

TVS Apache RTR 160 4Vలో 159.7cc సింగిల్ సిలిండర్ ఇంజిన్ యథాతథంగా కొనసాగుతుంది. ఈ బైక్ రెండు రైడింగ్ మోడ్‌లను అందిస్తుంది. స్పోర్ట్ మోడ్‌లో ఈ బైక్ 17.6 hp పవర్, 14.73 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అర్బన్ మరియు రైన్ మోడ్‌లలో పవర్ తగ్గి 15.6 hp మరియు 14.1 Nmగా ఉంటుంది. ఇది రైడింగ్ పరిస్థితులకు అనుగుణంగా పనితీరును మార్చుకునేలా సహాయపడుతుంది.

అమ్మకాల్లో పోటీ..

ఈ కొత్త అప్‌డేట్స్ వల్ల TVS Apache RTR 160 4V మార్కెట్లో మరింత పోటీగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా తక్కువ ధరలో అధిక ఫీచర్లు అందించడం వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. భారతీయ మార్కెట్లో స్పోర్ట్స్ బైక్ సెగ్మెంట్‌లో ఇది యువతకు మంచి ఎంపికగా నిలిచే అవకాశముంది.

Also read:KTM 890 Adventure R Rally 2026: KTM సరికొత్త అడ్వెంచర్ బైక్: కేవలం 700 మాత్రమే!